Skip to main content

ఐసీఎస్‌ఈ పరీక్షలు వాయిదా

ఐసీఎస్‌ఈ సిలబస్‌లో 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదావేస్తూ కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది.
ఈ పరీక్షలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావల్సి ఉండగా.. పది గంటల సమయంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. సీబీఎస్‌ఈ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ నెలాఖరు వరకూ పరీక్షలను వాయిదా వేసుకోవాలని మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షలను యూజీసీ వాయిదావేసింది.

స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు సైతం
కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్‌ఎస్‌సీ)గురువారం ప్రకటించింది. వాయిదా వేసిన పరీక్షల్లో మార్చి 20న జరగాల్సిన కంబైన్‌‌డ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌తోపాటు మార్చి 30న జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్) పరీక్షలు ఉన్నాయి. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో దాదాపు 3.8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ద ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ ప్రకటించింది.
Published date : 20 Mar 2020 03:34PM

Photo Stories