JEE Main 2023: సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల
విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్ ‘https://jeemain.nta.nic.in’ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మెయిన్ సెకండ్ సెషన్ ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 290 పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 25 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటుచేసింది. విద్యార్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాలో తెలియజేసేలా ఎన్‌టీఏ ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్లను ముందుగా విడుదల చేస్తుంది. విద్యార్థులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి, పరీక్షల రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
విద్యార్థులు వారి దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా సిటీ ఇంటిమేషన్ లెటర్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. వీటిని కూడా త్వరలోనే ఎన్‌టీఏ విడుదల చేయనుంది. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఏర్పడితే 011–40759000 ఫోన్ నెంబర్లో లేదా ‘్జ్ఛ్ఛఝ్చజీnఃn్ట్చ.్చఛి.జీn’ ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్‌టీఏ సూచించింది. విద్యార్థులు ఎన్‌టీఏ అధికారికి వెబ్‌సైట్లలో వచ్చే సూచనలను అనుసరించాలని సూచించింది.