MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన TSICET తొలిరోజు పరీక్షకు 90% విద్యార్థులు హాజరైనట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి తెలిపారు.
ఐసెట్ 90% హాజరు
14 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహించినట్లు జూలై 27న ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం సెషన్‌లో 16,597 మంది హాజరుకాగా, సాయంత్రం సెషన్‌లో 16,898 మంది హాజరయ్యారని వెల్లడించారు. జూలై 28న 2 సెషన్‌లలో ప్రవేశపరీక్ష ముగుస్తుందని చెప్పారు. అంతకుముందు కాకతీయ యూనివర్సిటీలో ICET కార్యాలయంలో Telangana State Council of Higher Education చైర్మన్ లింబాద్రి ప్రశ్నపత్రం సెట్‌ను ఎంపిక చేసి విడుదల చేశారు. ఆయన వెంట కేయూ వీసీ తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ బి.దవెంకట్రామ్‌రెడ్డి ఉన్నారు.