Skip to main content

అనాథ విద్యార్థులకు గురుకుల జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో నేరుగా అడ్మిషన్!

సాక్షి, హైదరాబాద్: అనాథ పిల్లల విద్యాభివృద్ధికి మరిన్ని అవకాశాలు పెరగనున్నాయి.
ప్రస్తుతం అనాథలకు వెనుకబడిన తరగతుల్లో రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రభుత్వం.. త్వరలో ఉన్నత చదువులకు గురుకుల విద్యా సంస్థల్లో నేరుగా ప్రవేశాలు కల్పించాలని భావిస్తోంది. గురుకుల సొసైటీలు నిర్వహించే అడ్మిషన్ టెస్టులతో సంబంధం లేకుండా అనాథగా గుర్తిం పు పత్రాన్ని సమర్పిస్తే గురుకుల కాలేజీల్లో అడ్మిషన్ కు మార్గం సుగమమవనుంది. ఇందు కు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో విక్టోరియా మెమోరియల్‌ హోం విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ రెసిడెన్షియల్‌ పాఠశాలలో అనాథలకు నేరుగా అడ్మిషన్ ఇస్తున్నారు. అయితే ఇందులో టెన్త్‌ పూర్తి చేసిన విద్యార్థులు తిరిగి ఉన్నత విద్యా సంస్థ ల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. అవకాశాలు దొరకడం లేదు.. ఇప్పటికే పలువురు విద్యార్థులు టెన్త్ తోనే చదువు చాలించి ఇతర పనులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అనాథ విద్యార్థులను ప్రోత్సహించేందుకు గురుకుల విద్యా సంస్థలో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గత వారం రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించారు. విక్టోరియా మెమోరియల్‌ హోం లో టెన్త్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గురుకుల జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా అడ్మిషన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగే ఇతర అనాథ విద్యార్థులకు కూడా అడ్మిషన్లు కల్పించే అంశంపై చర్చించగా.. ఎస్సీ అభివృద్ధి శాఖతో పాటు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అతి త్వరలో సమరి్పంచేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇటు ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనలను అంగీకరించే అవకాశముంది. 2021–22 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే తక్షణమే అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Published date : 08 Mar 2021 04:07PM

Photo Stories