పార్లమెంట్ సభ్యులు ఎన్ని రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుంటే సభ్యత్వం రద్దు అవుతుంది?
1. లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో-ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు?
1) 101
2) 102
3) 103
4) 104
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 331, 332, 333 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను కల్పిస్తూ, ఇవి 10 సంవత్సరాల పాటు అంటే 1960 వరకు ఉంటాయని ఆర్టికల్-334లో పేర్కొన్నారు. కానీ దీన్ని ఇప్పటికి 7సార్లు పొడిగించారు.
ఇటీవల మోడీ ప్రభుత్వం 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ర్టపతి సంతకంతో 2019 డిసెంబర్ 12న 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్టికల్ 334 ప్రకారం ఈ రిజర్వేషన్లు 80 సంవత్సరాలపాటు (రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 సంవత్సరం నుంచి) అంటే 2030 వరకు అమలులో ఉంటాయి. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్సీలకు 84 స్థానాలు, ఎస్టీలకు 47 స్థానాలు రిజర్వ చేశారు.
- సమాధానం: 4
2. భారత పార్లమెంట్ తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయింది?
1) 1952 మార్చి 13
2) 1952 మే 13
3) 1953 మార్చి 13
4) 1953 మే 13
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న ఏర్పడింది. లోక్‌సభ 1952 ఏప్రిల్ 17న ఏర్పడింది. ఈ రెండు సభలతో కూడిన భారత పార్లమెంట్ తొలిసారిగా 1952 మే 13న సమావేశం అయింది. భారత పార్లమెంట్ 2002 మే 13న స్వర్ణోత్సవాలు జరుపుకోగా, 2012 మే 13న వజ్రోత్సవ ఉత్సవాలు జరుపుకుంది.
- సమాధానం: 2
3. లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత?
1) 545
2) 550
3) 552
4) 543
- View Answer
- సమాధానం: 3
వివరణ: లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి ఎన్నిక కాగా, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. మిగిలిన ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులను రాష్ర్టపతి నియమిస్తారు. కానీ ప్రస్తుతం లోక్‌సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యారు. మిగిలిన ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులను రాష్ర్టపతి నియమిస్తాడు.
- సమాధానం: 3
4. లోక్‌సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి?
1) సిక్కిం, నాగాలాండ్, గోవా
2) సిక్కిం, గోవా, మణిపూర్
3) సిక్కిం, నాగాలాండ్, మిజోరాం
4) సిక్కిం, మిజోరాం, మణిపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సిక్కిం, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం ఒక్క సీటు మాత్రమే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నారు. లోక్‌సభలో ఎక్కువ సభ్యులు ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ (80), మహారాష్ర్ట (48), పశ్చిమ బెంగాల్ (42).
- సమాధానం: 3
5. రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది?
1) సాధారణ మెజారిటీ పద్ధతి, రహస్య ఓటు పద్ధతి
2) సాధారణ మెజారిటీ పద్ధతి, బహిరంగ ఓటు పద్ధతి
3) నైష్పత్తిక ప్రాతినిధ్య, రహస్య ఓటు పద్ధతి
4) నైష్పత్తిక ప్రాతినిధ్య, బహిరంగ ఓటు పద్ధతి
- View Answer
- సమాధానం: 4
వివరణ: రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా, 233 మంది సభ్యులు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఎన్నుకోగా మిగిలిన 12 మంది సభ్యులను వివిధ రంగాల్లో ప్రముఖులను రాష్ర్టపతి నియమిస్తాడు. వీరి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతిలో బహిరంగ ఓటు విధానం ద్వారా జరుగుతుంది. రాజ్యసభ సభ్యుని ఎన్నికల్లో ఓటువేసే ఎం.ఎల్.ఎ. తాను వేసిన ఓటును పార్టీ నియమించిన ఏజెంట్‌కు చూపవలసి ఉంటుంది. క్రాస్ ఓటింగ్‌ను నిరోధించటానికి రాజ్యసభకు 2003 సంవత్సరం నుంచి బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభ సభ్యుని ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
- సమాధానం: 4
6. పార్లమెంట్‌కు పోటీచేసే అభ్యర్థి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత?
