మాగ్నాకార్టా అనేది ఏ భాషా పదం?
1. ఏ సంవత్సరంలో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ తొలిసారి ప్రజలకు కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వక ప్రకటన (మాగ్నాకార్టా) చేశాడు?
1) 1315
2) 1215
3) 1415
4) 1515
- View Answer
- సమాధానం: 2
2. మాగ్నాకార్టా అనేది ఏ భాషా పదం?
1) ఇంగ్లిష్
2) గ్రీకు
3) లాటిన్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 3
3. ‘బిల్ ఆఫ్ రైట్స్’ ఏ దేశానికి సంబంధించింది?
1) భారత్
2) ఫ్రాన్స
3) జర్మనీ
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
4. ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు జారీ చేసింది?
1) 1947 డిసెంబర్ 10
2) 1948 డిసెంబర్ 1
3) 1948 డిసెంబర్ 10
4) 1948 డిసెంబర్ 6
- View Answer
- సమాధానం: 3
5. ప్రాథమిక హక్కుల ఉప సంఘాన్ని ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?
1) జె.బి. కృపలానీ
2) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
3) జవహర్ లాల్ నెహ్రూ
4) బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: 1
6. కింది వాటిలో రాజ్యాంగంలోని ఏయే ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి?
1) 14, 20, 21, 23
2) 15, 16, 19, 21(ఎ), 29, 30
3) 13, 25, 21, 24
4) 25, 27, 28, 31
- View Answer
- సమాధానం: 2
7.మంచి పౌరుడు అంటే:
1) ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి
2) రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి
3) ఓటు వేసే వ్యక్తి, పన్ను చెల్లించే వారు
4) సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి
- View Answer
- సమాధానం: 4
8.కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పేర్కొన్నారు
బి) ప్రాథమిక హక్కులు మూడో భాగంలో 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు ఉన్నాయి
సి) ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు
డి) ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాథమిక హక్కులు 6
1) ఎ, డి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి, డి
4) ఏవీకావు
- View Answer
- సమాధానం: 3
9. ప్రాథమిక హక్కుల్లో రాజ్యం నిర్వచనం గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
1) 15
2) 12
3) 17
4) 13
- View Answer
- సమాధానం: 2
10. రాజ్యాంగంలోని 13వ నిబంధన ప్రకారం కింది వాటిలో దేనికి న్యాయ సమీక్ష అధికారం ఉంది?
1) కేంద్ర ప్రభుత్వం
2) పార్లమెంట్
3) న్యాయస్థానం
4) శాసన సభ
- View Answer
- సమాధానం: 3
11. రాజ్యాంగంలోని 14వ నిబంధన ప్రకారం ‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు?
1) అమెరికా
2) బ్రిటన్
3) రష్యా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
12. పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు ఏ కేసులో వెలువరించింది?
1) రుధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా - 1982
2) విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997
3) అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
13. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కొన్ని తరాల నుంచి సామాజికంగా, విద్య పరంగా వెనకబాటుకు గురయ్యాయనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించ వచ్చని తెలిపే ఆర్టికల్ ఏది?
1) 15 (1)
2) 15 (2)
3) 15 (3)
4) 15 (4)
- View Answer
- సమాధానం: 4
14. తమిళనాడులో ఎంత శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి?
1) 50%
2) 59%
3) 69%
4) 49%
- View Answer
- సమాధానం: 3
15. ఉన్నత విద్యా సంస్థలన్నింటిలో విద్య పరంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపే నిబంధన?
1) 15(5)
2) 15(4)
3) 15(3)
4) 15(2)
- View Answer
- సమాధానం: 1
16.‘కుల ప్రాతిపదికన విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు చెల్లవు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు వెలువరించింది?
1) ఎం.ఆర్. బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ - 1963
2) చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ - 1951
3) కేశవానంద భారతీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
17. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు లభించకపోతే వాటిని బ్యాక్లాగ్ పోస్టులుగా ప్రకటించాలని ఎన్నో రాజ్యాంగ సవరణలో పొందుపరిచారు?
1) 77వ రాజ్యాంగ సవరణ చట్టం - 1995
2) 85వ రాజ్యాంగ సవరణ చట్టం - 2001
3) 81వ రాజ్యాంగ సవరణ చట్టం - 2000
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 3
18. మండల్ కమిషన్‌ను నియమించిన ప్రధాన మంత్రి ఎవరు?
