36 లక్షలు కడితేనే పీజీ వైద్యవిద్య సర్టిఫికెట్లు: పైవేటు వైద్య కళాశాలలు
Sakshi Education
సాక్షి, అమరావతి: అహర్నిశలు కష్టపడి చదివి వైద్యవిద్య సూపర్ స్పెషలిటీ కోర్సుల్లో సీట్లు తెచ్చుకున్న వైద్యులు వారు. కానీ ఆ కోర్సుల్లో చేరగలమో లేదో అని ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల తీరుతో వారికి దిక్కుతోచడం లేదు. రూ.36.75 లక్షలు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోమని చెబుతుండటంతో వారికి ఏంచేయాలో తోచడంలేదు. పీజీ వైద్యవిద్య పూర్తిచేసి సూపర్ సెాలిటీ కోర్సుల్లో సీట్లు తెచ్చుకున్న దాదాపు 200 మంది ఈ ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు తీరుఠ956? వస్తే తాము ఎంత చెల్లించాలంటే అంత చెల్లిస్తామని, అపివరకు బాండ్ ఇస్తామని చెబుతున్నా వైద్య కళాశాలల యాజమాన్యాలు వినడం లేదని ఆవేదన చెందుతున్నారు. వెద్యవిద్య సూపర్ సెాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్షల్లో రాష్ట్రంలోని పలువురు మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. అడ్మిషన్ల సమయంలో పీజీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. లేకపోతే సీట్లు కోలోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. పీజీలో వీరి ఫీజు విషయమై కేసు హైకోర్టులో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. 2017లో ఫీజుల నియంత్రణ కమిటీ పీజీ వైద్యవిద్యకు నిర్ణయించిన ఫీజు ఏడాదికి రూ.7 లక్షలు. ఈ ఫీజును యాజమాన్యాలు రూ.24.5 లక్షలకు పెంచాయి. దీంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఒక్కసారిగా ఇంత ఫీజు పెంచితే కట్టలేరని, ప్రస్తుతం ఏడాదికి రూ.12.25 లక్షలు తీసుకోవాల ని హైకోర్టు సూచించింది. తరువాత తీరుసరించి ఫీజు చెల్లిస్తారని చెపిఠ956?ంది. హైకోర్టు సూచన మేరకు విద్యార్థులు మూడేళ్లకు రూ.36.75 లక్షలు చెల్లించారు. ఇంకా తీరుఠ956? రాకపోవడంతో యాజమాన్యాలు మిగతా రూ.36.75 లక్షలు కూడా చెల్లించాల్సిందేనని పట్టుబడుతు న్నాయి. చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నాయి. కోర్టు తీరుఠ956? మేరకు మిగిలిన మొత్తం చెల్లిస్తామని, అపివరకు బాండు ఇస్తామని విద్యార్థులు చెబుతున్నారు. అయినా కళాశాలల యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో తాము సూపర్ సెాలిటీ కోర్సుల్లో చేరలేమే మోనని వారు భయపడుతున్నారు.
Published date : 19 Oct 2020 04:38PM