సివిల్ సర్వీసు... ఏళ్ల కల నెరవేరే వేళ..!!
Sakshi Education
సివిల్ సర్వీసు పరీక్ష మూడంచెల్లో... ప్రతి దశ ఎంతో కీలకం. ముఖ్యంగా మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ప్రిపేరయ్యే సమయం చాలాచాలా కీలకం. ఎందుకంటే... జీవిత లక్ష్యం నేరవేరే దశ ఇది. ఇంటర్వ్యూలోనూ విజయంసాధిస్తే.. సంవత్సరాల కల నెరవేరినట్లే!! ప్రిలిమ్స్, మెయిన్స్‌లో విజయం సాధించి ఇంటర్వ్యూ దశకు వచ్చినవారు కాస్త జాగ్రత్తగా ప్రిపరేషన్ చేస్తే చిరకాల కోరికను నెరవేర్చుకోవచ్చు!!
సివిల్స్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది.. ఏయే అంశాలు అడుగుతారు..
అభ్యర్థిలో ఏ లక్షణాలను యూపీఎస్‌సీ కోరుకుంటోంది.. మినిమమ్ గ్యారెంటీ కోసం అభ్యర్థి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రవర్తన ఎలా ఉండాలి.. అనేవి తెలుసుకుంటే
విజయానికి దగ్గరదారి వేసుకున్నట్టే. మెయిన్స్‌లో బోర్డర్‌లైన్ మార్కులతో పాసైన వాళ్లు చాలామందే ఉంటారు. వీరికి ఇంటర్వ్యూ కీలకం. అలాగే ఎవరికైనా ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకులు రావాలంటే..
ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు సాధించడం తప్పనిసరి. లేదంటే... చిన్న సర్వీసులతో సరిపెట్టుకోవాల్సిందే. త్వరలో జరగబోయే సివిల్స్ ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మంది ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో.. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌పై సాక్షి ప్రత్యేక కథనం...
ఒక్క మార్కు:
సివిల్‌సర్వీసు ఎంపికకు నిర్వహించే చివరిదశ ఇంటర్వ్యూ. దీనికి మొత్తం 300 మార్కులుంటాయి. ఈ దశలో ఒక్క మార్కు కూడా ఎంతో విలువైంది. సెలక్ట్ కావడమా... సెలక్ట్ అయినా.. ఐఏఎస్, ఐపీఎస్‌లా..
లేక సెంట్రల్ సర్వీసులతో సరిపెట్టుకోవడమా అనేది నిర్ణయించేది ఒక్క మార్కే!! ఒక్క మాటలో చెప్పాలంటే.. భవిష్యత్ కెరీర్‌ను నిర్ణయించేది.. ఈ మార్కులే. చాలామంది అభ్యర్థులు మెయిన్స్‌లో తక్కువ మార్కులు వచ్చినా.. ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులతో ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికవుతారు. అలాగే మెయిన్స్‌లో ఎక్కువ
మార్కులు వచ్చినా.. ఇంటర్వ్యూలో తక్కువ మార్కులతో ప్రధానమైన సర్వీసులకు దూరంగా ఉండటమో.. లేదా మొత్తంగా ఎంపిక కు దూరమవడమో జరిగిన సందర్భాలు అనేకం. అందుకే ప్రతి అడుగూ కీలకమే!
అసలేం అడుగుతారు:
సివిల్స్ జాతీయ సర్వీసు. అందుకు తగ్గట్టుగానే ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిగత దృక్పథం నుంచి జాతీయ అంశాల వరకూ.. సామర్థ్యాన్ని ప్రశ్నించేలా విస్తృతంగా ఏదైనా అడగొచ్చు. కాబట్టి ఇంటర్వ్యూకు
ప్రత్యేక పరిధి అంటూ ఏమీ ఉండదు. ఆరు నుంచి ఎనిమిది ఇంటర్వ్యూ బోర్డులుంటాయి. ఒక్కో బోర్డులో ఆరుగురు వరకు సభ్యులుంటారు. ప్రధానంగా ముందు అభ్యర్థి నేపథ్యం, వ్యక్తిగత వివరాలు, అకడమిక్ బ్యాగ్రౌంగ్, ఇలా... వ్యక్తిత్వాన్ని పరీక్షించేవిధంగా అనేక ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు.. అభ్యర్థి పేరు అడుగుతారు? దానికి అర్థం అడగొచ్చు? అలాగే ఆ పేరు ఎందుకు పెట్టారు? అదేవిధంగా తండ్రి ప్రొఫెషన్ గురించి ప్రశ్నించే
అవకాశముంది. ఒకవేళ వ్యవసాయం, లేదంటే వ్యాపారం అంటే దానికి రిలవెంట్ ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు వ్యవసాయం చేస్తున్నారంటే.. అసలు దేశంలో వ్యవసాయ రంగ పరిస్థితిని వివరించండి? లేదంటే.. భారతదేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు గురించి మీకేం తెలుసు? వంటి ప్రశ్నలు ఎదురుకావచ్చు.
డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. ఆ తేదీ ఎవరైనా ప్రముఖుడితో లింక్ అయి ఉంటే.. దాని ప్రాధాన్యం గురించి ప్రశ్నించవచ్చు.
