Skip to main content

JEE 2022: సన్నద్ధతకు సమయమేదీ?

ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. జాయింట్‌ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2022–23 నిర్వహణ విషయంలో కేంద్ర విద్యా శాఖ, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టీఏ) గందరగోళ చర్యలే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
JEE 2022 preparation plan
జేఈఈ సన్నద్ధతకు సమయమేదీ?

జేఈఈ షెడ్యూల్‌ను ఆరేడు నెలలకు ముందుగానే ప్రకటించాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్ నిర్వహించాల్సి ఉంది. అనంతరం ఏప్రిల్‌ లేదా మేలో రెండో విడత పరీక్షను జరపాల్సి ఉండగా పరీక్ష షెడ్యూల్, తేదీల విషయంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారు.

చ‌ద‌వండి: JEE Advanced 2022: ఇంటర్‌తోపాటు అటు అడ్వాన్స్‌డ్‌కూ... నిపుణుల సలహాలు, సూచనలు...

విద్యార్థులకు ఇబ్బందులు..

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత నిర్వహించేలా ఎన్ టీఏ షెడ్యూల్‌ ఇచ్చింది. అప్పటికే పలు రాష్ట్రాల ఇంటర్మీడియెట్, హయ్యర్‌ సెకండరీ బోర్డులు తమ పబ్లిక్‌ పరీక్షల తేదీలను ప్రకటించాయి. సరిగ్గా అవే తేదీల్లో జేఈఈ పరీక్షలు నిర్వహించేలా ఎన్ టీఏ షెడ్యూల్‌ ఇవ్వడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. చివరకు ఇంటర్‌ పరీక్షల తేదీలను కొన్ని బోర్డులు మార్పు చేసుకున్నాయి. అప్పటికే బోర్డుల పరీక్షలతో జేఈఈ తేదీలు క్లాష్‌ అవుతుండడంతో ఎన్ టీఏ మెయిన్ పరీక్ష తేదీలను ఏప్రిల్‌ 21 నుంచి మే 4 వరకు నిర్వహించేలా మార్పు చేసింది. తమ తొలి షెడ్యూల్‌ను మార్పు చేసిన ఇంటర్‌ బోర్డులు మళ్లీ తమ పరీక్షల తేదీలను మార్చుకోవలసి వచ్చింది. జేఈఈ మెయిన్‌ షెడ్యూళ్ల గందరగోళంతో పలు రాష్ట్రాల బోర్డులు/సీబీఎస్‌ఈ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.

చదవండి: 

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) గైడెన్స్

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) వీడియో గైడెన్స్

జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) ప్రివియస్‌ పేపర్స్

ఓ వైపు ఇంటర్‌.. మరోవైపు జేఈఈ

ఎన్ టీఏ అస్తవ్యస్త షెడ్యూళ్లతో విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాస్తూనే జేఈఈ మెయిన్ రాయాల్సిన అగత్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలను జేఈఈ మెయిన్ తొలి విడత ముగిశాక మే 6 నుంచి 24 వరకు నిర్వహించేలా మార్పు చేశారు. దీంతో విద్యార్థులు మెయిన్ తొలి విడత పరీక్షలకు సన్నద్ధమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్‌ పరీక్షలు ముగిశాక అయినా జేఈఈకి సిద్ధమవుదామనుకుంటే వెనువెంటనే మెయిన్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో ఆ అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇంటర్‌ పరీక్షలకు, జేఈఈకి కనీసం 60–90 రోజుల వ్యవధి అవసరమవుతుందని, కానీ ఇక్కడ ఒక్కరోజు కూడా అవకాశం లేకుండా వెంటనే పరీక్షలకు సిద్ధపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సన్నద్ధతకు వీలుగా మెయిన్ పరీక్షల తేదీలను మార్పు చేయాలని కోరుతున్నారు.

Sakshi Education Mobile App
Published date : 06 Apr 2022 02:54PM

Photo Stories