Skip to main content

SSC Exam: ఆగస్టు 2 నుంచి ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలు

సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు ప్రభుత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునల్స్‌ తదితర విభాగాల్లో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ /జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. మొత్తం 4,500 పోస్ట్‌లకు సీహెచ్‌ఎస్‌ఎల్ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ప‌రీక్ష‌ల తేదీల‌ను ఎస్ఎస్‌సీ తాజాగా విడుదల చేసింది.
SSC-Exam-Dates
SSC-Exam-Dates

ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్ విడుల చేసింది. సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 22 వరకు, ఎంటీఎస్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 1నుంచి 29 వరకు, ఎస్సై(దిల్లీ పోలీస్) పరీక్షలను అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

చ‌ద‌వండి: SSC CHSL 4500 నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు

పరీక్ష నిర్వహణ తేదీల వివరాలు...


కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్‌ ఎగ్జామ్‌-2023 : 02.08.2023 నుంచి 22.08.2023 వరకు


మల్టీ-టాస్కింగ్(నాన్-టెక్నికల్) స్టాఫ్ అండ్‌ హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్‌) ఎగ్జామ్‌-2023: 01.09.2023 నుంచి 29.09.2023 వరకు


ఎస్సై(దిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్) ఎగ్జామ్‌-2023 : 03.10.2023 నుంచి 06.10.2023 వరకు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 28 Apr 2023 04:09PM
PDF

Photo Stories