ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ ఎగ్జామ్‌కు వ్యూహాలు...
Sakshi Education
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్.. సివిల్స్ తర్వాత అంత క్రేజ్ ఉన్న పరీక్ష. సివిల్స్‌కు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. అర్హులకు డిసెంబర్ 3 నుంచి ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎఫ్‌ఎస్ మెయిన్స్‌లో విజయం సాధించి, తుది దశ ఇంటర్వ్యూకు చేరుకునేందుకు వ్యూహాలు...
ఐఎఫ్‌ఎస్ వైపు ఎక్కువగా సైన్స్ నేపథ్యమున్న అభ్యర్థులు మొగ్గుచూపేవారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులూ పోటీపడుతున్నారు. సక్సెస్ రేటు కూడా అన్ని విభాగాల విద్యార్థుల పరంగా ఏటా పెరుగుతోంది. ఐఎఫ్‌ఎస్-2017 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా సుమారు 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటికోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో 1353 మంది విజయం సాధించి మెయిన్స్‌కు అర్హత సాధించారు.
ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ స్వరూపం...
ఇంగ్లిష్... నిర్లక్ష్యం వద్దు :
చాలామంది ఇంగ్లిష్ పేపర్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది సరికాదు. కాసింత దృష్టి పెట్టి చదివితే మంచి స్కోరు సాధించేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది. రిపోర్ట్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ వంటి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. కనీసం రెండు రోజులు వీటిపైన దృష్టిపెట్టినా మెరుగైన మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంగ్లిష్‌పై దృష్టిసారించక గతంలో చాలా మంది మెరిట్ అభ్యర్థులు 140 మార్కులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కరెంట్ అఫైర్స్‌తో కలిపి జీకే
అభ్యర్థులు అత్యంత శ్రద్ధతో దృష్టిసారించాల్సిన పేపర్ జనరల్ నాలెడ్జ్. ఈ పేపర్‌లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టులు మొదలు సమకాలీన వ్యవహారాల వరకు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగేందుకు అవకాశముంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని, అభ్యర్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. వర్తమాన అంశాలను విశ్లేషించగలిగే నైపుణ్యం అలవరచుకోవాలి.
బేసిక్స్‌పై పట్టు!
అభ్యర్థులు రెండు సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే స్వరూపమున్న సబ్జెక్టులను రెండు ఆప్షనల్స్‌గా తీసుకోకూడదనే నిబంధన ఉంది. ఉదాహరణకు అగ్రికల్చర్ సబ్జెక్టులను ఒక ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునేందుకు వీల్లేదు. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్ నేపథ్యంతో సంబంధమున్న సబ్జెక్టుల నుంచి ఎంపిక చేసుకుంటారు. మరొకటి కొత్త సబ్జెక్టు. ఆప్షనల్ సబ్జెక్టుల ప్రిపరేషన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బేసిక్స్, కాన్సెప్టులు, ఫార్ములాలు, సిద్ధాంతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి.
గత ప్రశ్నపత్రాల సాధన :
గతంలో కంటే ఈసారి సివిల్స్ మెయిన్స్‌కు, ఐఎఫ్‌ఎస్ మెయిన్స్‌కు మధ్య సమయం ఎక్కువగా ఉంది. ఇది అభ్యర్థులకు చక్కటి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌చేయడం ద్వారా విజయానికి మార్గం వేసుకోవచ్చు. గత పదేళ్ల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
అన్నింటికీ సమయం కేటాయించేలా...
ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా టైంటేబుల్ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదివేలా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్టంగా సమయం కేటాయించుకొని, ఆ సమయంలోపు దాన్ని పూర్తిచేసి, వెంటనే మరో సబ్జెక్టుపై దృష్టిసారించాలి.
సివిల్స్‌లోనూ..
అధిక శాతం మంది అభ్యర్థులు ఐఎఫ్‌ఎస్‌తోపాటు సివిల్స్‌పైనా దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్షనల్ పరంగా రెండు పరీక్షలకు ఒకే సబ్జెక్టును ఎంపిక చేసుకుంటే, రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి.
ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన వారు యూపీఎస్సీ ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా డీఏఎఫ్ (డిటైల్డ్ అప్లికేషన్ ఫార్మ్)ను పూర్తిచేయాలి.
డీఏఎఫ్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 7-సెప్టెంబర్ 20.
వెబ్‌సైట్: www.upsc.gov.in
ఇంటర్వ్యూ: మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మలిదశలో 300 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి, తుది జాబితా విడుదల చేస్తారు.
ఐఎఫ్‌ఎస్-2016 కటాఫ్ మార్కులు
ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ స్వరూపం...
