JEE MAIN - 2015 జయాన్ని ఖాయం చేసుకోవాలంటే...
Sakshi Education
సాంకేతిక విద్య.. నేటి ఆధునిక ప్రపంచంలో సమున్నత కెరీర్ దిశగా వెళ్లేందుకు సరైన దారి! అందుకే ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేసి, కెరీర్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు కలలుగంటారు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ఉత్తమ మార్గం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ).. ఇది నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వీలుకల్పించే పరీక్ష. అంతేకాదు.. ఐఐటీల్లో సీటు కోసం పోటీపడాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్‌లో మెరుగైన మార్కులు సంపాదించాల్సిందే!
తాజాగా జేఈఈ మెయిన్-2015కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో విజయ శిఖరాన్ని అందుకునేందుకు సీనియర్ ఫ్యాకల్టీ ఎం.ఎన్.రావు అందిస్తున్న సూచనలు...
గత రెండేళ్ల మాదిరిగానే జేఈఈ మెయిన్-2015 కూడా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధానాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఖరారు చేస్తారు. అందువల్ల విద్యార్థులు ఇంటర్‌లో వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి.
పరీక్ష విధానం:
బీఈ/బీటెక్ కోర్సు కోసం పేపర్-1, బీఆర్క్/బీప్లానింగ్ కోర్సులో చేరాలనుకునే వారు పేపర్-2 రాయాలి. పేపర్-1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత పరీక్షలో ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. కచ్చితమైన సమాధానానికి +4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కులు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నల సంఖ్య, మొత్తం మార్కుల్లో మార్పులు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.
మ్యాథమెటిక్స్
మ్యాథమెటికల్ రీజనింగ్; వేరియన్స్, మీన్ డీవియేషన్; స్టాండర్డ్ డీవియేషన్‌లో ఆరోహణ, అవరోహణ క్రమం చాలా ముఖ్యమైనవి. మీన్ వాల్యూ థీరమ్; సెట్స్ అండ్ రిలేషన్స్; 3డీ లైన్స్-ప్లేన్స్; వెక్టార్స్ ఆల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; మ్యాట్రిసెస్; ప్రమేయాల్లో రేంజ్, డొమైన్; డెఫినెట్ ఇంటెగ్రల్స్; కంటిన్యుటీ; డిఫరెన్షిబిలిటీ; మాక్సిమ-మినిమ అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే కాన్సెప్టులపై పట్టు సాధించాలి.
ఫిజిక్స్
గత పరీక్షల సరళిని ప్రశ్నిస్తే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. అయితే కాన్సెప్టులను అర్థం చేసుకుని, వాటికి సంబంధించిన ప్రశ్నలు, అనువర్తనాలు, సమస్యల్ని సాధిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్; ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్‌లో సెల్ఫ్ ఇండక్షన్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ ముఖ్యమైనవి.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా చూస్తే కెమికల్ కైనటిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు ముఖ్యమైనవని తెలుస్తోంది. అభ్యర్థులు వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, గ్రూప్స్, ప్రాక్టికల్ కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో మంచి ఫలితాలు సాధించవచ్చు.
ముఖ్య తేదీలు:

- మోడర్న్ ఫిజిక్స్‌లో బైండింగ్ ఎనర్జీ, లాజిక్ గేట్స్, హాఫ్ లైఫ్ టైమ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. హీట్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ అంశాలు కూడా ముఖ్యమైనవి.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా చూస్తే కెమికల్ కైనటిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు ముఖ్యమైనవని తెలుస్తోంది. అభ్యర్థులు వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, గ్రూప్స్, ప్రాక్టికల్ కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో మంచి ఫలితాలు సాధించవచ్చు.
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు: నవంబర్ 7, 2014- డిసెంబర్ 18, 2014.
- పరీక్ష తేదీ (ఆఫ్‌లైన్): ఏప్రిల్ 4, 2015.
- పరీక్ష తేదీలు (ఆన్‌లైన్): 2015, ఏప్రిల్ 10, 11.
- వెబ్‌సైట్: jeemain.nic.in
Published date : 15 Nov 2014 02:38PM