1) 10,000
2) 15,000
3) 20,000
4) 25,000
- View Answer
- సమాధానం: 4
వివరణ: లోక్‌సభ లేదా రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థి రూ.25,000 డిపాజిట్ చెల్లించాలి. లోక్‌సభ విషయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.12,500 చెల్లిస్తే సరిపోతుంది. రాజ్యసభలో ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. కాబట్టి డిపాజిట్ చెల్లింపులో ఎటువంటి మినహాయింపు ఉండదు. పోలై చెల్లిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు వస్తే డిపాజిట్ వాపస్ వస్తుంది. లేనిచో డిపాజిట్ గల్లంతు అవుతుంది.
- సమాధానం: 4
7. భారత పార్లమెంట్ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి?
1) ఒకసారి
2) రెండుసార్లు
3) మూడుసార్లు
4) నిర్ణీత కనీస పరిమితి లేదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంట్ సంవత్సరానికి కనీసం రెండుసార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య 6 నెలల వ్యవధి ఉండరాదు. కానీ ప్రస్తుతం భారత పార్లమెంట్ సంవత్సరానికి మూడుసార్లు సమావేశం అవుతుంది.
అవి..
1) బడ్జెట్ సమావేశాలు (ఫిబ్రవరి నుంచి ఏప్రిల్)
2) వర్షాకాల సమావేశాలు (జూలై నుంచి సెప్టెంబర్)
3) శీతాకాల సమావేశాలు (నవంబర్ నుంచి డిసెంబర్)
అదే విధంగా భారత పార్లమెంట్ సంవత్సరానికి గరిష్టంగా ఎన్నిసార్లు అయినా సమావేశం కావచ్చు.
- సమాధానం: 2
8. కింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది?
ఎ) సాధారణ బిల్లు
బి) రాజ్యాంగ సవరణ బిల్లు
సి) నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు
డి) ద్రవ్యబిల్లు
1) ఎ, బి
2) ఎ, సి
3) ఎ, బి,సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పార్లమెంట్ ఉభయసభల్లో దేనిలోైనైనా ప్రవేశపెట్టవచ్చు. వీటి విషయంలో రెండు సభల ఆమోదం అవసరం. అదే విధంగా రెండు సభలకు సమాన అధికారాలు ఉన్నాయి.
కానీ ద్రవ్యబిల్లు విషయంలో లోక్‌సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. స్పీకర్ ఒక బిల్లుని ద్రవ్యబిల్లు అని నిర్ణయించాక రాష్ర్టపతి అనుమతితో దానిని ముందుగా లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్‌సభ ఆమోదించిన ద్రవ్యబిల్లుని రాజ్యసభ 14 రోజుల లోపు ఆమోదించాలి లేనిచో అది ఆమోదించినట్లుగా భావించి రాష్ర్టపతి ఆమోదానికై పంపబడును.
- సమాధానం: 3
9. సభలో సభ్యుడు కాకున్న సభకు అధ్యక్షతవహించే వ్యక్తి?
1) లోక్‌సభ స్పీకర్
2) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
3) రాజ్యసభ చైర్మన్
4) పై ముగ్గురూ
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత ఉపరాష్ర్టపతి పదవీ రీత్యా రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తాడు. వాస్తవానికి ఇతను రాజ్యసభ సభ్యుడు కాకున్నప్పటికీ సభకు అధ్యక్షత వహించి బిల్లుల ఆమోదానికి, సభ సజావుగా సాగటానికి కృషి చేస్తాడు. ఇతనికి మాములు సందర్భంతో ఓటు హక్కు ఉండదు. కానీ ఒక బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు ఓటు హక్కు ఉంటుంది. దీనినే ‘కాస్టింగ్ ఓటు’ లేదా ‘నిర్ణాయక ఓటు’ అని అంటారు.
- సమాధానం: 3
10. లోక్‌సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు?
