JEE Mains 2024: ముగిసిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత.. ఫలితాల వివరాలు!
మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా 12.80 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇందులో ఎంతమంది పరీక్షకు హాజరయ్యారన్న విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రటించాల్సి ఉంది. పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 12వ తేదీలోపు ప్రకటించే అవకాశముంది. రెండో విడత మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.
ఈ విడత పరీక్షకు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసిన వా రు మళ్లీ చెయాల్సిన అవసరం లేదు. చాలా రాష్ట్రా ల్లో ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమయ్యే హడావివుడిలో తొలి దశ మెయిన్స్‌పై చాలా మంది విద్యార్థు లు పెద్దగా దృష్టి పెట్టలేదు.
అనధికారికంగా అంది న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసిన వారి లో 75 వేల మంది పరీక్షకు హాజరవలేదు. వీళ్లు, కొత్తగా దరఖాస్తు చేసేవారితో కలుపుకొని రెండో విడత పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగే అవకాశం.
చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!
పరీక్ష కఠినమే.. గత ఏడాది కన్నా తేలికే
గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి జేఈఈ మెయిన్స్ కాస్త కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ కాలంలో సిలబస్ తగ్గించడం వల్ల మెయిన్స్‌లోనూ ఈసారి కొన్ని టాపిక్స్ ఇవ్వలేదు.
అయినప్పటికీ పేపర్ కఠినంగానే ఉందంటున్నారు. గత సంవత్సరం ఇంత కన్నా కఠినంగా పేపర్ ఇచ్చారని మేథ్స్ నిపుణుడు ఎంఎన్ రావు తెలిపారు. దాంతో పోలిస్తే ఈసారి ఫర్వాలేదని ఆయన అన్నారు.
మేథ్స్‌లో ఈసారి కూడా సుదీర్ఘ ప్రశ్నలు ఇచ్చారు. దీనికి సమాధానాలు రాబట్టడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని మెయిన్స్ పరీక్ష రాసిన హైదరాబాద్ విద్యార్థి విక్రమ్ తెలిపారు.