JEE Advanced: టెన్త్‌లో స్టేట్ టాపర్... జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో అడ్డదారి తొక్కి... అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థి
మొత్తం నలుగురు విద్యార్థులకు జవాబులు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. వారంతా వివిధ సెంటర్లలో పరీక్ష రాస్తున్న విద్యార్థులను పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: Jee Advanced 2023: పరీక్ష తేదీ ఇదే.. ఈ ర్యాంకుల ఆధారంగానే ఐఐటీలలో ప్రవేశాలు
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో ఉన్న ఓ కాలేజీలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఎలాగైనా మంచి స్కోర్ సాధించాలనుకుని, అడ్డదారి తొక్కారు. పరీక్ష పాసయ్యేందుకు స్మార్ట్ కాపీయింగ్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు.
ఆదివారం జరిగిన పరీక్షకు తెలివిగా తమ స్మార్ట్ ఫోన్లతో ఎగ్జామ్ సెంటర్‌కు హాజరయ్యారు. ఈ నలుగురిలో టాపర్ అయిన చింతపల్లి చైతన్య కృష్ణకు ప్యాట్నీలోని ఎస్‌వీఐటీ కాలేజీలో సెంటర్ పడింది. అక్కడ పరీక్ష రాసిన చైతన్య కృష్ణ.. ఆ సమాధానాలకు సంబంధించిన ఫొటోలను తమ వాట్సాప్ గ్రూప్‌లో ఫొటోలు పెట్టాడు. అవి చూసి ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న మిగిలిన విద్యార్థులు సమాధానాలు కాపీ చేసుకున్నారు.
చదవండి: ఐఐటీల్లో ప్రవేశానికి 75% మార్కులు కంపల్సరీ... లేదంటే మీకు సీటు రాదు.!
ఈ క్రమంలో చైతన్య కృష్ణపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ అతన్ని చెక్ చేయగా స్మార్ట్ ఫోన్ లభించింది. దీంతో ఎగ్జామ్ సెంటర్‌లోని అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎగ్జామ్ హాల్‌కు వచ్చిన పోలీసులు చైతన్య కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా మిత్రులకు సమాధానాలు పంపించినట్లు గుర్తించారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడి పట్టుబడిన విద్యార్థి టాపర్ అని తెలుస్తోంది. అతనికి టెన్త్‌లో 600 మార్కులకు 600 మార్కులు వచ్చాయి. ఇంటర్‌లో 940 మార్కులు సాధించాడు. స్నేహితులకు సహాయపడాలనే ఉద్దేశంతో కాపీయింగ్‌కు పాల్పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చైతన్య కృష్ణ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
➤☛ రెండు కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన హైదరాబాదీ అమ్మాయి
దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ విధానంలో జరిపిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది హాజరైవుంటారని అంచనా.