Skip to main content

జేఈఈ మెయిన్-2014 ప్రత్యేకం...

ఇంజినీరింగ్ ఔత్సాహిక అభ్యర్థుల భవిష్యత్ కెరీర్‌ను నిర్దేశించే కీలక పరీక్ష జేఈఈ మెయిన్. ఇందులో విజయం సాధించేందుకు అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయం చాలా ముఖ్యమైంది. ఎవరికి వారు సొంత ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకొని ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఏ అంశాలలో బలహీనంగా ఉన్నారో, ఆయా అంశాలపై ఎక్కువ దృష్టిసారించేందుకు వీలవుతుంది. నమూనా పరీక్షలు ఆత్మవిశ్వాసాన్ని, సమయపాలనను పెంపొందించు కునేందుకు ఉపయోగపడతాయి.. ఈ నేపథ్యంలో మీ భవిత అందిస్తున్న తుది దశ వ్యూహాలు, నమూనా ప్రశ్నపత్రం..

  • నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, కేంద్రం నిధులతో నడిచే సాంకేతిక సంస్థలతో పాటు మరికొన్ని ఇతర సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ వీలుకల్పిస్తుంది. దీనికి 60 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన మొదటి 1,50,000 మంది విద్యార్థులు ఐఐటీలు, ఐఎస్‌ఎం ధన్‌బాద్‌లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అర్హులు.
  • ఏటా జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నల సంఖ్య, వాటికి కేటాయించే మార్కుల సంఖ్య మారుతుంటుంది. అందువల్ల సమాధానాలను గుర్తించే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా సూచనలను జాగ్రత్తగా చదవాలి.
మ్యాథమెటిక్స్
  • గత పరీక్ష పత్రాన్ని పరిశీలిస్తే దాదాపు 70 శాతం ప్రశ్నలు తేలికైనవి. మిగిలిన 30 శాతం క్లిష్టంగా ఉన్నాయి. అభ్యర్థులు తేలికైన ప్రశ్నలన్నింటికీ పూర్తిస్థాయిలో సమాధానాలు గుర్తించేలా సిద్ధమవాలి. పరీక్షలో అసెర్షన్- రీజన్, స్టేట్‌మెంట్ వంటి రూపాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నీ అప్లికేషన్స్ ఆధారంగా ఉంటున్నవే. ఈ సమస్యల్ని సాధించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ముఖ్యమైన అంశాలు:
  • సర్కిల్స్, స్టాటిస్టిక్స్, ఫంక్షన్స్, లిమిట్స్, కంటిన్యుటీ.
  • మ్యాట్రిసస్ అండ్ డిటర్మినెంట్స్.
  • పెర్ముటేషన్, కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ.
  • డెఫినిట్ ఇంటెగ్రల్స్.
  • డిఫరెన్షిబిలిటీ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్.
  • 3డీ జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ నంబర్స్.
రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌తో పోలిస్తే మూడు అదనపు అంశాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. అవి..
  1. Mathematic Reasoning.
  2. Sets and Relation.
  3. Progressions.
విజయానికి మార్గాలు:
  • కాలిక్యులస్, ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ఎక్కువ మొత్తాన్ని ఈ అంశాల పునశ్చరణకు కేటాయించాలి.
జేఈఈ మెయిన్-2013 అంశాల వారీగా ప్రాధాన్యం
  • కోఆర్డినేట్- 17 శాతం
  • ఆల్జీబ్రా- 30 శాతం
  • కాలిక్యులస్- 23 శాతం
  • ట్రిగనోమెట్రీ-10 శాతం
  • ప్రాబబిలిటీ- 3 శాతం
  • వెక్టార్స్ అండ్ 3-డి- 10 శాతం
  • లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్- 7 శాతం
ఫిజిక్స్
  • ఫిజిక్స్‌లో అధిక మార్కుల సాధనకు ప్రాథమిక భావనల (Basic concepts)పై పట్టు సాధించడం తప్పనిసరి. ఈ భావనల అప్లికేషన్స్‌పై దృష్టిసారించాలి.
  • ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే, మూడింట ఒకొంతు మార్కులు సాధించవచ్చు. వీటి పునశ్చరణకు వీలైనంత అధిక సమయాన్ని కేటాయించాలి.
  • మెకానిక్స్, జనరల్ ఫిజిక్స్ అంశాలు కూడా ముఖ్యమైనవి. మెకానిక్స్‌లో రిజిడ్ బాడీ రొటేషన్, మోషన్ ఆన్ ఏ ప్లేన్ ఉప అంశాలు ప్రధానమైనవి.
  • రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్ అంశాలకు 10 శాతం- 15 శాతం ప్రాధాన్యత ఉంటుంది. Young's Double Slit Experiment (ఫిజికల్ ఆప్టిక్స్) నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల దీనికి సంబంధించిన వివిధ అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
  • థర్మో డైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్‌లలోని కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఉమ్మడిగా ఉన్నాయి. అందువల్ల వీటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
  • ఆప్టికల్ వేవ్స్, ట్రాన్స్‌వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నల మధ్య సారుప్యం ఉంటోంది.
జేఈఈ మెయిన్- 2013:
పాఠ్యాంశం ప్రశ్నల శాతం
ఎలక్ట్రో డైనమిక్స్ 30
హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 7
మెకానిక్స్ 23
మోడర్న్ ఫిజిక్స్ 17
ఆప్టిక్స్ 13
ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్ 10

