Skip to main content

ఆగమ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ద్వారకా తిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాలలో విద్యనభ్యసించేందుకు 2021-22 సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈవో ఎస్‌ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థి 5వ తరగతి పూర్తిచేసి ఉండాలని, అలాగే 14 ఏళ్లలోపు వయసు ఉండాలన్నారు. సంప్రదాయ పద్ధతిలో ఉపనీతుడై ఉండాలని సూచించారు. ఈనెల 10 నుంచి 28 వరకు నేరుగా పాఠశాల వద్ద దరఖాస్తులు పొందాలని.. వాటిని 28వ తేదీ సాయంత్రం 4లోపు పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాలన్నారు. వివరాలకు 08829 271527ను సంప్రదించాలని సూచించారు.
Published date : 09 Feb 2021 03:56PM

Photo Stories