ఆదాయంలో మనోళ్లు నెం.1: అమెరికన్ కమ్యూనిటీ సర్వే
దాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వెళ్లిన వారిలో అంతా ఆర్థికంగా స్థితిమంతులు కాలేరు. భారతీయులు మాత్రం ఆదాయంలో ఎక్కడా తగ్గడం లేదు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉండటం.. వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదుచేస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు. ఈ వివరాల ప్రకారం.. అక్కడ స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం.
అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల ఆదాయం ఏటా..
ఇండియన్ | 1,00,500 |
ఫిలిప్పో | 83,300 |
తైవానీస్ | 82,500 |
శ్రీలంకన్ | 74,600 |
జపనీస్ | 72,300 |
మలేసియన్ | 70,300 |
చైనీస్ | 69,100 |
పాకిస్తాన్ | 66,200 |
వైట్-అమెరికన్లు | 59,900 |
కొరియన్ | 59,200 |
ఇండోనేసియన్ | 57,500 |
స్థానిక-అమెరికన్లు | 56,200 |
థాయ్‌లాండ్ | 55,000 |
బంగ్లాదేశీ | 50,000 |
నేపాలీ | 43,500 |
లాటినో | 43,000 |
ఆఫ్రికన్ -అమెరికన్లు | 35,000 |
బ్యాచిలర్ డిగ్రీలోనూ మనమే..
భారతీయులు బుద్ధిమంతులే కాదు, విద్యావంతులు కూడా. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.
ఇండియన్ - అమెరికన్లు | 70% |
కొరియన్ - అమెరికన్లు | 53% |
చైనీస్ - అమెరికన్లు | 51% |
ఫిలిప్పో - అమెరికన్లు | 47% |
జపనీస్ - అమెరికన్లు | 46% |
సగటు అమెరికన్లు | 28% |