పంచాయతీరాజ్ వ్యవస్థ బిట్‌బ్యాంక్
1. పంచాయతీరాజ్‌కు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ కింది వాటిలో దేన్ని ప్రతిపాదించలేదు?
ఎ) పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33.33 శాతం సీట్లు కేటాయించాలి
బి) పంచాయతీరాజ్ సంస్థల్లో వనరుల కోసం రాష్ట్రాలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి
సి) పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైనవారికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వారి పదవులను కోల్పోతారు
డి) రాష్ట్ర ప్రభుత్వంతో పంచాయతీరాజ్ సంస్థ రద్దైతే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి
- View Answer
- సమాధానం: సి
2. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో పేర్కొన్నారు?
ఎ) 3
బి) 21
సి) 9
డి) 8
- View Answer
- సమాధానం: సి
3.గ్రామ సర్పంచ్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు
బి) వార్డు మెంబర్లు కలిసి ఎన్నుకుంటారు
సి) కలెక్టర్ నియమిస్తాడు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
4. జిల్లా పరిషత్‌లో స్థాయీ సంఘాల సంఖ్య?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం: డి
5. ‘ఇంపీరియా ఇంపీరియం’ అంటే ఏమిటి?
ఎ) రాజ్యంలో రాజ్యం
బి) సర్వోన్నత అధికారం
సి) రాజరికం
డి) స్వయం పాలన
- View Answer
- సమాధానం: ఎ
6.స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హత నిర్ణయించిన రాష్ట్రం ఏది?
ఎ) గుజరాత్
బి) రాజస్థాన్
సి) కేరళ
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: ఎ
7. కింది వాటిలో పంచాయతీల విధి కానిది ఏది?
ఎ) పారిశుధ్య నిర్వహణ
బి) విద్యుచ్ఛక్తి
సి) శ్మశానాల నిర్వహణ
డి) పర్యావరణ పరిరక్షణ
- View Answer
- సమాధానం: బి
8. పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని సిఫారసు చేసిన కమిటీ?
ఎ) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
బి) అశోక్ మెహతా కమిటీ
సి) నరసింహం కమిటీ
డి) వెంగళరావు కమిటీ
9. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏది?
ఎ) గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్
బి) గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా ప్రజా పరిషత్
సి) గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: ఎ
10. మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి, ఓటు హక్కు లేని వారెవరు?
ఎ) ఎన్నుకైన సభ్యులు
బి) కో-ఆప్ట్ చేసిన సభ్యులు
సి) మండలానికి చెందిన రాజ్యసభ సభ్యులు
డి) మండలానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు
- View Answer
- సమాధానం: డి
11. మండల పరిషత్ అధ్యక్షుడిని ఏ విధంగా ఎన్నుకుంటారు?
ఎ) ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు
బి) మండల పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు
సి) మండల పరిషత్‌కు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు
డి) మండలంలోని సర్పంచులందరూ కలిసి ఎన్నుకుంటారు
- View Answer
- సమాధానం: సి
12. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించిన విధులెన్ని?
ఎ) 9
బి) 19
సి) 29
డి) 39
- View Answer
- సమాధానం: సి
13. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?
ఎ) రాష్ట్రపతి
బి) గవర్నర్
సి) ప్రధానమంత్రి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
14. స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు?
ఎ) కేంద్ర జాబితా
బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: బి
15.భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
ఎ) కోల్‌కతా
బి) బొంబాయి
సి) మద్రాసు
డి) ఢిల్లీ
- View Answer
- సమాధానం: సి
16. జతపరచండి.
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ గ్రూపు - ఎ గ్రూపు - బి 1. సామాజిక అభివృద్ధి పథకం ఎ.1959 అక్టోబర్ 2 2. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం బి. 1993 ఏప్రిల్ 24 3. పంచాయతీరాజ్ వ్యవస్థ సి. 1952 అక్టోబర్ 2 4. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ డి. 1953 అక్టోబర్ 2
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
- View Answer
- సమాధానం: బి
17. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ సవరణను రాజ్యాంగంలో ఎన్నో భాగంలో చేర్చారు?
ఎ) 9
బి) 10
సి) 11
డి) 12
- View Answer
- సమాధానం: ఎ
18.కింది వాటిలో సరికాని జత ఏది?
