బిడియం వీడితే..భవిష్యత్తు మీదే
Sakshi Education
వ్యక్తిగత దృక్పథం ఆధారంగా విశ్లేషిస్తే కర్తవ్య నిర్వహణలో పురుషుల కంటే మహిళలు కొంత ముందంజలోనే ఉంటారనేది పలు సర్వేలు చెబుతున్నాయి’ అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు)లోని సెంటర్ ఫర్ న్యూరో సెన్సైస్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ రవీంద్రనాథ్.
దేశంలో జండర్ ఇనీక్వాలిటీ ఎక్కువగా ఉన్న 1980ల్లోనే సైన్స్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేసిన ప్రొఫెసర్ విజయలక్ష్మీ రవీంద్రనాథ్ మైసూర్ యూనివర్సిటీలో బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేయడంతోపాటు అమెరికాలోని నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి 1986లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అందుకున్నారు. మహిళల ఆలోచనా తీరు మారితే పోటీ ప్రపంచంలో పురుషులకు దీటుగా రాణించగలరు అంటున్న శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ విజయలక్ష్మీ రవీంద్రనాథ్‌తో గెస్ట్ కాలమ్..
జండర్ ఇనీక్వాలిటీ పరంగా ముందుగా మారాల్సింది మహిళల దృక్పథమే. పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా రాణించలేమనే అనవసరపు ఆందోళనను వీడాలి. అప్పుడు మానసిక సంసిద్ధత, ధైర్యం, పోటీపడగలే శక్తి సామర్థ్యాలు వాటంతటవే లభిస్తాయి. ఎన్నో నైపుణ్యాలు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం, అవగాహన లేమి కారణంగా మహిళలు వెలుగులోకి రాలేకపోతున్నారు.
అసమానతలు.. ప్రాథమిక స్థాయి నుంచే తొలగేలా
స్త్రీ, పురుష అసమానతలు ప్రాథమిక స్థాయి అకడమిక్స్ నుంచే తొలగేలా చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసం కల్పిస్తున్న సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్, ఇతర ప్రోత్సాహకాల కారణంగా పాఠశాల విద్య స్థాయిలో మహిళా విద్యార్థుల డ్రాప్-అవుట్స్ సంఖ్య తగ్గింది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అయితే తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన కల్పించే వారు లేకపోవడం వంటి కారణాలతో ఇప్పటికీ కొంతమంది బాలికలు ఇంటిపనులకో లేదా తల్లిదండ్రులతోపాటు ఉపాధి పనులకు వెళ్లడమో కనిపిస్తోంది. ఈ పరిస్థితి పోవాలంటే క్షేత్ర స్థాయిలో విద్యాధికారులు, ఇతర సాంఘిక సేవా సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
ఉన్నత విద్యకు ఊతమిస్తున్న జండర్ వెయిటేజీ
ప్రస్తుతం మహిళల విద్యా నైపుణ్యాల పరంగా ఆహ్వానించదగిన అంశం ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో జండర్ వెయిటేజీ పేరిట మహిళల కోసం నిర్దిష్ట శాతంలో సీట్ల సంఖ్యను కేటాయించడం. ఇది సత్ఫలితాలనిస్తోంది. ఇలాంటి చర్యలను ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లోనూ అమలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి.
పీహెచ్‌డీ ఔత్సాహికులకు ఎన్నెన్నో ప్రోత్సాహకాలు
మహిళలను సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలవైపు ఆకర్షించే విధంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు, ప్రోత్సాహకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఇటీవల కాలంలో మహిళా విద్యార్థుల దృక్పథమూ మారడంతో ఈ రంగాల్లో వారి భాగస్వామ్యం కూడా క్రమేణా పెరుగుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అందించే జేఆర్‌ఎఫ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు సగం శాతం మహిళలు ఉండటమే ఇందుకు నిదర్శనం.
న్యూరో సెన్సైస్‌లో ఎన్నో అవకాశాలు
అకడమిక్, కెరీర్ పరంగా విశ్లేషిస్తే ప్రస్తుతం న్యూరో సెన్సైస్‌లోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మానవ మెదడు పనితీరుకు సంబంధించి దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. అవి భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. దీంతో ఈ రంగంలో అడుగు పెడితే కెరీర్ ఉంటుందా? లేదా? అని ఆందోళన చెందక్కర్లేదు. అయితే సైన్స్ రంగంలో పరిశోధనలు అంటే అవసరమైన ముఖ్య లక్షణం సహనం, ఓర్పు. ఇన్‌స్టంట్ ఫలితాలు ఆశించి ఈ రంగంలో అడుగుపెట్టొద్దు. సహనం, ఓర్పు ఉంటే ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రోత్సాహకాల కారణంగా పీహెచ్‌డీ స్థాయిలో ఎంట్రీ పరంగా మహిళల సంఖ్య గుర్తించదగిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇక్కడ కూడా డ్రాప్-అవుట్స్ సమస్య ఉంది. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే అకడమిక్ కరిక్యులంను జండర్ ఫ్రెండ్లీగా రూపొందించాలి.
నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే..
మహిళా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇచ్చే ముఖ్య సలహా బిడియం అనే మాటను మదిలో రానీయకూడదు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలోనైనా, ఇతర విభాగాల్లోనైనా ఇతరులతో కలిసి పనిచేయడం తప్పనిసరిగా మారింది. కాబట్టి అందుకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, టీం స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పటికే విజయశిఖరాలను అధిరోహించిన మహిళల స్ఫూర్తిగా ముందడుగు వేయాలి. ఇన్‌స్పిరేషన్ ఈజ్ మెయిన్ టూల్ టువార్డ్స్ సక్సెస్ అని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల ఆసక్తికి అనుగుణంగా కెరీర్ అవకాశాల గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలి.

Published date : 07 Apr 2015 05:24PM