అభ్యర్థి ప్రాంతం.. జిల్లా:
అభ్యర్థి ఏ ప్రాంతానికి చెందినవారు? ఏ జిల్లాకు చెందినవారు? ఆ జిల్లా ప్రాధాన్యతపై ప్రశ్నించవచ్చు. అకడమిక్ బ్యాగ్రౌండ్? బేసిక్ డిగ్రీపై ప్రశ్నలు అడగవచ్చు. ఒకరకంగా కాన్సెప్ట్‌లు చెప్పి సమాధానం
ఇవ్వమని అడిగే అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థులు పీజీ, పీహెచ్‌డీ చేస్తే వాటినుంచి అధికంగా ప్రశ్నలు ఎదురుకావచ్చు. అదేవిధంగా చదువుకున్న యూనివర్సిటీలు? వాటి గొప్పతనం, ప్రాముఖ్యత? అడుగుతారు. అభ్యర్థుల క్యాటగిరీపైనా ప్రశ్నలు అడగటానికి స్కోప్ ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలయితే అసలు ఈ వర్గాలు వెనుకబాటుతనానికి కారణం? చేపట్టిన, చేపడుతున్న చర్యలు వివరించమని అడగొచ్చు? ఉదాహరణకు...క్రిమిలేయర్, అట్రాసిటీ యాక్ట్. మహిళా అభ్యర్థులైతే ఉమెన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి.
మహిళా రిజర్వేషన్, మహిళా సాధికారత?పై ప్రశ్నలుంటాయి
కరెంట్ అఫైర్స్:
జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై సంపూర్ణ అవగాహన అభ్యర్థికి మినిమమ్ గ్యారెంటీ ఇస్తుందని చెప్పొచ్చు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. అందుకోసం అభ్యర్థులు
గత ఆరునెలల పత్రికలు, ప్రధాన ఆర్టికల్స్, ఎడిటోరియల్ పేజీలు క్షుణ్నంగా చదవాలి. అందుకు ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిపెట్టి పట్టుసాధించాలి.
ఎందుకంటే.. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతోపాటు అభ్యర్థి ఏ రాష్ట్రానికి చెందినవారో.. దానికి సంబంధించిన కరెంట్ టాపిక్స్ అడగవచ్చు.. అందుకే ఎప్పటికప్పుడు ఈ పరిణామాలను చదువుతూనే
వాటిపై ఒక బ్యాలెన్స్‌డ్ ఒపీనియన్ ఏర్పరచుకోవడం అవసరం.
ఆందోళన వద్దు:
ఒక్కోసారి ఇంటర్వ్యూకి ఎంతప్రిపేరైనా తీరా అక్కడ మనకు తెలియనివి అడిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఆందోళన చెందకూడదు. సివిల్ సర్వీసు ఇంటర్వ్యూబోర్డు కొంత టఫ్‌గానే ఉంటుంది. బోర్డు సభ్యులు కంగారుపెట్టే ప్రశ్నలు అడిగినా ఏమాత్రం భయపడకూడదు. ఒక్కో అభ్యర్థికి ఇంటర్వ్యూ గరిష్ఠంగా 20 నుంచి 30
నిమిషాలుంటుంది. ఒకవేళ సమాధానం తెలియకపోతే తెలియదనే చెప్పాలి. తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తే.. ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ఆస్కారముంది. ముఖ్యంగా ఎట్టిపరిస్థితిలోనూ ఒత్తిడికి గురికాకూడదు.
డ్రెస్ సెన్స్:
ఇంటర్వ్యూలకు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మంచిదని పదేపదే మదనపడుతుంటారు. ఇంటర్వ్యూకు ఎలాంటి డ్రెస్‌అయినా వేసుకోవచ్చు. కాని నీట్‌గా, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. పెర్‌ఫ్యూమ్స్ వాడకూడదు. ఎంత సింపుల్‌గా, ఎంత హుందాగా ఉంటే అంతమంచిది.
కటాఫ్ ఎంత:
సివిల్స్ ఇంటర్వ్యూ మార్కులు మొత్తం 300. 180 మార్కులవరకు సాధించగలిగితే ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులకు ఎంపికవొచ్చు. 200మార్కులు దాటితే టాపర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువుంటాయి.
గతంలో 240 మార్కులు సాధించిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు.
డాక్టర్ కదా...డబ్బు సంపాదించుకోకుండా సివిల్స్‌కు ఎందుకొచ్చారు?
-భరత్‌గుప్తా. సివిల్స్ 17వ ర్యాంకర్...
అనంతపురం జిల్లా గుత్తికి చెందిన భరత్‌గుప్తా సివిల్స్ 17వ ర్యాంకు సాధించారు. ఆయన ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ. గుప్తా కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు.
గుప్తా ఇంటర్వ్యూ తీరిది:
-మీరు కర్నూలు మెడికల్ కాలేజీలో చదివారు కదా..! సీటు కోసం ఎంత డబ్బు కట్టారు?
-వంట వండడం మీ హాబీ అన్నారు కదా.. మీకు ఏం వంట వండడం వచ్చు?
-డిగ్రీపూర్తిచేసిన తర్వాత ఏంచేశారు?
-మెడిసిన్ పూర్తయ్యాక చాలామంది పీజీ చేసి డబ్బు సంపాదించడానికి ఇష్టపడతారు. కాని మీరు సివిల్స్‌కి ఎందుకొచ్చారు? దీనికి సమాధానం చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేయగలరా?
-గ్రామసభ అంటే? వాటి విధులు?
-పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళా రిజర్వేషన ్లగురించి ఏం తెలుసు?
-జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయికి ప్రభుత్వ నిధులు ఎలా పంచుతారో వివరించగలరా?
-కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి మీకేం తెలుసు?
-గ్రీన్ రెవల్యూషన్ అంటే?

Published date : 07 Mar 2012 05:36PM