1. అశోక్ మెహతా కమిటీ - రెండంచెల వ్యవస్థ
2. ఎల్.ఎం.సింఘ్వి కమిటీ - న్యాయ పంచాయతీలు
3. హనుమంతరావు కమిటీ- జిల్లా ప్రణాళిక
4. దంత్వాలా కమిటీ - బ్లాక్ లెవల్ ప్రణాళిక
ఎ) 1, 2
బి) 3, 4
సి) పైవన్నీ సరైనవే
డి) 1, 3, 4
- View Answer
- సమాధానం: సి
19. స్థానిక స్వపరిపాలనా పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) లార్డ్ రిప్పన్
బి) మేయో
సి) బెంటింక్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
20. స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ప్రకరణలేవి?
ఎ) ప్రకరణలు 243A నుంచి 243F
బి) ప్రకరణలు 243A నుంచి 243O
సి) ప్రకరణలు 243O నుంచి 243M
డి) ప్రకరణలు 243O నుంచి 243Z
- View Answer
- సమాధానం: బి
21. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ?
ఎ) 1993 ఏప్రిల్ 22
బి) 1993 ఏప్రిల్ 23
సి) 1993 ఏప్రిల్ 24
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
22. దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులెన్ని?
ఎ) 60
బి) 61
సి) 62
డి) 63
- View Answer
- సమాధానం: సి
23. జిల్లా ప్రణాళికా మండలి గురించి ఎన్నో రాజ్యాంగ ప్రకరణ తెలుపుతుంది?
ఎ) 243 ZA
బి) 243 ZB
సి) 243 ZC
డి) 243 ZD
- View Answer
- సమాధానం: డి
24. 1967లో ఏర్పాటు చేసిన ఎం.టి. రాజు కమిటీ దేనికి సంబంధించింది?
ఎ) పంచాయతీరాజ్ సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని పరిశీలించడం
బి) పంచాయతీరాజ్ సంస్థల్లో ఆర్థిక వనరుల పరిశీలన
సి) పంచాయతీరాజ్ సంస్థల వికేంద్రీకరణ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
25. భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లో ఎన్ని అంశాలున్నాయి?
ఎ) 5
బి) 10
సి) 8
డి) 12
- View Answer
- సమాధానం: సి
26. దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను పెంపొందించే లక్ష్యంతో చేసిన రాజ్యాంగ (73వ సవరణ) చట్టం కింది వాటిలో దేన్ని సమకూరుస్తుంది?
1. జిల్లా ప్రణాళిక కమిటీల ఏర్పాటు
2. అన్ని రకాల పంచాయతీ ఎన్నికలను నియంత్రించడానికి రాష్ట్రాల ఎన్నికల సంఘాలు
3. రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటు
ఎ) 1 మాత్రమే
బి) 1, 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే
డి) 1, 2, 3
- View Answer
- సమాధానం: డి
27. కింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది?
ఎ) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
బి) భాగస్వామ్య ప్రజాస్వామ్యం
సి) స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం
డి) సామాజిక న్యాయాన్ని అందించడం
- View Answer
- సమాధానం: డి
28. గ్రామ సభకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గ్రామంలోని ఓటర్లందరూ ఇందులో సభ్యులు
బి) సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి
సి) గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
29. గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఎంపీటీసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటాడు కానీ, ఓటు హక్కు ఉండదు
బి) స్వయం సహాయక గ్రూపు నుంచి ఒక సభ్యుడిని కో-ఆప్ట్ చేస్తారు
సి) స్థానిక శాసనసభ్యుడు హోదారీత్యా సభ్యుడిగా ఉంటాడు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
30. ‘సీనరేజ్ రుసుం’ అంటే ఏమిటి?
ఎ) ఖనిజేతర పదార్థాలపై వేసే పన్ను
బి) ఖనిజాలపై వేసే పన్ను
సి) కంటోన్మెంట్ బోర్డు విధించే పన్ను
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: బి
31.రాష్ట్రం, స్థానిక సంస్థల మధ్య..?
ఎ) అధికార విభజన ఉంటుంది
బి) అధికార దత్తత ఉంటుంది
సి) అధికార బదలాయింపు ఉంటుంది
డి) అధికార పృథక్కరణ ఉంటుంది
- View Answer
- సమాధానం: సి
32. PESA చట్టం ద్వారా అధిక ప్రాధాన్యం దేనికి ఉంటుంది?
ఎ) గ్రామ సభ
బి) గ్రామ పంచాయతీ
సి) సర్పంచ్
డి) మండల పరిషత్
- View Answer
- సమాధానం: ఎ
33. గ్రామ సభ గురించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గ్రామ పార్లమెంట్‌గా పనిచేస్తుంది
బి) ఇందులో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు
సి) గ్రామసభ కోరం.. రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు వదిలేశారు
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
34.పంచాయతీ వ్యవస్థ నిర్మాణం అనేది..?