1) ఇందిరా గాంధీ
2) రాజీవ్ గాంధీ
3) పి.వి. నరసింహారావు
4) మొరార్జీ దేశాయ్
- View Answer
- సమాధానం: 4
19.క్రీమిలేయర్ వర్గాలను గుర్తించడానికి 1993 లో నియమించిన కమిటీ/కమిషన్ ఏది?
1) మండల్ కమిషన్
2) రామ్నందన్ ప్రసాద్ కమిటీ
3) రంగరాజన్ కమిటీ
4) సురేశ్ టెండూల్కర్ కమిటీ
- View Answer
- సమాధానం: 2
20. కింది వాటిలో ఏ కేసును మండల్ కేసుగా పరిగణించారు?
1) ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా - 1993
2) ఎం.ఆర్. బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ - 1963
3) ఇనాందార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర - 2005
4) చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ - 1951
- View Answer
- సమాధానం: 1
21. అస్పృశ్యతా నిషేధం (అంటరానితనం నేరం) గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
1) 15
2) 16
3) 17
4) 18
- View Answer
- సమాధానం: 3
22. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అకృత్యాల నిషేధించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 1979
2) 1989
3) 1969
4) 1999
- View Answer
- సమాధానం: 2
23. ‘రాజ్యాంగంలోని 18వ నిబంధన ప్రకారం బిరుదులను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం’ అని ఏ హైకోర్టు పేర్కొంది?
1) మధ్యప్రదేశ్ హైకోర్టు
2) ఢిల్లీ హైకోర్టు
3) మద్రాస్ హైకోర్టు
4) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
- View Answer
- సమాధానం: 1
24. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బిరుదులైన భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్లను ఏ సంవత్సరం నుంచి తిరిగి ప్రకటించారు?
1) 1979
2) 1980
3) 1981
4) 1984
- View Answer
- సమాధానం: 2
25.రాజ్యాంగంలోని 19వ నిబంధనకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) 19(ఎ) - వాక్ స్వాతంత్య్రపు హక్కు, అభిప్రాయ ప్రకటన
బి)19(బి)- శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశాలు నిర్వహించుకోవడం
సి) 19 (సి) - సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం
డి) 19 (డి) - దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ
ఇ) 19 (ఇ) - దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ
1) ఎ, బి మాత్రమే సరైనవి
2) ఎ, డి మాత్రమే సరైనవి
3) ఎ, బి, సి, డి
4) ఏవీకావు
- View Answer
- సమాధానం: 3
26. కింది వాటిలో వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించే హక్కు ఏది?
1) 19
2) 20
3) 21
4) 22
- View Answer
- సమాధానం: 3
27. ‘కేంద్ర ప్రభుత్వ చర్య ఏకపక్షంగా ఉండకూడదు. సహజ న్యాయ సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం - 1978
2) ఎ.కె. గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం - 1950
3) నందినీ శతపతి వర్సెస్ పి.ఎల్. దానీ కేసు - 1978
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
28. కింది వాటిలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002తో సంబంధం ఉన్న నిబంధనలు ఏవి?
1) 21(ఎ)
2) 45
3) 51(ఎ)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29.విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2009 ఏప్రిల్ 1
2) 2010 ఏప్రిల్ 1
3) 2011 ఏప్రిల్ 1
4) 2012 ఏప్రిల్ 1
- View Answer
- సమాధానం: 2
30. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) నిబంధన 23 - మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టి చాకిరీ నిషేధం
బి) నిబంధన 24 - బాల కార్మిక వ్యవస్థ రద్దు
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
31. భారత రాజ్యాంగంలో మత స్వాతంత్య్రపు హక్కు గురించి ఏ నిబంధన నుంచి ఏ నిబంధన వరకు పొందు పరిచారు?
1) 14 నుంచి 18 వరకు
2) 19 నుంచి 22 వరకు
3) 23 నుంచి 24 వరకు
4) 25 నుంచి 28 వరకు
- View Answer
- సమాధానం: 4
32. లౌకికత్వం అనే పదాన్ని ప్రవేశికలో పొందు పరచక ముందు ఏయే నిబంధనలు లౌకికత్వం గురించి పేర్కొన్నాయి?
1) 14 నుంచి 18వ నిబంధనలు
2) 19 నుంచి 22వ నిబంధనలు
3) 23 నుంచి 24వ నిబంధనలు
4) 25 నుంచి 28వ నిబంధనలు
- View Answer
- సమాధానం: 4
33. మత మార్పిడులను నిషేధిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టం రాజ్యాంగ బద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఏ కేసులో సమర్థించింది?