1) జె.బి. కృపలానీ
2) మొరార్జీ దేశాయ్
3) చరణ్‌సింగ్
4) వై.బి. చవాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పార్లమెంట్లో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాలంటే ఆయా సభలో 10 శాతం సీట్లను గెలుచుకోవాలి. తొలిసారిగా 1977లో జనతాపార్టీ మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 154 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రతిపక్షంగా గుర్తించబడింది. కాంగ్రెస్ నేత వై.బి.చవాన్ అధికారికంగా ప్రతిపక్షనేతగా గుర్తింపు పొందాడు. అదే సంవత్సరం (1977)లో కమలాపాటి త్రిపాఠి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాడు.
- సమాధానం: 4
11. లోక్‌సభకు తొలిసారిగా మధ్యంతర ఎన్నిక ఎప్పుడు జరిగింది?
1) 1967
2) 1971
3) 1977
4) 1980
- View Answer
- సమాధానం: 2
వివరణ: సాధారణంగా లోక్‌సభ కాల పరిమితి 5 సంవత్సరాలు. కానీ ప్రధాని సలహా ప్రకారం దానిని ముందే రద్దు చేసే అధికారం రాష్ర్టపతికి ఉంది. ఆ సందర్భంలో నిర్వహించే ఎన్నికను మధ్యంతర ఎన్నికలు అంటారు. 1967లో జరిగిన నాలుగో లోక్‌సభను ఒక సంవత్సరం ముందు 1971లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ సలహాపై రాష్ర్టపతి వి.వి. గిరి రద్దు చేశాడు. ఈ విధంగా తొలిసారిగా 1971లో మధ్యంతర ఎన్నిక జరిగింది. అనంతరం 1980లో రెండోసారి మధ్యంతర ఎన్నిక జరిగింది. లోక్‌సభకు 17 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో 7 సార్లు మధ్యంతర ఎన్నికలు (1971, 1980, 1984, 1991, 1998, 1999, 2004) జరిగాయి.
- సమాధానం: 2
12. ఎంపీల్యాడ్‌స స్కీమ్ కింద ఒక్కొక్క ఎం.పి.కి సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఇస్తున్నారు?
1) 1
2) 3
3) 5
4) 10
- View Answer
- సమాధానం: 3
వివరణ: పీవీ నరసింహారావు భారత ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో ఎంపీల్యాడ్‌స స్కీమ్‌ను ప్రారంభించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్‌గా పిలిచే దీని కింద 1993లో ఒక్కొక్క ఎంపీకి నియోజవర్గ అభివృద్ధికి సంవత్సరానికి 5 లక్షలు కేటాయించారు. దీనిని 1994లో 1 కోటి, 1998లో 2 కోట్లు, 2011 నుంచి 5 కోట్లకు పెంచారు.
- సమాధానం: 3
13. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన భారత ప్రధానులు ఎంత మంది ఉన్నారు?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 2
వివరణ: పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంట్ విలువలను పెంపొందించిన వ్యక్తులకు మాజీ హోంశాఖ మంత్రి పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీద ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 1993 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డును 1993లో ఇంద్రజిత్ గుప్తా పొందగా చివరగా 2017 సంవత్సరానికి భర్తృహరి మహతాబ్‌కు లభించింది. ఈ అవార్డును ముగ్గురు ప్రధానమంత్రులు పొందారు. వారు అటల్ బిహారీ వాజ్పాయ్ (1994), చంద్రశేఖర్ (1995), మన్మోహన్ సింగ్ (2002).
- సమాధానం: 2
14. ఇప్పటి వరకు లోక్‌సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్‌సభ ఎన్నోది?
1) 3
2) 5
3) 7
4) 9
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐదో లోక్‌సభ 1971లో ఏర్పడింది. దీని పదవీ కాలం 1976 వరకు ఉంది. కానీ ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975లో ఎమర్జెన్సీ విధించాక, 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా 5వ లోక్‌సభ కాల పరిమితిని ఒక సంవత్సరం అంటే 1977 వరకు పొడిగించారు.
