DEO Jagan Mohan Reddy: ప్రాథమిక విద్య విద్యార్థి జీవితానికి పునాది
జగిత్యాలరూరల్: ప్రాథమిక విద్య విద్యార్థి జీవితానికి పునాది అని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ శివారులోని సూర్య గ్లోబల్ స్కూల్‌లో సోమవారం రిసోర్స్ పర్సన్లకు వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఈవో హాజరై మాట్లాడారు. ప్రాథమికస్థాయి విద్యార్థులు వారి స్థాయికి తగిన సామర్థ్యం సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఆకర్శణీయమైన అభ్యాస దీపికలు, పాఠ్య ప్రణాళికను ఆవిష్కరించామని, వాటిని సక్రమంగా ఉపయోగించుకుని ఉత్తమ బోధన చేయాలని సూచించారు. మండలస్థాయిలో ఉపాధ్యాయులకు వందశాతం శిక్షణ అందించాలన్నారు. తద్వారా విద్యార్థులు కనీస అభ్యాసన సామర్‌ాత్యలు సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్, జిల్లా సమన్వయకర్త, కోర్సు డైరెక్టర్ తిరుకోవెల నరేందర్, రిసోర్స్ పర్సన్లు అభయ్‌రాజ్, మహేశ్, విజయ్, జయంత్, విజయనంద్, సురేందర్ పాల్గొన్నారు.
Biology teacher: ఆయనో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు సులభ పద్ధతిలో పాఠాలు