Skip to main content

పీజీ మెడికల్ కాలేజీల్లో ఫీజులు తగ్గొచ్చు.. పెరగొచ్చు !

సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా ఫీజుల పెంపు లేదా సవరణకు సంబంధించి అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) రెండు కీలక సిఫార్సులు చేసింది.
కాలేజీల వారీగా ఫీజులను సవరించాలన్నది సరికొత్త సిఫార్సు కాగా, ప్రస్తుత పద్ధతి ప్రకారం ఫీజులను అన్ని కాలేజీలకు ఒకే రకంగా పెంచాలని మరో సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఇప్పటికే పీజీ ప్రైవేట్ మెడికల్ ఫీజులను కాలేజీల వారీగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వాటినే ఈ ఏడాది ఆయా కాలేజీలు అమలు చేస్తున్నాయి. ఎంబీబీఎస్ ప్రైవేట్ యాజమాన్య కోటా ఫీజులు సవరించాలన్నది కొత్త సిఫార్సు ఉద్దేశం. ఈ రెండింటిపైనా ఏఎఫ్‌ఆర్‌సీలో చర్చించారు. కొందరు కొత్త సిఫార్సుకు మద్దతు పలకగా, మరికొందరు పాత పద్ధతి ప్రకారమే ఫీజులను సవరించాలని కోరినట్లు తెలిసింది.

సర్కారుకు రెండు ప్రతిపాదనలు
బీ, సీ కేటగి రీ ఫీజులను పెం చాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏఎఫ్‌ఆర్‌సీకి విన్నవించాయి. ప్రస్తుతం బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు ఉండగా, సీ కేటగిరీ ఫీజు దానికి (బీ కేటగిరీ ఫీజుకు) రెట్టింపు వరకు వసూలు చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈసారి ఈ ఫీజులు పెంచాలన్నది కాలేజీల విన్నపం. తమ కాలేజీల్లో మౌలిక సదుపాయా లు, పెరిగిన ఖర్చులు తదితర వివరాలతో అకౌంట్ల సమగ్ర నివేదికను కాలేజీలు ఏఎఫ్‌ఆ ర్‌సీకి నివేదిస్తాయి. ఆ ప్రకారమే నివేదించాయి కూడా. కొత్త కాలేజీల వసతులు, ఖర్చులు తక్కువగా ఉండగా, ఏళ్లుగా ఉన్న కాలేజీల ఖర్చులు కొత్త వాటికంటే ఎక్కువగా ఉన్నట్లు ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారణకు వచ్చింది. అందువల్ల ఒకే రకమైన ఫీజు విధానానికి బదులు పీజీ మెడికల్ ఫీజులను ఖరారు చేసినట్లుగానే కాలే జీ ఖర్చును బట్టి ఆ కాలేజీ ఫీజు ఎంబీబీఎస్ లోనూ ఉంటే బాగుంటుందనేది ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు. అయితే రెండు రకాల అభిప్రాయాలు వచ్చినందున ప్రభుత్వానికి రెండు ప్రతిపాదన లను ఏఎఫ్‌ఆర్‌సీ పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ కీలకాధికారి తెలిపారు.

కొన్ని కాలేజీల్లో ఫీజులు తగ్గే అవకాశం
కాలేజీల వారీగా ఫీజులను నిర్ధారించే పరిస్థితి ఉంటే ఒక్కో కాలేజీలో ఒక్కో విధంగా ఫీజు ని ర్ధారణ కానుంది. కొన్నింటిలో ప్రస్తుతమున్న యా జమాన్య కోటా ఫీజు తక్కువ కూడా కావొచ్చని అంటున్నారు. అంటే ప్రస్తుతం బీ కేటగిరీ ఫీజు రూ.11.55 లక్షలుంటే, అది రూ.10 లక్షలు కూడా కావొచ్చని భావిస్తున్నారు. కొత్తగా వచ్చిన కాలే జీల్లో మౌలిక వసతులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని ఆయా కాలేజీలు అందజేసిన అకౌంట్ల ద్వారా ఏఎఫ్‌ఆర్‌సీ ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అలా చేయడం వల్ల కొత్తగా వచ్చిన కాలేజీల్లో ఫీజు కాస్తంత తక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆ ప్రకారం బీ, సీ కేటగిరీ ఫీజులు తగ్గే అవకాశముంది. ఏళ్లుగా పేరున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మరింత ఫీజు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో వాటిల్లో బీ, సీ కేటగిరీ ఫీజులు పెరుగుతాయి. అయితే ప్రభుత్వం ఆ రెండు సిఫార్సుల్లో దేని ప్రకారం ఫీజుల పెంపు లేదా సవరణ చేస్తుందో చూడాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయనుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించట్లేదు.
Published date : 09 Dec 2020 02:59PM

Photo Stories