యూపీఎస్‌సీ ఇంటర్వ్యూల్లో సక్సెస్‌కు సోపానాలు
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్‌తో పాటు వివిధ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతుంది. ఏటా క్రమం తప్పకుండా వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేస్తూ ఉద్యోగార్థులకు ఉన్నత కొలువులను అందిస్తోంది. ఆయా పోస్టులకు సరైన అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో యూపీఎస్‌సీ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. లక్షల మందిని దాటుకొని చివరి దశకు చేరిన అభ్యర్థులకు 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఉండే ఇంటర్వ్యూలో విజయం కీలకం. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో విజయావకాశాలను మెరుగుపరచుకొనేందుకు నిపుణులు అందిస్తున్న సలహాలు.. సూచనలు..
యూపీఎస్‌సీ నిర్వహించే ఆయా పరీక్షలకు హాజరై 60 శాతం మార్కుల శ్రేణిలో ఉన్న అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు దశల్లో(రాత పరీక్ష) ఉండే సివిల్ సర్వీస్ మొదలు... ఒకే దశలో పరీక్ష నిర్వహించే ఐఈఎస్/ఐఎస్‌ఎస్ వంటి పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూల కటాఫ్ మార్కులు 50 నుంచి 60 శాతం మధ్యలో ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు రాతపరీక్షలో చూపిన ప్రతిభను అంచనా వేసుకొని ఇంటర్వ్యూకి సన్నద్ధం కావటం వల్ల మంచి ఫలితాలు సాధించొచ్చు. ఇంటర్వ్యూలో విజయం కోసం సమకాలీన అంశాలు, సామాజిక పరిణామాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది నిపుణుల సూచన. ఈ క్రమంలో సబ్జెక్ట్ అంశాలను పూర్తిగా విస్మరించకూడదు.
డీఏఎఫ్ నుంచే జాగ్రత్తగా
అభ్యర్థులు ఇంటర్వ్యూ కోణంలో.. రాత పరీక్షకు ముందు పూర్తి చేయాల్సిన డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్హతలు, ఆసక్తులు, హాబీలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ప్రస్తుత ఉద్యోగ వివరాలు, కుటుంబ నేపథ్యం, సర్వీస్ ప్రిఫరెన్స్, ప్రాంతీయత, అకడమిక్ లీడర్‌షిప్స్ తదితర అంశాలను డీఏఎఫ్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో బోర్డ్ మెంబర్లు, అభ్యర్థుల డీఏఎఫ్ ఆధారంగా 70 శాతం ప్రశ్నలు అడుగుతున్నట్లు నిపుణులు, గత విజేతలు చెప్తున్నారు. హాబీలు/ఆసక్తులు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ, ప్రాంతీయత వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా హాబీలు, ఆసక్తులు పేర్కొనే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
గత ఏడాది సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థి వంట చేయటం హాబీగా పేర్కొంటే.. ఎలాంటి వంటలు ఇష్టం అనే ప్రశ్నతో మొదలు పెట్టి.. ఒక పదార్థం తయారీ పద్ధతులు.. వాటికి ఉపకరించే పరికరాలు, అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన పరికరాలను ఉత్పత్తి చేసిన సంస్థ ఏంటి? అనే ప్రశ్నలను అడిగారు. అందుకనే హాబీలు, ఇంట్రస్ట్‌లను పేర్కొనే విషయంలో స్పష్టతతో ఉండాలి.
సర్వీస్, సమాధానాలపై స్పష్టతతో..
అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో సర్వీసు సంబంధించి స్పష్టతతో వ్యవహరించాలి. ఆ సర్వీసునే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఆయా సర్వీసులకు మీరు ఎలా సమర్థులు? వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే సన్నద్ధతతో ఉండాలి. ఇంజనీరింగ్, ఎకనామిక్ సర్వీసెస్‌లో విధుల పరంగా నేరుగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం తక్కువ. ఆయా సర్వీసెస్ విషయంలో సామాజిక సేవ కోసమే వాటిని ఎంపిక చేసుకున్నానని చెప్పే ముందు దానికి అవకాశం ఉన్న మార్గాలపై అవగాహన కలిగుండాలి. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూల పరంగా అభ్యర్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తిచేసి ఎంఎన్‌సీలు, ఐటీ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలను అందుకొంటున్న వారు సివిల్ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కచ్చితమైన కారణాలను పేర్కొనాలి. ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యులను మెప్పించే రీతిలో విశ్లేషణాత్మక, వివరణాత్మక సమాధానాలు ఇచ్చే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి.
పత్రికలు చదవటం తప్పనిసరి
యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా దినపత్రికలు చదవాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూ రోజు ముఖ్యాంశాలు, పరిణామాలు, పర్యవసానాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ సమయంలో ఆ రోజు చదివిన న్యూస్ పేపర్, అందులో మీరు ముఖ్యమని భావించిన అంశాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా అభ్యర్థులు చదివిన న్యూస్ పేపర్‌కు సంబంధించి లోతైన ప్రశ్నలు అడిగే అవకాశమూ ఉంది. గత ఏడాది సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థి ‘హిందూ’ పేపర్ చదివానని చెబితే.. ఆ పేపర్ మాతృసంస్థ, ప్రస్తుత ఎడిటర్ ఎవరు వంటి ప్రశ్నలను అడిగారు.
