Jee Advanced 2023: పరీక్ష తేదీ ఇదే.. ఈ ర్యాంకుల ఆధారంగానే ఐఐటీలలో ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఐఐటీ గౌహతి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇప్పటికే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు ఆప్షన్లు కూడా ఇచ్చింది. గత నెలలో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దేశవ్యాప్తంగా హాజరయ్యారు. వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
ఏటా ఇదే విధంగా ఎంపిక చేస్తున్నా 1.50 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు వెళ్తున్నారు. అడ్వాన్స్‌డ్‌లో వచ్చే ర్యాంకుల ఆధారంగానే ఐఐటీలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది.
Published date : 02 Jun 2023 03:01PM