Skip to main content

ఈ ఏడాది మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 4,050: వైద్యవిద్యా శాఖ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది నెలల్లో నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) జరగనున్న నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య తేలింది.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 4,050 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్టు వైద్యవిద్యా శాఖ ధృవీకరించింది. ఈ ఏడాది పీజీ వైద్య సీట్లు కూడా మొత్తం ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,979 ఉన్నట్టు తేలింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్ కోటా) 335 సీట్లు ఉన్నారుు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ 10 శాతం సీట్లను పెంచుకోవచ్చునని ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లు కేటారుుంచారు.

NEET Study Material and Practice Tests
Published date : 22 Jan 2020 04:03PM

Photo Stories