Skip to main content

6 రకాలుగా పాఠశాలల వర్గీకరణ: ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలపడమే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచి ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను ప్రభుత్వం తన భుజస్కందాలపై వేసుకుంది. విద్యాపరంగా, వ్యవస్థాపరంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ఆరు రకాలుగా వర్గీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించారు.

చ‌ద‌వండి: జగనన్న అమ్మ ఒడి పథకం: అర్హతలు – ప్రయోజనాలు

చ‌ద‌వండి: 6 రకాలుగా స్కూళ్ల వర్గీకరణ... దీనితో 44 వేల నుంచి 58 వేలకు పెరగనున్న స్కూళ్లు..

విద్యావేత్తలతో చర్చించి సంస్కరణలు..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రభుత్వం వివిధ సర్వేలను నిర్వహించింది. విద్యావేత్తలతో చర్చించి విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల విధానంలో సంస్కరణలు తెస్తూ ఆరు రకాలుగా వర్గీకరించింది.
  •  శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌: ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2
  •  ఫౌండేషన్‌ స్కూల్స్‌ : ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 లతోపాటు ఒకటి, రెండో తరగతులు
  •  ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ : ప్రీప్రైమరీ 1 నుంచి ఐదో తరగతి వరకు
  •  ప్రీ హైస్కూల్స్‌: మూడో తరగతి నుంచి ఏడు (లేదా) ఎనిమిదో తరగతి వరకు
  •  హై స్కూల్స్‌ : మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు
  •  హై స్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌: మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు

ప్రభుత్వ విద్యా సంస్థలకు మహర్దశ
ఈ ఏడాది జగనన్న విద్యా కానుక పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదించింది. విద్యాకానుక, మనబడి, నాడు– నేడు ద్వారా ఇప్పటికే విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రివర్గం పేర్కొంది. ప్రభుత్వ విద్యాసంస్థల దశ, దిశ మారుతోందని తెలిపింది. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నాడు – నేడు తొలి విడత కోసం రూ.3,669 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసింది. ఈ పనుల కోసం మొత్తం రూ.16,021.67 కోట్లు వెచ్చించనుంది. తద్వారా కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దనుంది.

ఇతర నిర్ణయాలు ఇవీ..
  •  హైకోర్టు అభిప్రాయాల మేరకే రాష్ట్ర మావన హక్కుల సంఘం కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించాలని నిర్ణయం. మానవహక్కుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ –జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, పీఆర్వో పోస్టులకు మంత్రివర్గం ఆమోదం.
  •  ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తలో రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్‌ ఇన్వెస్టిగేషన్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–జ్యుడిషియల్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ –అక్కౌంట్స్, లోకాయుక్త, ఉపలోకాయుక్త, రిజిస్ట్రార్లకు పీఏలు, అక్కౌంట్స్‌ ఆఫీసర్, లైబ్రేరియన్, మోటార్‌సైకిల్‌ మెసెంజర్‌ పోస్టుల మంజూరు.
  •  గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్‌ పోస్టు మంజూరుకు ఆమోదం.
  •  పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్‌ టెక్నీషియన్, 8 ల్యాబ్‌ అటెండెంట్ల పోస్టుల మంజూరు. కాంట్రాక్టు పద్ధతిలో టెక్నీషియన్లను, అవుట్‌ సోర్సింగ్‌పై అటెండెంట్లను నియమిస్తారు.
Published date : 07 Aug 2021 03:06PM

Photo Stories