Inter Exams: ఇంటర్ పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం
- 80 వేల మంది ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ శిక్షణ: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: జేఈఈ పరీక్షల రీ షెడ్యూల్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల తేదీలను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టబోయే ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా 80 వేల మంది టీచర్లకు ఇంగ్లిష్ బోధనపై శిక్షణనిస్తున్నామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం తన కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాçష్ట్రంలో 26 వేల స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతు న్నాం. ఇంగ్లిష్‌లో బోధించే టీచర్లకు శిక్షణ కోసం 20 వేల మంది ట్రైనర్లను నియమించాం. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 8 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది’అని చెప్పా రు. సర్కారు స్కూళ్ల అభివృద్ధికి భారీగా నిధులు వెచి్చస్తున్నామని, ‘మన ఊరు–మనబడి’ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. కరోనా తర్వాత ప్రభుత్వ బడుల్లో 3 లక్షల మంది అదనంగా చేరారన్నారు. ఉపాధ్యాయ ఖాళీలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.