Skip to main content

ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో వైద్య తరగతులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈమేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం ఉత్వర్వులు జారీచేశారు. గత నెలలోనే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కాలేజీలను తెరవడానికి అనుమతులివ్వగా, రాష్ట్రప్రభుత్వం అందుకు అంగీకారం తెలిపింది. అయితే ముందుగా మొదటి, చివరి ఏడాది విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకపోవడంతో 2019-20 సంవత్సరం విద్యార్థులు తమ తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. ఒకనెల పాటు వీరికి నిర్వహణపై పరిశీలన జరిపి అనంతరం విడతలవారీగా అన్ని సంవత్సరాల విద్యార్థులకు తరగతులను ప్రారంభించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇక ప్రాక్టికల్స్‌ను 15 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున.. ఉదయం,మధ్యాహ్నం రెండు పూటల్లోనూ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఈనెల 29న గవర్నర్‌తో సమావేశం ఉండడంతో అందులో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది.
Published date : 28 Jan 2021 03:46PM

Photo Stories