అదే విధంగా అతి తక్కువ కాలం కొనసాగిన లోక్‌సభ 12వ లోక్‌సభ. ఇది కేవలం 13 నెలలు (1998-99) మాత్రమే కొనసాగింది. లోక్‌సభ కాల పరిమితిని పెంచే అధికారం పార్లమెంట్‌కు ఉండగా, దానిని ముందే రద్దుచేసే అధికారం రాష్ర్టపతికి ఉంది.
- సమాధానం: 2
15. పార్లమెంట్ సభ్యులు ఎన్ని రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుంటే సభ్యత్వం రద్దు అవుతుంది?
1) 30 రోజులు
2) 60 రోజులు
3) 3 నెలలు
4) 6 నెలలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: పార్లమెంట్ సభ్యుడు 60 రోజుల పాటు సభాధ్యక్షుని అనుమతి లేకుండా సభకు గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతాడు. 1976-77లో తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యస్వామి ఈ విధంగానే రాజ్యసభ సభ్యత్వం కోల్పోయాడు.
అదే విధంగా పార్లమెంట్ సభ్యుడు పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే సభాధ్యక్షుడు అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు. అతని ఎన్నిక చెల్లదు అని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పునిస్తే రాష్ర్టపతి అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు.
- సమాధానం: 2
16. రాష్ర్ట జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంట్ ఏ సందర్భంలో శాసనాలు రూపొందించవచ్చు?
1) జాతీయ ప్రయోజనం
2) రెండు రాష్ట్రాలు ఉమ్మడి ప్రయోజనం కోసం
3) అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు
4) పై అన్నీ సందర్భాల్లో
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్టికల్-249 ప్రకారం జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ర్ట జాబితాలోని అంశంపై శాసనం చేయాలని రాజ్యసభ 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం చేసినప్పుడు పార్లమెంట్ రాష్ర్ట జాబితాలోని అంశంపై కూడా శాసనం చేయవచ్చు. ఆర్టికల్-250 ప్రకారం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కూడా రాష్ర్ట జాబితాలోని అంశంపై కూడా పార్లమెంట్ చట్టం చేయవచ్చు. ఆర్టికల్-252 ప్రకారం రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ర్ట జాబితాలోని అంశంపై చట్టం చేయాలని కోరితే పార్లమెంట్ చట్టం చేస్తుంది.
- సమాధానం: 4
17. {పస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్చకూడదు?
1) 2025
2) 2026
3) 2030
4) 2035
- View Answer
- సమాధానం: 2
వివరణ: 84వ రాజ్యాంగ సవరణ చట్టం (2001) ద్వారా ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను 2026 వరకు మార్చకూడదని పేర్కొన్నారు. నియోజక వర్గాలను పునర్విభజించటానికి పై సవరణ ద్వారా 4వ డీలిమిటేషన్ కమిషన్‌ను జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో వేసినప్పుడు ఈ అంశాన్ని చేర్చారు. వాస్తవానికి ప్రారంభంలో లోక్‌సభ సభ్యుల సంఖ్య 489 ఉండేది. దానిని 1956లో 525కి, 1973లో 552కి పెంచారు. ఇది 2026 వరకు కొనసాగుతుంది.
- సమాధానం: 2
18. భారత పార్లమెంట్ సమావేశాలు దేనితో ప్రారంభమవుతాయి?
1) శూన్య సమయం
2) ప్రశ్నోత్తరాలు సమయం
3) అరగంట చర్చ
4) సావధాన తీర్మానం
- View Answer
- సమాధానం: 2
వివరణ: పార్లమెంట్ సమావేశాలు ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయి. ఇది ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది. ప్రశ్నలు 3 రకాలు.
1. నక్షత్రపు గుర్తు ప్రశ్నలు: వీటికి 10 రోజుల ముందు సభాధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. దీనికి మంత్రులు మౌఖికంగా సమాధానం చెప్పాలి.
2. నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు: వీటికి కూడా 10 రోజుల ముందు సభాధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. దీనికి మంత్రులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి.
3. స్వల్ప వ్యవధి ప్రశ్నలు: అతి ముఖ్య విషయాలపై 3 నుంచి 10 రోజుల లోపు ముందస్తు అనుమతితో సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు.
- సమాధానం: 2