Skip to main content

JNVST 2026-27 : నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షా విధానం, సిలబస్ విశ్లేషణ తెలుసుకోండి

సాక్షి ఎడ్యుకేషన్: 2026-27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది.
JNV Class 6 Admission Notification 2026-27  Jawahar Navodaya Vidyalaya Entrance Exam Date 2025Jawahar Navodaya Vidyalaya Entrance Exam Timings

మొత్తం 654 నవోదయ విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం అధికారులు రెండు విడతల్లో జేఎన్‌వీ ఎంపిక పరీక్ష (JNVST 2026) నిర్వహించనున్నట్టు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను 2025 డిసెంబర్ 13 (శనివారం), ఉదయం 11:30 గంటలకు నిర్వహించనున్నారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో పరీక్షను 2026 ఏప్రిల్ 11న నిర్వహిస్తారు.

అర్హత కలిగిన విద్యార్థులు జూలై 29, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు లింకు, పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ (ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/) ను సందర్శించండి. 

ఇవి తప్పనిసరి.. ఇంగ్లిష్‌, హిందీతోపాటు తెలుగులోనూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ పద్ధతిలో పెన్ను – పేపర్‌ విధానంలో 2 గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది.

ప్రతి నవోదయ విద్యాసంస్థలో 80 చొప్పున సీట్లు ఉంటాయి.

ప్రవేశ పరీక్షలో ర్యాంకు పొందిన విద్యార్ధులు ఎవరైనా వీటిల్లో సీట్లు పొందవచ్చు. 


Jawahar Navodaya Vidyalaya Selection Test (JNVST) 2025 మొత్తం 120 మార్కులకు ఉంటుంది.

మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో 40 ప్రశ్నలకు 50 మార్కులకు, అర్థమెటిక్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులకు, ల్యాంగ్వేజ్‌ టెస్ట్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.

ఇది నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష విధానం (JNVST 2026 Exam Pattern) మరియు సిలబస్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుగులో తెలుసుకోండి.

పరీక్ష విధానం (Exam Pattern – JNVST 2026):
పరీక్ష రకం: అబ్జెక్టివ్ టైపు (Objective Type – Multiple Choice Questions)
పరీక్ష వ్యవధి: 2 గంటలు (120 నిమిషాలు)
మొత్తం ప్రశ్నలు: 80
మొత్తం మార్కులు: 100

మీడియం: పరీక్షను విద్యార్థి చదివిన భాషలో నిర్వహిస్తారు (ఉదా: తెలుగు, ఉర్దూ, హిందీ మొదలైనవి)

నెగటివ్ మార్కింగ్ లేదు.
విభాగాల వారీగా మార్కుల పంపిణీ (Subject-wise Marks Distribution):
విభాగం                ప్రశ్నలు         మార్కులు            సమయం
                            (నిమిషాల్లో) 
మానసిక సామర్థ్యం 
(Mental Ability)    40 ప్రశ్నలు    50 మార్కులు    60 
అంకగణితం 
(Arithmetic)        20 ప్రశ్నలు    25 మార్కులు    30
భాషా పరీక్ష 
(Language)        20 ప్రశ్నలు    25 మార్కులు    30 

సిలబస్ (Syllabus for JNVST 2026):
1. మానసిక సామర్థ్యం (Mental Ability):

  • (Figures & Patterns)
  • సిరీస్‌లు (Series Completion)
  • దృశ్య తార్కికత (Visual Reasoning)
  • నాన్-వర్బల్ ప్రశ్నలు(non verbal)
  • సమాంతర సంబంధాలు (Analogy)
  • కోడింగ్ & డికోడింగ్(coding&decoding)
  • ప్రతిబింబాలు (mirror, water images)

2. అంకగణితం (Arithmetic):

  • ప్రాథమిక గణితం (Class 3 to Class 5 NCERT Syllabus ఆధారంగా)
  • నంబర్లపై కార్యకలాపాలు (Operations on Numbers)
  • భాగహారాలు (Fractions)
  • సరళ సమీకరణాలు
  • నిష్పత్తులు (Ratios & Proportions)
  • లాభనష్టాలు (Profit & Loss)
  • కాలం & దూరం (Time & Distance)


3. భాషా పరీక్ష (Language Test):

  • వ్యాకరణం (Grammar)
  • కాంప్రహేనసివ్ పాసేజ్ (Comprehension Passage)
  • సరైన పదాల ఎంపిక.
  • వాక్య నిర్మాణం.
  • అర్థాన్ని బట్టి ఖాళీలను పూరించండి.

గమనిక:

  • ఈ పరీక్ష పిల్లల నైపుణ్యాలను, లాజిక్‌ను, ప్రాథమిక శాస్త్రజ్ఞానాన్ని పరీక్షించేందుకు రూపొందించబడింది.
  • NCERT Class 3 to 5 సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.
     
Published date : 02 Jun 2025 09:02AM

Photo Stories