సామాజిక సేవే లక్ష్యం.. ముజమ్మిల్ ఖాన్
Sakshi Education
కుటుంబ నేపథ్యమే స్ఫూర్తిగా..సామాజిక సేవే లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను. తొలి ప్రయత్నంలో ఐఆర్‌పీఎస్ వచ్చినా.. ఐఏఎస్‌తోనే అసలైన లక్ష్యం నెరవేరుతుందని భావించా.. అందుకే మరోసారి హాజరై విజయం సాధించాను అంటున్నారు జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సొంతం చేసుకున్న ముజమ్మిల్ ఖాన్. ఎలాంటి శిక్షణ లేకుండానే ఈ విజయం లభించడం ఆనందంగా ఉందని చెబుతున్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎ.కె.ఖాన్ కుమారుడు ముజమ్మిల్ ఖాన్!
నాన్న ఎ.కె.ఖాన్ ఐపీఎస్‌గా పనిచేయడం.. తాతయ్య ఐఏఎస్ అధికారిగా పనిచేయడం నన్ను సివిల్ సర్వీసెస్ వైపు నడిపించాయని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచే వీరిద్దరూ చేస్తున్న సామాజిక సేవను చూసి నేను కూడా అలాంటి ఉద్యోగంలో చేరాలని భావించాను. వృత్తి రీత్యా నాన్నకు బదిలీలు అయ్యేవి. దాంతో నా విద్యాభ్యాసం కూడా పలు చోట్ల కొనసాగింది. ప్రాథమిక విద్య విశాఖపట్నంలో పూర్తిచేశాను. హైస్కూల్, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లోనే పూర్తయింది.
బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ :
ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత బిట్స్ పిలానీ క్యాంపస్‌లో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. 2010లో ఆ కోర్సు పూర్తయ్యాక ఎస్‌బీఐ పీఓ సెలక్షన్‌కు ఎంపికై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండేళ్లు పీఓగా పని చేశాను. కానీ.. నా దృష్టంతా సివిల్ సర్వీసెస్‌పైనే ఉండేది. దీంతో 2012లో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ దిశగా పూర్తి స్థాయిలో ఉపక్రమించాను.
తొలి అటెంప్ట్‌లో ఐఆర్‌పీఎస్ :
సివిల్స్‌కు ఉపక్రమించాక ఒక ఏడాది మొత్తం ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఈ సమయంలో సివిల్స్ పరీక్షకు సంబంధించిన తీరుతెన్నుల గురించి తెలుసుకున్నాను. అదే విధంగా ఆప్షనల్ ఎంపిక, మెటీరియల్ వంటి విషయాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకున్నాను. అలాగే ప్రిపరేషన్ సాగించే తీరుపైనా అవగాహన పెంచుకున్నాను. సివిల్ సర్వీసెస్ పరీక్షను తొలిసారిగా 2013లో రాశాను. అప్పుడు ఐఆర్‌పీఎస్‌కు ఎంపికయ్యాను. కానీ, నా లక్ష్యం ఐఏఎస్ కావడంతో.. ఐఆర్‌పీఎస్‌లో కొనసాగుతూనే.. ఐఏఎస్ సాధన దిశగా సీరియస్‌గా ప్రిపరేషన్ సాగించాను. ఫలితంగా రెండో అటెంప్ట్‌లో ఆలిండియా స్థాయిలో 22వ ర్యాంకు వచ్చింది.
ఆంత్రోపాలజీ ఆప్షనల్‌గా :
సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఆంత్రోపాలజీ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను. దీనికి ముఖ్య కారణం మెటీరియల్ లభ్యతే. ఫిజికల్ ఆంత్రోపాలజీ - పి.నాథ్, సోషల్ ఆంత్రోపాలజీ- మజుందార్, ఆంత్రోపాలజీ థియరీస్-మఖాన్ ఝా, ఇండియన్ ఆంత్రోపాలజీ - ఆర్.ఎన్.శర్మ వంటి ప్రామాణిక పుస్తకాలు చదివాను. వీటిని చదివేటప్పుడు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల సబ్జెక్ట్‌పై పట్టు లభించింది. అకడమిక్ నేపథ్యం ఇంజనీరింగ్ అయినప్పటికీ.. ఆంత్రోపాలజీ ప్రిపరేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
స్వీయ శిక్షణతోనే :
బిట్స్‌లో బీటెక్ పూర్తికాగానే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓ ఉద్యోగం లభించింది. దాంతో సివిల్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడానికి సమయం లభించలేదు. అందుకే సివిల్స్‌కు మొదటి నుంచి సొంతగానే సన్నద్ధమయ్యాను. ఈ విషయంలో నాన్న ఎ.కె.ఖాన్ ఇచ్చిన గెడైన్స్ ఎంతో ఉపయోగపడింది. ఏ అంశాన్ని ఎలా చదవాలి? ఎలా చదివితే పరీక్షలో మెరుగ్గా రాణించొచ్చు? అనే విషయాల్లో అవగాహన కల్పించారు. సివిల్స్ విజయం దిశగా కలిసొచ్చే అంశం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం. నేను ఇదే ఫార్ములా ఫాలో అయ్యాను. చదివిన ప్రతి టాపిక్‌కు సంబంధించి సెల్ఫ్ టెస్ట్ రాసుకోవడం.. దాన్ని విశ్లేషించుకోవడం.. ప్రిపరేషన్ పరంగా మరింత ఉపయుక్తంగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ విజయంలో మాక్ ఇంటర్వ్యూస్‌కు హాజరవడం ఎంతో కలిసొచ్చింది. ఇది వాస్తవ ఇంటర్వ్యూ సమయంలో మేలు చేసింది.
ఇంటర్వ్యూ.. సమకాలీన అంశాలపైనే :
నా ఇంటర్వ్యూ మొత్తం సమకాలీన అంశాలపైనే సాగింది. తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించినవి, నా ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలు అడిగారు. సుజాత మెహతా నేతృత్వంలోని బోర్డ్ నిర్వహించిన ఇంటర్వ్యూ దాదాపు 25 నిమిషాలు జరిగింది. ఇంటర్వ్యూ ఆసాంతం ఆహ్లాదకర వాతావరణంలోనే సాగింది. ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు.
విద్యాభివృద్ధికి కృషిచేస్తా :
భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా విద్యాభివృద్ధికి కృషిచేస్తాను. ఇందుకోసం అందుబాటులో ఉన్న పథకాలు పకడ్బందీగా అమలయ్యేలా చూస్తాను. విద్యాభివృద్ధితోనే సమాజం మొత్తం అభివృద్ధి బాటలో నడుస్తుంది.
సివిల్స్ ఔత్సాహికులు అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వారిని రోల్ మోడల్‌గా తీసుకోవాలి. వారి విజయ ప్రస్థానం గురించి తెలుసుకుంటూ స్ఫూర్తిపొందాలి. తద్వారా ప్రిపరేషన్ సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను ఇట్టే అధిగమించొచ్చు. అదేవిధంగా పరీక్ష పట్ల భయం కూడా పోతుంది.

Published date : 02 Jun 2017 05:17PM