పంచాయతీరాజ్ వ్యవస్థ
1.జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? (ఎస్ఐ - 2012)
ఎ) మార్చి - 28
బి) అక్టోబర్ - 24
సి) ఆగస్టు - 24
డి) ఏప్రిల్ - 24
- View Answer
- సమాధానం: డి
2. భారతదేశంలోని మొత్తం స్థానాల్లో మూడో వంతు స్థానాలను మహిళలకు ఏ ఎన్నికల్లో కేటాయించారు?(ఎక్సైజ్ కానిస్టేబుల్ - 2013)
ఎ) గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు
బి) విధానసభ
సి) విధాన మండలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
3. భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 64వ సవరణ
బి) 72వ సవరణ
సి) 73వ సవరణ
డి) 74వ సవరణ
- View Answer
- సమాధానం: డి
4. పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేసినందుకు 2012 ఏప్రిల్ 24న ఏ రాష్ర్టం ఉత్తమ రాష్ర్ట అవార్డు పొందింది?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) సిక్కిం
సి) బిహార్
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: బి
5.గ్రామ సర్పంచ్‌ను ఎలా ఎన్నుకుంటారు?
ఎ) ప్రజలు ప్రత్యక్షంగా..
బి) వార్డు సభ్యులు కలిసి
సి) కలెక్టర్ నియమిస్తాడు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
6. జిల్లా పరిషత్‌లో ఉండే స్థాయీ సంఘాల సంఖ్య?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం: డి
7. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) గుజరాత్
బి) రాజస్థాన్
సి) బిహార్
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
8. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి వీటిలో దేన్ని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు?
ఎ) పంచాయతీరాజ్ సంస్థల్లో 33.33 శాతం సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించాలి
బి) పంచాయతీరాజ్ సంస్థల్లో వనరుల కోసం రాష్ట్రాలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాయి
సి) పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పదవులు కోల్పోతారు
డి) రాష్ర్ట ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థను రద్దు చేస్తే తిరిగి ఆరు నెలల్లోపు ఎన్నికలు జరపాలి
- View Answer
- సమాధానం: సి
9. గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఎవరి కాలంలో ఉండేవి?
ఎ) చోళులు
బి) బ్రిటిష్
సి) పాండ్య
డి) మొగలులు
- View Answer
- సమాధానం: ఎ
10. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ?
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) విఠల్ కమిటీ
సి) జి.వి.కె.రావు కమిటీ
డి) బల్వంతరాయ్ మెహతా కమిటీ
- View Answer
- సమాధానం: డి
11. రాష్ర్ట ఆర్థిక (ఫైనాన్స్) సంఘాన్ని నియమించేది ఎవరు?
ఎ) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
బి) ప్రధానమంత్రి
సి) రాష్ర్ట ప్రభుత్వం
డి) భారత ఆర్థిక (ఫైనాన్స్) సంఘం
- View Answer
- సమాధానం: సి
12. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీకి ఎన్ని కార్యాత్మక విధులుంటాయి?
ఎ) 27
బి) 28
సి) 29
డి) 30
- View Answer
- సమాధానం: సి
13. గ్రామాదికారుల పదవులను ఎప్పుడు రద్దు చేశారు?
ఎ) 1983 డిసెంబర్
బి) 1984 మార్చి
సి) 1984 జనవరి
డి) 1985 మార్చి
- View Answer
- సమాధానం: సి
14.మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
ఎ) మూడో భాగం
బి) 21వ భాగం
సి) 9వ భాగం
డి) 8వ భాగం
- View Answer
- సమాధానం: సి
15. మండల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ?
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) బల్వంతరాయ్ మెహతా కమిటీ
సి) నరసింహన్ కమిటీ
డి) వెంగళరావు కమిటీ
- View Answer
- సమాధానం: ఎ
16. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి రాష్ర్టం?
ఎ) బిహార్
బి) హర్యానా
సి) ఢిల్లీ
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ
17. భారత రాజ్యాంగంలోని 243 అధికరణను ప్రభుత్వం సవరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ అధికరణం ఏ అంశానికి సంబంధించింది?
ఎ) ప్రాథమిక విద్య
బి) గ్రామీణ ఉద్యోగ హామీ చట్టం
సి) పంచాయతీరాజ్ విధానం
డి) పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్
- View Answer
- సమాధానం: సి