సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి
Sakshi Education
నేటి యువతకు విద్య.. కేవలం ఉపాధి అవకాశాలు కల్పించే సాధనంగానే ఉండకూడదు.
అభివృద్ధి వేదికలు సృష్టించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి. అప్పుడే ఉన్నత విద్యకు సార్థకత. ప్రస్తుత సామాజిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిరంతర ప్రక్రియగా సాగాలి. ఇది అకడమిక్ స్థాయి నుంచే మొదలుకావాలి’ అంటున్నారు. పెట్రోలియం, ఎనర్జీ విభాగాల్లో ఉన్నత విద్య దిశగా దేశంలో ఏర్పాటైన తొలి పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్.. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (డెహ్రాడూన్) వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పరాగ్ దివాన్. నేటి విద్యార్థులు అవసరాలకు తగిన రీతిలో తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచిస్తున్న ఆయనతో ఇంటర్వ్యూ...
పాఠశాల స్థాయి నుంచే మార్పులు రావాలి
ప్రస్తుతం మన విద్యా వ్యవస్థ, బోధన, అభ్యసనాల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాస్తవ పరిస్థితుల్లో ఎంతో అవసరమైన అప్లికేషన్ ఓరియెంటెడ్ నాలెడ్జ్ విద్యార్థులకు లభించట్లేదు. మనం అనుసరిస్తున్న కరిక్యులం ఇందుకు కారణం. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా కాకుండా.. సమాధానాల్లో ప్రశ్నలు అన్వేషించి సరికొత్త మార్గాలు కనుగొనే విధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా కరిక్యులం ఉండాలి. అప్పుడే విద్యలో నాణ్యత, నైపుణ్యాలు సాధ్యమవుతాయి. ప్రయోగాత్మక అభ్యసన పద్ధతులకు అవకాశం కల్పించాలి. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచే మార్పులు తీసుకురావాలి.
నాణ్యమైన విద్య ఎంతో ముఖ్యం
ఉన్నత విద్యలో నాణ్యత ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, టెక్నికల్ రంగాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే రీతిలో రూపొందగలరు. ఈ విషయంలో ఇన్‌స్టిట్యూట్‌లే స్వయంగా ముందుకు రావాలి. నిర్దిష్ట కోర్సు పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీగా విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే ఇన్‌స్టిట్యూట్, విద్యార్థులు.. ఇద్దరికీ గుర్తింపు లభించడంతోపాటు భవిష్యత్‌లో ప్రయోజనాలు మరింత మెరుగవుతాయి.
ప్రాక్టీస్ ఆధారిత కరిక్యులం
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే కరిక్యులంకు రూపకల్పన జరగాలి. సిమ్యులేషన్స్, పరిశ్రమల్లో వాస్తవ పరిస్థితులను గుర్తించేలా క్షేత్ర స్థాయి అభ్యసనం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు రూపొందుతారు. కానీ ఇప్పటికీ మనం బ్రిటిష్ కాలం నాటి పద్ధతులనే అనుసరిస్తున్నాం. ఈ ధోరణి మారితేనే మన విద్యార్థులు నిజమైన నైపుణ్యాలు సొంతం చేసుకోగలరు.
నిరంతర ప్రక్రియగా ఆర్ అండ్ డీ
విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు, వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడంతోపాటు, సామాజిక అవసరాలను తీర్చేందుకు మరో ముఖ్య మార్గం.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. కానీ మన దేశంలో ఇదే ప్రధాన సమస్యగా మారింది. సీఎస్‌ఐఆర్, డీఎస్‌టీ వంటి రీసెర్చ్ సంస్థలు ఉన్నప్పటికీ కింది స్థాయిలో ఆర్ అండ్ డీ నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య చాలా తక్కువ. దీనికి పరిష్కారంగా ఇండస్ట్రీ, అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్ మధ్య నిరంతర ఒప్పందాలు జరగాలి.
డొమైన్‌కే పరిమితం కాకూడదు
ఇంజనీరింగ్.. నేడు విద్యార్థి లోకంలో అత్యధిక శాతం మంది లక్ష్యంగా నిలుస్తున్న కోర్సు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు కేవలం తమ డొమైన్ సబ్జెక్ట్‌లో నైపుణ్యాల సాధనకే పరిమితం కాకూడదు. మల్టీ డిసిప్లినరీ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అలాంటి అవకాశం ఉన్న వినూత్న బ్రాంచ్‌లను ఎంచుకోవాలి. ఇందుకు ఉదాహరణ పెట్రోలియం ఇంజనీరింగ్. ఈ కోర్సు కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, జియలాజికల్ సైన్స్‌ల సమ్మేళనంగా ఉంటుంది. ఫలితంగా బహుళ అంశాలపై నైపుణ్యం లభిస్తుంది.
