అధిక ఫీజులు తిరిగి చెల్లింపుపై సుప్రీం కోర్టు స్టే!!
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లోని మూడు వైద్య కళాశాలలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
ఫీజులు ఎక్కువ వసూలు చేసుకోవచ్చంటూ 2017లో అప్పటి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ 2019 సెప్టెంబర్‌లో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ నారాయణ, పిన్నమనేని సిద్ధార్థ, ఎన్నారై వైద్య కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్, రమేష్ అల్లంకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, భారతీయ వైద్య మండలి, ఏపీ ప్రభుత్వం, ఏపీఎఫ్‌ఆర్‌సీ, పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పాత, కొత్త ఫీజుల మధ్య తేడా సొమ్ము తిరిగి విద్యార్థులకు చెల్లించడంపై స్టే విధించింది. అయితే విద్యార్థులకు ఇచ్చే స్టయిఫండ్‌ను యథావిధిగా కొనసాగించాలని పేర్కొంది. మార్చి 24న తుది వాదనలు వింటామని విచారణ వాయిదా వేసింది.
సిఫార్సులు లేకుండా జీవో..
2017లో ఏపీ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం మూడేళ్లపాటు రూ. 24 లక్షలు చొప్పున సూపర్ స్పెషాలిటీ మేనేజ్‌మెంట్ కోటా ఫీజులు వసూలు చేయొచ్చు. 2011–14 వరకూ ఉమ్మడి ఏపీలో ఏపీ రుసుముల నియంత్రణ కమిటీ (ఏపీఎఫ్‌ఆర్‌సీ) విద్యార్థి నుంచి రూ. 7.5 లక్షలు వసూలు చేయాలని సిఫార్సు చేసింది. కాగా, 2017లో కమిటీ సిఫార్సులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. విద్యార్థికి ప్రతినెలా రూ. 35 వేలు స్టయిఫండ్ ఇవ్వాలని జీవోలో పేర్కొంది. జీవో ప్రకారం విద్యార్థి నుంచి రూ. 24 లక్షల చొప్పున కళాశాలలు వసూలు చేశాయి. ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ విద్యార్థులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. 2011లో ఉన్న ఫీజులనే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని, ఎక్కువగా కట్టించుకున్న సొమ్ములు తిరిగి విద్యార్థులకు అందజేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను కళాశాలలు సుప్రీంలో సవాల్ చేశాయి. వాటి తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం పాత జీవోలను కొనసాగించాలని హైకోర్టు సూచించడం సరికాదన్నారు.

Published date : 23 Feb 2021 04:55PM