Andhra Pradesh: ప్రాంతీయ భాషలో విద్యార్థులకు పోటీలు
సాక్షి ఎడ్యుకేషన్: తపాలా శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా అనే అంశంపై విద్యార్థులకు ప్రాంతీయ భాషలో పోటీలు నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ పి.వెంకటస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి, 18 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారికి రెండు విభాగాలుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Students Debarred in Degree Exams: డిగ్రీ పరీక్షల్లో 26 మంది డీబార్
మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ.10 వేలు, మూడో బహుమతి రూ.5 వేలు గెలుపొందిన వారికి అందజేస్తామన్నారు. దీన్ దయాల్ స్పర్శ్ యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బిళ్లల సేకరణలో విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు ఉపకార వేతన పథకం ప్రవేశ పెట్టటం జరిగిందన్నారు. ఈ పథకంలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పిలాటెలి క్విజ్, పిలాటెలి ప్రాజెక్ట్‌లో పోటీలు నిర్వహించి ఎంపికై న విద్యార్థులకు రూ.6 వేలు వార్షిక ఉపకార వేతనం ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు తపాల శాఖ డివిజనల్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.