బాడీ లాంగ్వేజ్
బోర్డ్ సభ్యులను మెప్పించే అంశాల్లో సబ్జెక్ట్, సమకాలీన నైపుణ్యాలతోపాటు బాడీ లాంగ్వేజ్ కీలకంగా వ్యవహరిస్తుంది. బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయంలో సమతుల్యత పాటించాలి. అగ్రెసివ్ బిహేవియర్, వాదోపవాదాలకు ఆస్కారం ఇచ్చే విధంగా వ్యవహరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బోర్డ్ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థులకు విసుగు కలించే రీతిలో వ్యవహరిస్తారు. లేదంటే రెచ్చగొట్టే విధంగానూ వ్యవహరిస్తారు. అందుకనే అభ్యర్థులు ఏ సమయంలోనూ నిగ్రహాన్ని కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించాలి.
డ్రెస్ కోడ్
ఇంటర్వ్యూ విజయాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మరో ముఖ్యమైన అంశం డ్రెస్ కోడ్. యూపీఎస్‌సీ స్థాయి ఇంటర్వ్యూ అనగానే చాలా మంది అభ్యర్థులు బ్లేజర్స్, సూట్స్ వేసుకుంటారు. అయితే ఆ విధమైన డ్రెస్‌లకు అభ్యర్థులు కొత్తయితే కొత్తగా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అలాంటి అభ్యర్థులు బోర్డ్ రూంలో తమకు కేటాయించిన సీటులో అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. అది అభ్యర్థి చెప్పే సమాధానాలపై తప్పక ప్రభావం చూపుతుంది. అందుకే అభ్యర్థులు సింపుల్ డ్రెస్ కోడ్ పాటిస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూకు లైట్ కలర్ డ్రెస్‌లు ధరించాలి. ఇన్‌షర్ట్ చేయడం వల్ల మరింత హుందాగా కన్పించవచ్చు. అలవాటు ఉంటే నెక్-టై ధరించాలి. కానీ, తప్పనిసరి కాదు. మహిళా అభ్యర్థినులు లేత రంగు దుస్తులు ధరించటం మంచిది.
డూస్:
- సివిల్, ఇంజనీరింగ్, మెడికల్, డిఫెన్స్, రైల్వే, ఎకనామిక్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్... ఇలా సర్వీస్ ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉన్నత కొలువుల భర్తీని యూపీఎస్‌సీ చేపడుతుంది.
- రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నైపుణ్యాలను, సామాజిక అవగాహనను పరీక్షిస్తున్న యూపీఎస్‌సీ.. పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థికి సంబంధిత సర్వీసులో రాణించేందుకు కావాల్సిన నేర్పు, ఓర్పు, తెలివి తేటలపై దృష్టి పెడుతోంది.

- యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సబ్జెక్ట్ టు సోషల్ ఇష్యూస్.. ప్రొఫెషనల్ టు పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్ ఇలా అన్ని అంశాలపై అన్ని కోణాల్లో పట్టు సాధిస్తే విజయతీరాలను చేరటం ఏ మాత్రం కష్టం కాదు.
డూస్:
- బోర్డ్ సభ్యులందరినీ చూస్తూ విష్ చేసే విధంగా వ్యవహరించాలి.
- సీట్ ఆఫర్ చేసే వరకు వేచి చూడాలి
- ప్రశ్న అడిగిన బోర్డ్ మెంబర్‌తో ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేయాలి.
- సభ్యులు అడిగే ప్రశ్నను పూర్తిగా వినాలి. ఆ తర్వాతే సమాధానం చెప్పటం ప్రారంభించాలి.
- సమాధానం తెలియకపోతే నిజాయతీగా అంగీకరించాలి.
- సమాధానాలు చెప్పే సమయంలో అనవసరంగా చేతులు ఊపడం వంటివి చేయకూడదు.
- సమాధానాల విషయంలో స్పష్టత ఉండాలి. ఊహాగానాలు, స్వీయ అభిప్రాయాలు సరికాదు.
- బోర్డ్ సభ్యులతో వాదన చేయొద్దు.
- బోర్డ్ సభ్యులు చెప్పే వరకు ఇంటర్వ్యూ రూం నుంచి బయటికి రాకూడదు. వచ్చేటప్పుడు అందరికీ చేరే విధంగా థ్యాంక్స్ చెప్పి బయటికి రావాలి.
సంసిద్ధత కోసం మాక్ ఇంటర్వ్యూలు.. అభ్యర్థులు మాక్ ఇంటర్వ్యూలకు హాజరైతే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. మాక్ ఇంటర్వ్యూలు నిపుణుల ఆధ్వర్యంలో ఉంటాయి. కాబట్టి వారి సూచనలు, సలహాల మేరకు మరింత సంసిద్ధత పొందాల్సిన అంశాలపై అవగాహన లభిస్తుంది. - కె. శశాంక, సబ్ కలెక్టర్, మంచిర్యాల |
వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానాలకు పరీక్ష యూపీఎస్‌సీ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానాలను పరిశీలిస్తుంది. అభ్యర్థులు వ్యక్తిగత ప్రొఫైల్, ప్రొఫెషనల్ అర్హతలు, ఎక్స్‌పీరియన్స్, కరెంట్ ఈవెంట్స్ వంటి అంశాలపై అవగాహనతో ఇంటర్వ్యూ బోర్డ్ రూంలో అడుగు పెట్టాలి. ఇంటర్వ్యూ రోజు వెయిటింగ్ సమయంలో సహచర అభ్యర్థులతో చర్చించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆయా చర్చల వల్ల ఆ రోజుకు సంబంధించి తమకు తెలియని ముఖ్యాంశాలపై కొంత వరకు అవగాహన ఏర్పడుతుంది. ముఖ్యంగా అలాంటి సమయంలో సహచర అభ్యర్థుల ప్రొఫైల్స్ గురించి ఆరా తీయడం మంచిది కాదు. దీనివల్ల అనవసరపు ఆలోచనలతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. - వి. గోపాల కృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ |
Published date : 05 Feb 2016 10:52AM