Skip to main content

సామాజిక అవగాహనతోనే సివిల్స్ సాధించా

సామాజిక అంశాలపై నాకున్న అవగాహనే సివిల్స్ సాధించడంలో తోడ్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక రెండేళ్లపాటు బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పరీక్షలకు సన్నద్ధమయ్యాను. గంటలకొద్దీ పుస్తకాలు చదవడమేకాకుండా.. వాటిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసినప్పుడే విషయ పరిజ్ఞానం అలవడుతుంది. ప్రతిరోజూ దినపత్రికలు చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించా. ‘సాక్షి’ పత్రిక రెగ్యులర్ పాఠకుడిని. మొదట్లో రోజూ ఎనిమిది గంటలు చదివా. పరీక్షలు సమీపించే సమయంలో 16 గంటల పాటు కష్టపడ్డా. దీర్ఘకాలం సన్నద్ధమవడంతోపాటు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరైనప్పుడే విజయం లభిస్తుంది.
           - చిరుమామిళ్ల వినయ్ కె చౌదరి (464వ ర్యాంక్)
Published date : 02 Jun 2017 05:29PM

Photo Stories