ఎ) భౌతికపరమైంది
బి) పాలనాపరమైంది
సి) ఆర్థిక పరమైంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
35. పంచాయతీ నిర్వహణను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఇంటర్నెట్ వెబ్ ద్వారా నియంత్రించారు?
ఎ) కేరళ
బి) కర్ణాటక
సి) ఆంధ్రప్రదేశ్
డి) తెలంగాణ
- View Answer
- సమాధానం: ఎ
36. పంచాయతీలు "F3" సిండ్రోమ్‌తో సతమతమవుతున్నాయనే విమర్శ ఉంది. కింది వాటిలో ఇందులోని అంశం ఏది?
ఎ) Functions
బి) Functionaries
సి) Funds
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
37. పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించే పద్ధతి?
ఎ) సిబ్బంది నియామకం
బి) అకౌంట్ల తనిఖీ
సి) నిధుల మంజూరు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
38. నూతన పంచాయతీ చట్టంలో రాష్ట్రాల విచక్షణకు వదిలేసిన అధికారాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) సర్పంచ్ ఎన్నిక పద్ధతి
బి) అధికారాల బదలాయింపు
సి) స్థానిక శాసనసభ్యులకు ప్రాతినిధ్యం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
39. 73వ, 74వ రాజ్యాంగ సవరణల మధ్య ఏకైక అనుసంధాన అంశం (లింక్) ఏది?
ఎ) జిల్లా ప్రణాళికా కమిటీ
బి) మెట్రోపాలిటన్ కమిటీ
సి) వార్డు కమిటీ
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
40. ‘అధికారం, జవాబుదారీతనం లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదు’ అని పేర్కొన్న కమిటీ?
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
సి) జి.వి.కె. రావు కమిటీ
డి) ఎల్.ఎం.సింఘ్వి కమిటీ
- View Answer
- సమాధానం: ఎ
41. పంచాయతీ వ్యవస్థను ‘ప్రజాస్వామ్య పాఠశాల, వాస్తవ స్వరాజ్’గా పేర్కొన్నది ఎవరు?
ఎ) మహాత్మా గాంధీ
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) మెట్కాఫ్
డి) లార్డ రిప్పన్
- View Answer
- సమాధానం: బి
42. ఏ విభాగాన్ని పంచాయతీ వ్యవస్థకు ‘హృదయం, ఆత్మ’గా వర్ణిస్తారు?
ఎ) గ్రామ సభ
బి) గ్రామ సచివాలయం
సి) జిల్లా పరిషత్
డి) గ్రామ పంచాయతీ
- View Answer
- సమాధానం:ఎ
43.కింది వాటిలో 73వ రాజ్యాంగ సవరణలో రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలేసిన అంశం ఏది?
ఎ) సర్పంచ్ ఎన్నిక
బి) వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు
సి) స్థానిక శాసన సభ్యులు స్థానిక సంస్థల సమావేశాలకు హాజరు కావడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
44. పంచాయతీల వికాసంలో 1965-69 దశను ఏవిధంగా పేర్కొంటారు?
ఎ) వికాస దశ
బి) స్తబ్ద దశ
సి) పతన దశ
డి) స్థిరీకరణ దశ
- View Answer
- సమాధానం: బి
45. కింది వారిలో ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేదు?
ఎ) మండలాధ్యక్షుడు
బి) జిల్లా పరిషత్ చైర్మన్
సి) మేయర్
డి) సర్పంచ్
- View Answer
- సమాధానం: డి
46. కింది వాటిలో స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏది?
ఎ) నిధులు
బి) విధులు
సి) సిబ్బంది
డి) శిక్షణా లేమి
- View Answer
- సమాధానం: ఎ
47. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలపై ఎలాంటి నియంత్రణ కలిగి ఉంటాయి?
ఎ) పరిపాలనా నియంత్రణ
బి) ఆర్థిక నియంత్రణ
సి) విధానపర నియంత్రణ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
48. గ్రామపంచాయతీ కార్యదర్శి’ పదవి ఏ సంవత్సరంలో అవతరించింది?
ఎ) 2000
బి) 2002
సి) 2004
డి) 2006
- View Answer
- సమాధానం: బి
49. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, ఒక రాష్ట్ర జనాభా ఎంత కంటే తక్కువ ఉంటే మూడంచెల వ్యవస్థ అవసరం లేదు?
ఎ) 10 లక్షలు
బి) 15 లక్షలు
సి) 20 లక్షలు
డి) 25 లక్షలు
- View Answer
- సమాధానం: సి
50. ఆంధ్రప్రదేశ్‌లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
ఎ) 1993 మే 30
బి) 1994 మే 30
సి) 1993 ఏప్రిల్ 24
డి) 1994 ఏప్రిల్ 24
- View Answer
- సమాధానం: బి