ఆసక్తి మేరకు లక్ష్యాలు.. గమ్యాలు
నేడు ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఉపాధి, ఉన్నత విద్య పరంగా తమ కోర్ బ్రాంచ్‌లతో ఏ మాత్రం సంబంధం లేని లక్ష్యాలపై దృష్టి సారిస్తున్న మాట వాస్తవం. కెరీర్ పరంగా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలు పొందడం, ఉన్నత విద్య పరంగా మేనేజ్‌మెంట్ ఇతర కోర్సులు అభ్యసించడం సాధారణ అంశంగా మారింది. అయితే ఇవి ఆయా విద్యార్థుల ఆసక్తుల మేరకు ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులు తమ కోర్ నాలెడ్జ్‌ను అనువర్తించేందుకు అవకాశం ఉంటే ఎలాంటి రంగంలోనైనా రాణించొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. పెట్రోలియం ఇంజనీరింగ్ మొదలు ఎలక్ట్రికల్ వరకు అన్ని విభాగాల్లోనూ సాఫ్ట్‌వేర్ వినియోగం పెరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే కేవలం ప్రోగ్రామింగ్, కోడింగ్, అప్లికేషన్ వంటి విధులనే భావించక్కర్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్స్, డొమైన్ నాలెడ్జ్‌కు సరితూగే సాఫ్ట్‌వేర్ కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగానూ ఇలాంటి ఆలోచననే అమలు చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. మేనేజ్‌మెంట్ కోర్సులనే పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా పరిశ్రమ అవసరాలకు సరితూగే విధంగా టెక్నో-మేనేజ్‌మెంట్ కోర్సుల రూపకల్పన జరుగుతోంది. ఉదాహరణకు పెట్రోలియం మేనేజ్‌మెంట్, టెలికం మేనేజ్‌మెంట్, పవర్ మేనేజ్‌మెంట్ వంటి కోర్ సబ్జెక్ట్‌లతో కూడిన స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
పెట్రోలియం.. పెరుగుతున్న డిమాండ్
పెట్రోలియం, శక్తి రంగాల్లో ఇటీవల కాలంలో మన దేశంలో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. పూర్తి స్థాయిలో పెట్రోలియం, శక్తి రంగాలకు సంబంధించి ఆరు సంస్థలే ఉన్నప్పటికీ.. వాటికి అనుబంధంగా మరెన్నో సంస్థలు కార్యకలాపాలు (ఉదాహరణకు పెట్రోకెమికల్స్ తయారీ సంస్థలు, పెట్రోలియం ఉత్పత్తుల స్టోరేజ్, రవాణా సంస్థలు తదితర) నిర్వహిస్తున్నాయి. వీటన్నిటికీ ఈ రంగంలో నైపుణ్యం పొందిన అభ్యర్థులు కావాలి. విద్యార్థులు కూడా కోర్ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా.. ప్లానింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి ఇతర నైపుణ్యాలు కూడా సొంతం చేసుకుంటే అద్భుత అవకాశాలకు శక్తి రంగంలో ఆస్కారం ఉంది. మరోవైపు పెట్రోలియం రంగం కూడా అంతర్జాతీయ వృద్ధి శాతంతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువగా శరవేగంగా వృద్ధి బాటలో పయనిస్తోంది. కాబట్టి ప్రతిభావంతుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి.
సానుకూల దృక్పథమే సక్సెస్‌కు తొలి సాధనం
నేటి యువత భవిష్యత్తులో విజయాలు సాధించాలంటే ముందుగా అలవర్చుకోవాల్సిన లక్షణం సానుకూల దృక్పథం, సవాళ్లను అవకాశాలుగా మలచుకునే నైపుణ్యం. ఈ రెండూ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాలు సొంతమవుతాయి. మనలో నైపుణ్యాల గని ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా అద్భుతాల తీరం వెంట పయనించొచ్చు. కేవలం ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ అనే కాదు. ఎలాంటి కోర్సుల విద్యార్థులైనా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.

Published date : 16 Dec 2014 04:49PM