1) స్టానిలస్ వర్సెస్ మధ్యప్రదేశ్ - 1974
2) స్టానిలస్ వర్సెస్ ఒడిశా - 1977
3) స్టానిలస్ వర్సెస్ కేరళ - 1977
4) స్టానిలస్ వర్సెస్ తమిళనాడు - 1977
- View Answer
- సమాధానం: 1
34. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రకాల మైనార్టీలు ఉన్నారు?
1) 3
2) 2
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 2
35.ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించారు?
1) 42
2) 44
3) 43
4) 45
- View Answer
- సమాధానం: 2
36. ‘రాజ్యాంగంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న అధికరణ ఏది అని అడిగితే 32వ అధికరణ అని సమాధానం ఇస్తా. ఇది లేకుంటే రాజ్యాంగం నిర్వీర్యం అయిపోతుంది. ఈ అధికరణే రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం లాంటిది’ అని వ్యాఖ్యానించిన వారెవరు?
1) బాబూ రాజేంద్రప్రసాద్
2) జవహర్లాల్ నెహ్రూ
3) మహాత్మా గాంధీ
4) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: 4
37. ‘హక్కులకే హక్కు’ అని పేర్కొనే ప్రాథమిక హక్కు ఏది?
1) రాజ్యాంగ పరిహారపు హక్కు
2) ఆస్తి హక్కు
3) మత స్వాతంత్య్రపు హక్కు
4) విద్యా విషయ హక్కు
- View Answer
- సమాధానం: 1
38. రాజ్యాంగంలోని 32(2)వ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కుల అమలుకు సుప్రీంకోర్టు ఎన్ని రకాల రిట్లు జారీ చేస్తుంది?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 3
39.రిట్ అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు?
1) అమెరికా
2) ఫ్రాన్స
3) బ్రిటన్
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
40. వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ, చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని కూడా నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటం ఏ రిట్ యొక్క ప్రధాన ఉద్దేశం?
1) హెబియస్ కార్పస్
2) మాండమస్
3) ప్రొహిబిషన్
4) సెర్షియోరరీ
- View Answer
- సమాధానం: 1
41. మాండమస్ రిట్ అంటే ?
1) ఒక బాడీ
2) ఆర్డర్
3) స్టేట్
4) సహజ న్యాయం
- View Answer
- సమాధానం: 2
42.ప్రొహిబిషన్ రిట్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) భాష పరంగా ప్రొహిబిషన్ అంటే నిషేధం అని అర్థం
బి) ఈ రిట్ ప్రధాన ఉద్దేశం దిగువ కోర్టు తమ పరిధులను అతిక్రమించకుండా దానిని నిరోధించడం
సి) ప్రొహిబిషన్ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది
డి) పరిపాలన, చట్టపర సంస్థలకు ఈ రిట్ వర్తించదు
1) ఎ, డి మాత్రమే
2) బి, సి మాత్రమే
) సి, డి మాత్రమే
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
43. సెర్షియోరరీ రిట్ ఉద్దేశం ఏమిటి?
1) కోర్టు ముందు రికార్డుల పరిశీలన
2) రాష్ట్రాన్ని నిరోధించడం
3) పరిపాలన నిర్ణయం
4) న్యాయపరమైన నిర్ణయం
- View Answer
- సమాధానం: 4
44. ప్రొహిబిషన్, సెర్షియోరరీలలో ఉమ్మడి అంశం ఏది?
1) కోర్టులు/ కోర్టు అధికారాలు ఉన్న వారిపై ప్రయోగించడం
2) అందరూ సమానం అనే సూత్రం
3) సుప్రీంకోర్టులో మాత్రమే వేయాలి
4) జడ్జి విచక్షణాధికారంపై వేయాలి
- View Answer
- సమాధానం: 1
45. కో- వారెంటో అంటే:
1) ఒక అధికారాన్ని ప్రశ్నించడం
2) చట్ట వ్యతిరేక అధికారం
3) చట్టం పరిధిలో ఉన్నవి
4) వాస్తవాన్ని గుర్తించడం
- View Answer
- సమాధానం: 1
46. ‘ప్రకృతిసిద్ధ హక్కులకు ఆధునిక పేరే ప్రాథమిక హక్కులు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో వ్యాఖ్యానించింది?
1) కేశవానంద భారతీ వర్సెస్ కేరళ
2) దీప్ చంద్ వర్సెస్ ఉత్తర్‌ప్రదేశ్
3) గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్
4) ఎస్. ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3