Skip to main content

10, 12వ తరగతి పరీక్షలు వాయిదా.. ఎక్కడంటే..

సాక్షి, ముంబై: కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 10, 12వతరగతి పరీక్షలు వాయిదా వేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, విద్యా మంత్రి వర్షా గైక్వాడ్, అధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం జరిగింది. కాగా 12వ తరగతి పరీక్షలు మే ఆఖరు వారంలో, 10వ తరగతి పరక్షలు జూన్‌లో నిర్వహించాలని తీర్మానించారు. ఏటా ఫిబ్రవరి, మార్చిలో జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు కరోనా కారణంగా తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో చివరకు విద్యార్ధులకు ఈ విద్యా సంవత్సరంలో నష్టం జరగకుండా మే, జూన్‌లలో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు ఊపిరీ పీల్చుకున్నారు. ముఖ్యంగా విద్యార్ధులకు చదువుకు నేందుకు అదనంగా కొంత సమయం లభించడం తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర బోర్డు పరీక్షల మాదిరిగా సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర బోర్డు పరీక్షలు కూడా వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని వర్షా గైక్వాడ్‌ సూచించనున్నారు.
Published date : 13 Apr 2021 02:10PM

Photo Stories