1 నుంచి 9వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండానే పైతరగతులకు...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో వార్షిక పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1–9 తరగతులు చదివిన విద్యార్థులు 2021–22 విద్యాసంవత్సరంలో తదుపరి పైతరగతికి ప్రమోట్ కానున్నారు. కరోనా సెకండ్‌వేవ్ విలయతాండవం సృష్టిస్తుండటంతో ఇప్పటికే తరగతి గది బోధనకు ఫుల్‌స్టాప్ పడింది. ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది.
Published date : 27 Apr 2021 04:47PM