Skip to main content

ఎంబీఏ, ఎంసీఏ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌... చివరీ తేదీ

టీఎస్‌ ఐసెట్‌ తొలి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ నవంబర్‌ 14న తెలిపారు.
ఎంబీఏ, ఎంసీఏ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌... చివరీ తేదీ
ఎంబీఏ, ఎంసీఏ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌... చివరీ తేదీ

ఎంబీఏలో మొత్తం 24,478 సీట్లకుగాను 16,886 సీట్లు, ఎంసీఏలో 2,367 సీట్లకు 2,323 సీట్లు భర్తీ చేసినట్లు తెలిపారు. రెండు విభాగాల్లో ఈడ బ్ల్యూఎస్‌ కోటా కింద 485 సీట్లు కేటాయించామన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్‌ 18వ తేదీలోగా సెల్ఫ్‌ రిపోరి్టంగ్‌ చేయాలని సూచించారు. నవంబర్‌ 27 నుంచి 29 వరకు తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా, ఐసెట్‌లో 51,316 మంది అర్హత సాధించగా 22,416 మంది ధ్రవపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 21,811 మంది ఆప్షన్స్ నమోదు చేశారు. 

Published date : 15 Nov 2021 01:28PM

Photo Stories