పేపర్ | మార్కులు |
1: జనరల్ ఇంగ్లిష్ | 300 |
2: జనరల్ నాలెడ్‌జ | 300 |
3: ఆప్షనల్ సబ్జెక్ట్-1; పేపర్-1 | 200 |
4: ఆప్షనల్ సబ్జెక్ట్-1; పేపర్-2 | 200 |
5: ఆప్షనల్ సబ్జెక్ట్-2; పేపర్-1 | 200 |
6: ఆప్షనల్ సబ్జెక్ట్-2; పేపర్-2 | 200 |
మొత్తం మెయిన్ ఎగ్జామినేషన్ మార్కులు | 1400 |
చాలామంది ఇంగ్లిష్ పేపర్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది సరికాదు. కాసింత దృష్టి పెట్టి చదివితే మంచి స్కోరు సాధించేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది. రిపోర్ట్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ వంటి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. కనీసం రెండు రోజులు వీటిపైన దృష్టిపెట్టినా మెరుగైన మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంగ్లిష్‌పై దృష్టిసారించక గతంలో చాలా మంది మెరిట్ అభ్యర్థులు 140 మార్కులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కరెంట్ అఫైర్స్‌తో కలిపి జీకే
అభ్యర్థులు అత్యంత శ్రద్ధతో దృష్టిసారించాల్సిన పేపర్ జనరల్ నాలెడ్జ్. ఈ పేపర్‌లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టులు మొదలు సమకాలీన వ్యవహారాల వరకు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగేందుకు అవకాశముంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని, అభ్యర్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. వర్తమాన అంశాలను విశ్లేషించగలిగే నైపుణ్యం అలవరచుకోవాలి.
బేసిక్స్‌పై పట్టు!
అభ్యర్థులు రెండు సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే స్వరూపమున్న సబ్జెక్టులను రెండు ఆప్షనల్స్‌గా తీసుకోకూడదనే నిబంధన ఉంది. ఉదాహరణకు అగ్రికల్చర్ సబ్జెక్టులను ఒక ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునేందుకు వీల్లేదు. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్ నేపథ్యంతో సంబంధమున్న సబ్జెక్టుల నుంచి ఎంపిక చేసుకుంటారు. మరొకటి కొత్త సబ్జెక్టు. ఆప్షనల్ సబ్జెక్టుల ప్రిపరేషన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బేసిక్స్, కాన్సెప్టులు, ఫార్ములాలు, సిద్ధాంతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి.
గత ప్రశ్నపత్రాల సాధన :
గతంలో కంటే ఈసారి సివిల్స్ మెయిన్స్‌కు, ఐఎఫ్‌ఎస్ మెయిన్స్‌కు మధ్య సమయం ఎక్కువగా ఉంది. ఇది అభ్యర్థులకు చక్కటి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌చేయడం ద్వారా విజయానికి మార్గం వేసుకోవచ్చు. గత పదేళ్ల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- పిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి బేసిక్స్, కాన్సెప్టులపై పట్టు సాధిస్తూనే వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
- ‘ప్రశ్న - సమాధానం’ కోణంలో స్వయంగా విశ్లేషించుకునే లక్షణాన్ని అలవరచుకోవాలి. దీనివల్ల తాము సదరు సబ్జెక్ట్, టాపిక్ పరంగా ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునే వీలు లభిస్తుంది. అదే విధంగా తాము మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపైనా అవగాహన వస్తుంది.
అన్నింటికీ సమయం కేటాయించేలా...
ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా టైంటేబుల్ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదివేలా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్టంగా సమయం కేటాయించుకొని, ఆ సమయంలోపు దాన్ని పూర్తిచేసి, వెంటనే మరో సబ్జెక్టుపై దృష్టిసారించాలి.
సివిల్స్‌లోనూ..
అధిక శాతం మంది అభ్యర్థులు ఐఎఫ్‌ఎస్‌తోపాటు సివిల్స్‌పైనా దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్షనల్ పరంగా రెండు పరీక్షలకు ఒకే సబ్జెక్టును ఎంపిక చేసుకుంటే, రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి.
ప్రిలిమ్స్‌లో విజయం సాధించిన వారు యూపీఎస్సీ ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా డీఏఎఫ్ (డిటైల్డ్ అప్లికేషన్ ఫార్మ్)ను పూర్తిచేయాలి.
డీఏఎఫ్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 7-సెప్టెంబర్ 20.
వెబ్‌సైట్: www.upsc.gov.in
ఇంటర్వ్యూ: మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మలిదశలో 300 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి, తుది జాబితా విడుదల చేస్తారు.
ఐఎఫ్‌ఎస్-2016 కటాఫ్ మార్కులు
దశ | జనరల్ | ఓబీసీ | ఎస్సీ | ఎస్టీ |
మెయిన్ (1400) | 580 | 485 | 493 | 435 |
ఫైనల్ (1400+300) | 841 | 781 | 742 | 764 |
గత ప్రశ్నపత్రాల సాధనతో ఎంతో మేలు ఐఎఫ్‌ఎస్ మెయిన్స్‌కు సంబంధించి గత ప్రశ్నపత్రాల సాధనతో 90 శాతం మేర సన్నద్ధత లభిస్తుందని చెప్పొచ్చు. పదేళ్ల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మెయిన్స్‌లో విజయావకాశాలను ఖాయం చేసుకోవచ్చు. ఈసారి సివిల్స్, ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ పరీక్షల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంది. ఇది అభ్యర్థులకు చక్కటి అవకాశం. సైన్స్ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకునే వారు ఎక్కువ మార్కులు పొందే వీలుంది. - బి.సునీల్ కుమార్ రెడ్డి, ఐఎఫ్‌ఎస్-2015 విజేత. |
Published date : 15 Aug 2017 12:24PM