Skip to main content

Jawahar Navodaya Vidyalaya Admission Notification 2026:జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో వ తరగతి ప్రవేశాల 2026 నోటిఫికేషన్‌ విడుదల

2026-27 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.  దేశవ్యాప్తంగా 654 విద్యాలయాల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడుతలగా ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13వ తేదీన ఉదయం 11.30 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో.. జేఎన్‌వీల ప్రవేశ విధానం, విద్యా, బోధన ప్రత్యేకతలు, ప్రవేశ పరీక్ష తదితర వివరాలు.
Jawahar Navodaya Vidyalaya Admission Notification 2026:జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో  ఆరో వ తరగతి ప్రవేశాల 2026 నోటిఫికేషన్‌ విడుదల
Jawahar Navodaya Vidyalaya Class 6 Admission Notification 2026-27 JNVST 2026 entrance exam dates and details Jawahar Navodaya Vidyalaya Admission Notification 2026:జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో వ తరగతి ప్రవేశాల 2026 నోటిఫికేషన్‌ విడుదల

అర్హతలు:

  • వయస్సు: 01 మే 2014 నుండి 31 జూలై 2016 మధ్య జన్మించిన విద్యార్థులు
  • నివాసం: దరఖాస్తు చేస్తున్న జిల్లాలో నివసించాలి మరియు అదే జిల్లాలోని పాఠశాలలో చదువుతున్న వారు

పూర్తిగా ఉచిత విద్య
జేఎన్‌వీలో ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. రెసిడెన్షియల్‌ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్‌ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్‌ వర్గాల(దారిద్య్ర రేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపునిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలో 15.. టీఎస్‌లో 9
జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో దేశ వ్యాప్తంగా మొత్తం 653 నవోదయ పాఠశాలలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఏర్పాటయ్యాయి. ఏపీలోని 15 పాఠశాలల్లో.. 2 పాఠశాలలను ఎస్‌సీ/ఎస్‌టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:JNV 6th Class Admission Exam 2024 Question Paper With Key 

ప్రవేశ పరీక్ష ఇలా
ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌(జేఎన్‌వీఎస్‌టీ) మొత్తం 80 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ఇందులో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, అర్థమెటిక్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలు–25 మార్కులు, లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠి, ఉర్దూ, కన్నడ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా మాధ్యమంలోనూ పరీక్షకు హాజరయ్యే వీలుంది.

జిల్లా స్థాయిలో ఎంపిక
ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో ఏర్పాటైన జేఎన్‌వీల్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు సదరు జేఎన్‌వీ నెలకొన్న జిల్లాకు చెందిన వారై ఉండాలి. జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో సాధించిన మార్కులు,దరఖాస్తు చేసుకున్న జిల్లా, సదరు జిల్లాలో ఉన్న జేఎన్‌వీలో సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని..రిజర్వేష­న్లు తదితర అంశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి­లో తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.

పల్లే విద్యార్థులకు ప్రాధాన్యం
జేఎన్‌వీలలోని సీట్లలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను పల్లే ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధంగా మహిళా విద్యార్థులను సైతం ప్రోత్సహించే విధంగా.. మొత్తం సీట్లలో మహిళా విద్యార్థులకు 33 శాతం (1/3 వంతు) సీట్లను కల్పిస్తున్నారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: https://cbseitms.rcil.gov.in/nvs/

అవసరమైన పత్రాలు:

  • జన్మ ధృవీకరణ పత్రం
  • నివాస ధృవీకరణ పత్రం
  • 5వ తరగతి చదువుతున్న పాఠశాల నుండి ధృవీకరణ
  • విద్యార్థి మరియు తల్లిదండ్రుల ఫోటో, సంతకం
  • ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలు (కాస్ట్, ఎకనామిక్ స్టేటస్ మొదలైనవి)

ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 30 మే 2025
  • దరఖాస్తు చివరి తేదీ: 29 జూలై 2025

ఎగ్జామ్ తేదీలు:

  • సమ్మర్ బౌండ్ ప్రాంతాలు: 13 డిసెంబర్ 2025
  • ఇతర ప్రాంతాలు: 11 ఏప్రిల్ 2026 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jun 2025 09:45AM
PDF

Photo Stories