Skip to main content

Railway job: రైల్వే ఉద్యోగం మీ ల‌క్ష్య‌మా... అయితే ఇలా స‌న్న‌ద్ధ‌మ‌వ్వండి..!

ప్ర‌పంచంలోనే నాలుగో అతిపెద్ద నెట్‌వ‌ర్క్ భారతీయ రైల్వేస్ సొంతం. దేశంలోనే అత్య‌ధిక మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తోంది. దాదాపు 12 లక్ష‌ల మంది ఉద్యోగులు రైల్వేల‌లో ప‌నిచేస్తున్నారు. అయితే ఇప్ప‌టికీ ఇక్క‌డ ఖాళీలు ల‌క్ష‌ల్లోనే ఉంటున్నాయి.
Indian Railways
రైల్వే ఉద్యోగం మీ ల‌క్ష్య‌మా... అయితే ఇలా స‌న్న‌ద్ధ‌మ‌వ్వండి..!

ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల ప‌రిధిలో 2.50 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు రైల్వేలో ఉద్యోగం సాధించాల‌నుకుంటే ఏ గ్రూప్ ప‌రీక్ష‌కు ఎలా ప్రిపేర‌వ్వాలో తెలుసుకోండి. 

భారతీయ రైల్వేల‌లో ఖాళీల భ‌ర్తీల‌ను బోర్డులు పూర్తి చేస్తాయి. దేశవ్యాప్తంగా 11 రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ)లు ఉన్నాయి. ఈ బోర్డుల‌న్నీ నాలుగు స్థాయిల నియామకాల ద్వారా ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాయి. గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి విభాగాల వారీగా ఖాళీల భ‌ర్తీ ఉంటుంది.  

ఇవీ చ‌ద‌వండి: దేశంలో 2.50 ల‌క్ష‌ల రైల్వే ఉద్యోగాల ఖాళీ.... రిక్రూట్‌మెంట్ ఎప్పుడంటే..?

Railway Trackman

ఆర్ఆర్‌బీ గ్రూప్ ఏ

రైల్వేస్‌లో అత్యున్న‌త ఉద్యోగమంటే అది గ్రూప్ ఏ పోస్ట్‌. గ్రూప్-ఏ పోస్టులకు అర్హత సాధించాలంటే యూపీఎస్సీ పరీక్ష రాయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్‌లో అర్హ‌త సాధించిన వారికి ఫైన‌ల్‌గా ఇంటర్వ్యూ నిర్వ‌హించి అక్క‌డ ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారిని ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. ఇందులోనూ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాలు ఉంటాయి. 

ఆర్ఆర్‌బీ గ్రూప్ బి
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు గ్రూప్-బి పోస్టుల కోసం ప్ర‌త్యేకంగా పరీక్షలు నిర్వహించదు. వీటిని ప‌దోన్న‌తుల ద్వారానే పూర్తి చేస్తారు. గ్రూప్ సి ఉద్యోగ‌స్తుల‌ను ప్ర‌మోష‌న్ ద్వారా వారు గ్రూప్ బిలోకి వ‌స్తారు. 

ఇవీ చ‌ద‌వండి: 1, 2, 3 ర్యాంకులు అమ్మాయిల‌వే.. టాప్ 10లో ఆరుగురు వీరే..!

ఆర్ఆర్‌బీ గ్రూప్ సి
గ్రూప్-సి పోస్టులను మ‌ళ్లీ ప‌రీక్ష‌ల ద్వారానే భర్తీ చేస్తారు. ఆయా రిక్రూట్‌మెంట్ బోర్డులు ఈ పోస్టుల భ‌ర్తీ కోసం ప్ర‌తీ ఏడాది నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తుంటాయి. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌, ట్రైన్‌ క్లర్క్, క్లర్కులు, టికెట్ కలెక్టర్లు, కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటీస్ తదితర నాన్ టెక్నికల్ పోస్టులను గ్రూప్ సి ద్వారా భ‌ర్తీ చేస్తారు.

Railway TC

ఆర్ఆర్‌బీ గ్రూప్ డి
డివిజన్ స్థాయిలో గ్రూప్ డి ఉద్యోగాల‌ను రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ ఆర్ సీ)లు చేప‌డ‌తాయి. షూటర్, సఫాయివాలా, ట్రాక్ మ్యాన్, ప్యూన్, ట్రాకర్ వంటి పోస్టులు ఈ గ్రూప్ లో ఉంటాయి. అలాగే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు రెగ్యులర్ పరీక్షలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహిస్తుంది. 

ఇవీ చ‌ద‌వండి: సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ... ఈ డాక్యుమెంట్లు లేక‌పోతే ఇంటికే..!

పైన తెలిపిన విభాగాల్లోని ఖాళీల భ‌ర్తీ కోసం ప్ర‌తి సంవ‌త్స‌రం నోటిఫికేష‌న్లు విడుద‌ల అవుతూనే ఉంటాయి. అధికారిక వెబ్‌సైట్‌ల‌ను సంద‌ర్శించ‌డం ద్వారా నోటిఫికేష‌న్ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

Published date : 18 Aug 2023 10:53AM

Photo Stories