అగ్రి డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
పాలిసెట్–2020లో వచి్చన ర్యాంకుల ఆధారంగా అక్టోబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో వ్యవసాయ డిప్లొమా సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజి్రస్టార్ ప్రొఫెసర్ సుధీర్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020–21 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌ల పరిధిలో ఉన్న 240 సీట్లు, అనుబంధ పాలిటెక్నిక్‌లలోని 630 సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహా్వనిస్తున్నట్లు వెల్లడించారు. పాలిసెట్‌లో ర్యాంకు రాని వారు దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలని, సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా జరుగుతుందని చెప్పారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, మార్గదర్శకాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
Published date : 18 Sep 2020 03:21PM