24 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు.. అపోహలను నమ్మవద్దు..
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ని పలు డిగ్రీ రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభం అవుతాయ ని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ ఆదివారం తెలి పారు.
కరోనా కేసుల పెరుగుదల కారణంగా పరీక్షలు వాయిదా పడతాయనే అపోహలను నమ్మవద్దని సూచించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ (సీబీసీఎస్) రెగ్యులర్ కోర్సుల 3, 5 సెమిస్టర్ పరీక్షలకు 1.60 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
Published date : 22 Mar 2021 04:38PM