బోధనలోనూ మార్పులు రావాలి
Sakshi Education
‘బోధనలో ప్రాక్టికాలిటీ, యాక్టివిటీ లెర్నింగ్‌తోపాటు ఐసీటీ విధానాలు అమలు చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల విద్యార్థులకూ తాజా నైపుణ్యాలు లభిస్తాయి’ అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నూతన డెరైక్టర్ ప్రొఫెసర్ హృషికేశ్ సేనాపతి అంటున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - భోపాల్, భువనేశ్వర్‌లలో 25 ఏళ్ల బోధనానుభవంతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో నైపుణ్యంతో యునెస్కో నుంచి గుర్తింపు పొందిన ప్రొఫెసర్ హృషికేశ్‌తో ఈ వారం గెస్ట్ కాలమ్..
ఎన్‌సీఈర్‌టీ డెరైక్టర్‌గా ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. అవి.. పాఠ్యాంశాలు / పాఠ్య పుస్తకాల్లో మార్పు. అదే విధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానానికి తుది రూపమిచ్చే క్రమంలో మరింత శ్రమించడం. ఇప్పటికే నూతన విద్యా విధానానికి సంబంధించి పలు వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ ఏడాది చివరికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత ఆయా అభిప్రాయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ కొత్త విద్యా విధానాన్ని రూపొందిస్తాం. ఇందులో భాగంగా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తాం.
నూతన పాఠ్యాంశాల రూపకల్పన
విద్యార్థులకు నైపుణ్యాలు అందించే విషయంలో అన్ని స్థాయిలో పాఠ్యాంశాల్లో నిరంతరం మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వాస్తవమే. కచ్చితంగా త్వరలో ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించి, దానికి అనుగుణంగా పాఠ్యాంశాల్లో నిరంతర మార్పులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు నైపుణ్యాలు అందించడం, ప్రాక్టికల్ దృక్పథం వంటి కోణాల్లో ఎన్‌సీఈఆర్‌టీ కూడా ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. జాతీయ స్థాయిలో టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్స్ నిర్వహణ, ఈ-పాఠశాల, ఈ-లైబ్రరీ, వైజ్ఞానిక ప్రదర్శనల ఏర్పాటుకు చేయూతనివ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. వీటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.
జాతీయ స్థాయిలో ఉమ్మడి పాఠ్యాంశాలు
ఇటీవల కొద్ది కాలంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి పాఠ్యాంశాల ఆవశ్యకత గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పదకొండు, పన్నెండు తరగతులకు సంబంధించి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల బోర్డుల పాఠ్యాంశాలు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల బోర్డ్‌ల సిలబస్‌లు సీబీఎస్‌ఈ కంటే కొంత తక్కువ ప్రమాణాలతో ఉన్నాయని, వాటి కారణంగా సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ విద్యార్థులకు ఇతరులతో పోల్చితే కొంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాలకు ఉమ్మడి పాఠ్యాంశాల ద్వారా ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు.
ఉపాధ్యాయులదే కీలక పాత్ర
విద్యార్థులకు అందులోనూ ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు మంచి నైపుణ్యాలు లభించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. క్లాస్‌రూం వాతావరణంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ప్రాక్టికల్ దృక్పథం పెంపొందేలా చూడాలి. ఈ విషయంలో చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయల కొరత ఉందన్న మాట వాస్తవమే. ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయులు తమ విద్యార్థులను పాఠశాల సమీప ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమలు / సంస్థలకు తీసుకెళ్లి, అక్కడ జరిగే కార్యకలాపాలను పాఠ్యాంశాలకు అన్వయిస్తూ వివరించడం వంటివి ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉపయోగించాలి.
ఐసీటీని సమర్థంగా వినియోగించుకోవాలి
విద్యా బోధన / అభ్యసనం రెండు కోణాల్లోనూ ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) వినియోగంతో విద్యార్థులకు తరగతి గదిలోనే మరిన్ని నైపుణ్యాలు లభిస్తాయి. ఇంటర్నెట్, ఆడియో, వీడియో సదుపాయాల కల్పన ద్వారా ఐసీటీని వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఎన్‌సీఈఆర్‌టీ అందిస్తున్న ఈ-పాఠశాల పోర్టల్ ద్వారా నిరంతరం కొత్త అంశాల గురించి తెలుసుకునే అవకాశం ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు లభిస్తోంది. వీటిని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపాలి.
బీఈడీ రెండేళ్లు.. సమంజసమే
బీఈడీ కోర్సు తొమ్మిది నెలల సమయంలో విద్యార్థులకు పెడగాజీపై అవగాహన లభించడం కొంత కష్టం. అదే సమయంలో ఇంటర్న్‌షిప్‌ను కోర్సు చివరలో పేర్కొనడం వల్ల కొన్ని సందర్భాల్లో ఫేక్ ఇంటర్న్‌షిప్‌లు వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే బీఈడీని రెండేళ్ల వ్యవధికి పెంచడం, ఈ సమయంలో ఇంటర్న్‌షిప్, ప్రీ ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లను తప్పనిసరి చేయడం వల్ల ఉపాధ్యాయ విద్య అభ్యర్థులకు బోధన పరంగా మరిన్ని నైపుణ్యాలు, మెళకువలు లభిస్తాయి.
తల్లిదండ్రులూ చొరవ చూపాలి
క్లాస్‌రూం బోధనకు అదనంగా విద్యార్థులు కూడా సొంత నైపుణ్యాలు పొందేందుకు కృషి చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపాలి. అయితే మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల్లో అక్షరాస్యత కొంత తక్కువగా ఉండటం, వారు తమ పిల్లలకు ఇంట్లో తర్ఫీదు ఇచ్చే స్థాయిలో లేకపోవడంతో విద్యార్థులు పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి పరిష్కారం ఉపాధ్యాయులు వృత్తిలో మరింత అంకిత భావంతో కృషి చేయాలి. బోధన పరంగా రూపొందుతున్న కొత్త విధానాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం అందుబాటులోకి తెస్తున్న శిక్షణ కార్యక్రమాల (ఉదాహరణకు పండిట్ మదన్ మోహన్ మాలవీయ నేషన్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్)లో పాల్గొనడం చేయాలి. ఫలితంగా విద్యార్థులకు నైపుణ్యాలు అందించి మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చు.

Published date : 11 Dec 2015 10:35AM