Skip to main content

భారతదేశం - శక్తి సంపద

శక్తి ఒక ముఖ్య వనరు మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే ప్రథమ కారకం. ఒక దేశం వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి శక్తి సంపద ఎంతో అవసరం. ప్రస్తుతం మానవ జీవితం శక్తి వనరులపై ఎంతో ఆధారపడింది. మానవ జీవితావసరానికి రూపొందించే ప్రతి వస్తు ఉత్పత్తి ఈ శక్తిపైనే ఆధారపడి ఉంటుంది.

శక్తి వనరులను రెండు రకాలుగా విభజించొచ్చు. అవి..
1. సంప్రదాయ శక్తి వనరులు/తరిగిపోయే శక్తి వనరులు
2. సంప్రదాయేతర/తరిగిపోని శక్తి వనరులు

1. సంప్రదాయ/తరిగిపోయే శక్తి వనరులు:

  • బొగ్గు, చమురు, సహజవాయువు, అణుశక్తిని ఉత్పత్తి చేసే యురేనియం, థోరియం వంటి ఖనిజాలు మొదలైన వాటిని సంప్రదాయ శక్తి వనరులు అంటారు.
  • వీటి నిల్వలు ప్రకృతిలో నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే ఉన్నందున వాడుతూ ఉంటే క్రమేణా తరిగిపోతాయి.
  • ఇవి తరిగిపోతే మానవుడు పునరుద్ధరించలేడు. కాబట్టి వచ్చే తరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని క్రమబద్ధంగా వినియోగించుకోవాలి.

2. సంప్రదాయేతర/తరిగిపోని శక్తి వనరులు:

  • నీరు, సౌరశక్తి, పవన శక్తి, వేలా తరంగాలు, భూతాప శక్తి మొదలైన వాటిని సంప్రదాయేతర శక్తి వనరులుగా పరిగణిస్తారు.
  • ఇవి ప్రకృతిలో నిరంతరం లభ్యమవుతాయి. కాబట్టి తరిగిపోవడమనే సమస్యే లేదు.
  • అయితే వీటిని శక్తి ఉత్పాదకతకు ఉపయోగించుకోవాలంటే సాంకేతికాభివృద్ధితో మాత్రమే సాధ్యపడుతుంది.
  • మనదేశంలో నేలబొగ్గు, చమురు, కర్ర బొగ్గు, నీరు ప్రధాన శక్తి వనరులు. సూర్యరశ్మి, గాలి మొదలైన వనరుల వాడకం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో ఉంది. అలాగే అణుశక్తి కూడా మంచి అభివృద్ధి దశలో ఉందని చెప్పొచ్చు. వీటన్నింటిలోనూ బొగ్గు చాలా ముఖ్యమైన శక్తి ఉత్పాదక వనరు. ఆ తర్వాత స్థానం జలశక్తి ఆక్రమిస్తుంది.
  • మనదేశంలో మొదటిసారి విద్యుచ్ఛక్తి తయారీ డార్జిలింగ్ (పశ్చిమ బంగా)లో 1897లో ప్రారంభమైంది. ఆ తర్వాత 1902లో కర్ణాటకలోని శివసముద్రం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
  • స్వాతంత్య్రానంతరం ‘విద్యుచ్ఛక్తి చట్టం 1948’లో ప్రవేశపెట్టి విద్యుచ్ఛక్తిని ప్రభుత్వ రంగ పరిధిలోకి తెచ్చారు.
  • 1975లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ‘నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్’ల ఏర్పాటుతో దేశంలో విద్యుచ్ఛక్తి రంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది.
  • మనదేశంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి 1947లో 1400 మెగావాట్లు ఉంటే, 2005-06 నాటికి 1,19,607 మె.వాట్లకు చేరింది.

థర్మల్ విద్యుత్

  • బొగ్గు, నీటి ఆవిరి ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ అంటారు. దేశంలో సుమారు 73 శాతం ఉత్పత్తితో థర్మల్ విద్యుత్ మొదటి స్థానంలో ఉంది.
  • థర్మల్ విద్యుత్‌ను ఎక్కువగా మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి.
  • వేయి మెగావాట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పవర్ స్టేషన్‌ను సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్టీపీఎస్) అంటారు. ఇవి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో ఉంటాయి.

భారతదేశంలో సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లు

వ.సం.

ఎస్టీపీఎస్

రాష్ర్టం

1.

సింగ్రౌలి

ఉత్తరప్రదేశ్

2.

దాద్రి

ఉత్తరప్రదేశ్

3.

రీహాండ్

ఉత్తరప్రదేశ్

4.

వూంచహార్

ఉత్తరప్రదేశ్

5.

సింహాద్రి

ఆంధ్రప్రదేశ్

6.

రామగుండం

తెలంగాణ

7.

వింద్యాచల్ -1

మధ్యప్రదేశ్

8.

వింద్యాచల్-2

మధ్యప్రదేశ్

9.

కోర్బా

ఛత్తీస్‌గఢ్

10.

కహాల్‌గావ్

బీహార్

11.

తాల్చేర్

ఒడిశా

12.

కాయంకుళం

కేరళ

13.

ఫరక్కా

పశ్చిమ బంగా

  • 4000 మె.వాట్ల కంటే ఎక్కువ థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉంటే వాటిని ‘ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్’ (యూఎంపీపీ) అంటారు.

భారతదేశంలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్

వ.సం.

యూఎంపీపీ

రాష్ర్టం

1.

ముంద్రా

గుజరాత్

2.

తాద్రి

కర్ణాటక

3.

