Skip to main content

అక్టోబర్12 నుంచి ట్రిపుల్ ఐటీ ఫైనలియర్ పరీక్షలు

నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 12 నుంచి 16 వరకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు నూజివీడు ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి పి.శ్యామ్ మంగళవారం తెలిపారు.
ఈ ట్రిపుల్ ఐటీలలో ఫైనలియర్ విద్యార్థులు 1,800 మంది వరకు ఉన్నారని, వీరికి ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇంటర్‌నెట్ సదుపాయం లేని వారు క్యాంపస్‌కు వచ్చి ఆన్‌లైన్‌లో పరీక్ష రాయొచ్చని పేర్కొన్నారు.
Published date : 07 Oct 2020 01:40PM

Photo Stories