Skip to main content

6 వేల అంగన్‌వాడీ భవనాలకు అనుమతి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరువేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న కొన్నింటిలో కనీస సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రభుత్వానికి గతేడాది ప్రతిపాదనలు పంపింది. వీటి నిర్మాణానికి తాజాగా పరిపాలన ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రధానకార్యదర్శి కె.దమయంతి ఉత్తర్వులు జారీ చేశారు. కావాల్సిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ భవనాలను పంచాయతీరాజ్ శాఖ నిర్మించనుందని తెలిపారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.2 లక్షలను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.

జిల్లాల వారీగా అంగన్‌వాడీ భవనాల వివరాలివి...

క్ర.సం.

జిల్లా

సంఖ్య

1.

శ్రీకాకుళం

317

2.

విజయనగరం

357

3.

విశాఖపట్నం

437

4.

తూర్పుగోదావరి

557

5.

పశ్చిమ గోదావరి

517

6.

కృష్ణా

557

7.

గుంటూరు

597

8.

ప్రకాశం

317

9.

ఎస్సీఎస్సార్ నెల్లూరు

397

10.

వైఎస్సార్‌కడప

397

11.

కర్నూలు

557

12.

అనంతపురం

477

13.

చిత్తూరు

516

 

మొత్తం

6,000

Published date : 19 Mar 2020 03:12PM

Photo Stories