గిర్యా

మహారాష్ర్ట

4.

ససన్

మధ్యప్రదేశ్

5.

ఇబ్ నదీ లోయ

ఒడిశా

6.

కృష్ణపట్నం (నెల్లూరు)

ఆంధ్రప్రదేశ్

అణు విద్యుత్

  • అణు విద్యుదుత్పత్తికి అవసరమైన యురేనియం, థోరియం, ఇల్మనైట్, మోనజైట్ ఖనిజాలు భారతదేశంలో తగినంతగా లభిస్తున్నాయి.
  • జార్ఖండ్‌లోని రాణి మేఖలలో, రాజస్థాన్‌లోని ‘ఆరావళి’ పర్వత ప్రాంతంలో యురేనియం లభిస్తోంది.
  • బీహార్‌లో గయ, రాజస్థాన్‌లో జైపూర్, ఉదయ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాల్లో యురేనియం నిల్వలున్నాయి.
  • జార్ఖండ్‌లోని ‘జాదుగూడ’లో యురేనియాన్ని శుద్ధి చేసే ప్లాంట్ ఉంది.
  • కేరళ తీరం వెంట ఉన్న మోనజైట్ ఇసుకల్లో థోరియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.
  • ప్రపంచంలోని థోరియం నిక్షేపాల్లో 50 శాతంపైగా భారతదేశంలోనే ఉన్నాయి.
  • ప్రస్తుతం భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 4780 మె.వా. ఇది దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉత్పత్తిలో సుమారు 3 శాతం.
  • ప్రపంచంలో అణు విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఫ్రాన్స్‌.

భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు
1. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం (టీఎపీఎస్) (మహారాష్ర్ట):

  • భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి అణు విద్యుత్ కేంద్రం.
  • 1969, అక్టోబర్ 28న దీన్ని స్థాపించారు.
  • ఇక్కడ ఉన్న అణు రియాక్టర్ పేరు - అప్సర.
  • ఈ కేంద్రం అణు విద్యుత్ సామర్థ్యం - 1400 మె.వాట్లు.

2. రావత్ భటా అణు విద్యుత్ కేంద్రం (ఆర్‌ఎపీఎస్) (రాజస్థాన్):

  • ఈ కేంద్రాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు.
  • 1973, డిసెంబర్ 16న రాజస్థాన్‌లో నెలకొల్పారు.
  • ‘కోటా అణు విద్యుత్ కేంద్రం’ అని కూడా అంటారు.
  • అణు విద్యుత్ సామర్థ్యం 1180 మె.వాట్లు.

3. కల్పకం అణు విద్యుత్ కేంద్రం (ఎంఎపీఎస్) (తమిళనాడు):

  • 1984, జనవరి 24న తమిళనాడులోని కల్పకం వద్ద ఏర్పాటు చేశారు.
  • మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (ఎంఎపీఎస్) అని, ‘ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్‌‌చ’ అని కూడా అంటారు.
  • ఇక్కడ ఉన్న అణు రియాక్టర్ పేరు - కామిని, ఈ రియాక్టర్ ద్వారా ప్లాటినాన్ని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
  • అణు విద్యుత్ సామర్థ్యం - 440 మె.వా.

    4. నరోరా అణు విద్యుత్ కేంద్రం (ఎన్‌ఎపీఎస్) (ఉత్తరప్రదేశ్):

  • ఉత్తరప్రదేశ్‌లోని నరోరా వద్ద 1991, జనవరి 1న దీన్ని ఏర్పాటు చేశారు.
  • దీని ద్వారా ప్రధానంగా ఢిల్లీకి విద్యుత్‌ను అందిస్తున్నారు.
  • అణు విద్యుత్ సామర్థ్యం 440 మె.వా.

    5. కాక్రపార అణు విద్యుత్ కేంద్రం (కెఏపీపీ) (గుజరాత్):

  • గుజరాత్‌లోని కాక్రపార ప్రాంతంలో 1993, మే 6న నెలకొల్పారు.
  • అణు విద్యుత్ సామర్థ్యం 440 మె.వా.

    6. కైగా అణు విద్యుత్ కేంద్రం (కెపీపీ) (కర్ణాటక):

  • కర్ణాటక రాష్ర్టంలోని ‘కైగా’ ప్రాంతంలో 2000, నవంబర్ 16న స్థాపించారు.
  • అణు విద్యుత్ సామర్థ్యం 850 మె.వా.
  • తమిళనాడులోని ‘కూడంకుళం’ వద్ద రష్యా సహాయంతో వేయి మెగావాట్లతో రెండు అణు రియాక్టర్లను నిర్మిస్తున్నారు.
  • అణు విద్యుత్ కర్మాగారంలో మితకారిగా ‘భారజలం’ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు.

    భారతదేశంలో భారజల కేంద్రాలు

    వ.సం.

    భారజల కేంద్రం

    రాష్ర్టం

    1.

    కోటా

    రాజస్థాన్

    2.

    తాల్చేర్

    ఒడిశా

    3.

    థాల్

    మహారాష్ర్ట

    4.

    బరోడా

    గుజరాత్

    5.

    ట్యుటికోరిన్

    తమిళనాడు

    6.

    హజీరా

    మధ్యప్రదేశ్

    7.

    మణుగూరు

    తెలంగాణ

    • భారతదేశంలో 1962లో మొట్టమొదటి ‘భారజల కేంద్రాన్ని’ ‘నంగల్’ (ఉత్తరప్రదేశ్)లో ఏర్పాటు చేశారు.
    Published date : 08 Sep 2015 03:22PM

    Photo Stories