Skip to main content

AP ICET College Predictor : మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వ‌హించిన ఏపీ ఐసెట్‌–2022 ఫ‌లితాల‌ను ఆగ‌స్టు 8వ తేదీన విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ఐసెట్ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ ఐసెట్ 2022 పరీక్షకు మొత్తం 42,496 మంది హాజరుకాగా, 37,326 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 87.68 శాతం ఉత్తీర్ణత సాధించి కాస్త వెనకబడ్డారు. బాలుర ఉత్తీర్ణత శాతం 87.98 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 87.68శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. తొలి 10ర్యాంకుల్లో బాలురు 7 ర్యాంకులు సాధించగా, బాలికలు 3 ర్యాంకుల్లో మెరిశారు. ఈ నేప‌థ్యం.. AP ICET లో వ‌చ్చే ర్యాంక్‌ల‌పై విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో  ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
AP ICET 2022లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు.. ఎలాంటి కాలేజీలో సీటు వ‌చ్చే అవ‌కాశం ఉందంటే..?
సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం.. మీకు వ‌చ్చిన AP ICET 2022 ర్యాంక్‌ ఆధారంగా.. ఏ కాలేజీలో ప్ర‌వేశం వ‌స్తుందో ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న ఆధారంగానే మీ కాలేజీ కేటాయింపు ఉంటుంది.

ఏపీ ఐసెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల కోసం క్లిక్ చేయండి

ఏపీ ఐసెట్‌-2022 ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

A P ICET 2022 Shift - 1 Question Paper with Key

AP ICET 2022 Shift - 2 Question Paper with Key

AP ICET College Predictor :

How to Check Expected Colleges ?

Published date : 09 Aug 2022 07:01PM

Photo Stories