కెమిస్ట్రీ
  • కెమిస్ట్రీ పాఠ్యాంశాలను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. 1. ఫిజికల్ కెమిస్ట్రీ. 2. ఆర్గానిక్ కెమిస్ట్రీ. 3. ఇనార్గానిక్ కెమిస్ట్రీ. గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ఈ మూడు విభాగాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం పునశ్చరణ చేయాలి.
  • ముఖ్యమైన అంశాలు: పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, మోల్ కాన్సెప్ట్ (కాన్సన్‌ట్రేషన్స్ కలిపి), రిడాక్స్ రియాక్షన్స్, క్వాలిటేటివ్ అనాలిసిస్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ చాప్టర్లపై తప్పనిసరిగా పట్టు సాధించాలి.
  • ఇచ్చిన సమస్యను బట్టి సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం పెంపొందించుకోవాలి.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి తేలిగ్గా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా ముఖ్యమైంది. ఇందులోని అంశాలను ఎంతబాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది.
  • చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌కు సంబంధించి నోట్స్ రాసుకొని ఉంటే, దాన్ని ప్రస్తుతం రివిజన్ చేయాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, అవసరమైన నిబంధలను చదవాలి.
  • ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు.
  • కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని మెటలర్జీ, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు.
జేఈఈ మెయిన్-2013 అంశాల వారీగా ప్రశ్నలు:
అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ 3
కెమికల్ బాండింగ్ 4
Stoichiometry 3
స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 2
కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం 1
కెమికల్ కైనటిక్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ 1
కెమికల్ థర్మోడైనమిక్స్ 1
జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫంక్షనల్ గ్రూప్-1 4
ఆర్గానిక్ కెమిస్ట్రీ- ఫంక్షనల్ గ్రూప్-2 2
ఆర్గానిక్ కెమిస్ట్రీ- ఫంక్షనల్ గ్రూప్-3 2
కెమిస్ట్రీ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ 2
ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ 2
కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ఆర్గానోమెటాలిక్స్ 1
సర్ఫేస్ కెమిస్ట్రీ 1
బయో మాలిక్యూల్స్ 1

జేఈఈ మెయిన్-2014 తేదీలు:
ఆఫ్‌లైన్ పరీక్ష:
ఏప్రిల్ 6, 2014.
పేపర్ 1 (బీఈ/ బీటెక్): 9.30 A.M. - 12.30 P.M.
పేపర్ 2 (బీఆర్క్/ బీప్లానింగ్):2 P.M. - 5 P.M.
ఆన్‌లైన్ పరీక్షలు: ఏప్రిల్ 9, 11, 12, 19.

జేఈఈ మెయిన్ (2013) కటాఫ్
2013 జేఈఈ మెయిన్ నుంచి 1,50,000 మంది విద్యార్థులు ఈ కింది కటాఫ్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు.
కేటగిరీ మొత్తం మార్కులు - 360
కామన్ మెరిట్ లిస్ట్ 113
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) 70
ఎస్సీ 50
ఎస్టీ 45

జేఈఈ మెయిన్ పరీక్ష విధానం:
కోర్సు పేపర్ సబ్జెక్టులు వ్యవధి
బీఈ/ పేపర్-1 ఫిజిక్స్,
బీటెక్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ 3 గం.
బీఆర్‌‌క/ పేపర్-2 మ్యాథ్స్
బీ ప్లానింగ్ డ్రాయింగ్ టెస్ట్,
3 గం.
మెయిన్ వెబ్‌సైట్: www.jeemain.nic.in
  • పరీక్ష రాసేటప్పుడు కచ్చితత్వం, సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరమైన చోట Shortcuts, Tips ఉపయోగించాలి. నెగిటివ్ మార్కులున్నాయి కాబట్టి ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించామనే దానికంటే ఎంత కచ్చితంగా సమాధానాలు గుర్తించామన్నదే ముఖ్యం.
  • పరీక్ష గదిలో మొదటి ఐదారు నిమిషాల్లో ప్రశ్నపత్రం మొత్తం ఆసాంతం చదవాలి. తొలుత సులువైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం పూర్తిచేయాలి. తర్వాత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
  • ఇప్పటికే చాలా నమూనా పరీక్షలు రాసి ఉంటారు. ఇప్పుడు మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక భావనలు, సూత్రాలను బాగా ఒంటబట్టించుకోవాలి. ఇప్పుడు కొత్త అంశాలను చదవాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. రెండు, మూడు గ్రాండ్ టెస్ట్‌లు రాసి, తప్పులను సరిదిద్దుకోవాలి.
Published date : 27 Mar 2014 03:11PM

Photo Stories