కేంద్రీకరణ, వికేంద్రీకరణ, స్థానిక ప్రభుత్వాలు
1. కింది వ్యాఖ్యల్లో సరైంది ఏది?
ఎ) రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలున్నాయి. వీటిని 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా చేర్చారు.
బి) రాజ్యాంగంలోని 9(ఎ) భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రకరణ 243ఖ ప్రకారం ప్రతి రాష్ర్టంలో నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనే మూడు రకాల పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయి.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) రెండూ సరైనవే
4) రెండూ సరికాదు
- View Answer
- సమాధానం: 3
2. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఏ రాష్ట్రాలకు వర్తించవు?
1) గోవా, జమ్మూ-కశ్మీర్, పుదుచ్ఛేరి
2) ఢిల్లీ, గోవా, మిజోరాం, మేఘాలయ
3) మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం
4) మణిపూర్, నాగాలాండ్
- View Answer
- సమాధానం: 3
3. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం?
1) అశోక్ మెహతా కమిటీ
2) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
3) వసంతరావ్ నాయక్ కమిటీ
4) రాజమన్నార్ కమిటీ
- View Answer
- సమాధానం: 2
4. నూతన పంచాయతీ రాజ్ చట్టం-1993లో చేర్చిన కొత్త అంశాలకు సంబంధించి సరైంది ఏది?
1) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్య, సామాజిక అడవులు తదితర కొత్త విధులను చేర్చారు
2) నిర్దేశించిన సమయంలో అన్ని స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన
3) పంచాయతీల్లోని స్థానాల్లో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయింపు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
5.రాష్ర్ట ఆర్థికసంఘాన్ని ఎవరు నియమిస్తారు?
1) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
2) ప్రధానమంత్రి
3) రాష్ర్ట ప్రభుత్వం
4) భారత ఆర్థిక సంఘం
- View Answer
- సమాధానం: 3
6.73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో ఏ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రస్తావన లేదు?
1) వెనకబడిన తరగతులు
2) వికలాంగులు
3) మైనార్టీలు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
7. భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించిన కమిటీ ఏది?
1) అశోక్ మెహతా కమిటీ
2) విఠల్ కమిటీ
3) జి.వి.కె.రావు కమిటీ
4) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
- View Answer
- సమాధానం: 4
8. పంచాయతీరాజ్ నిర్మాణ స్వరూపం ఏది?
1) గ్రామస్థాయితో ఒక అంచె స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ
2) గ్రామం, బ్లాక్ స్థాయిలతో రెండంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ
3) గ్రామం, బ్లాక్, జ్లిలా స్థాయిలతో మూడంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ
4) గ్రామం, బ్లాక్, జిల్లా, రాష్ర్ట స్థాయిలతో నాలుగంచెల స్వపరిపాలనా వ్యవస్థ
- View Answer
- సమాధానం:3
9. 73వ, 74వ రాజ్యాంగ సవరణల్లో ఉన్న ఏకైక అనుసంధాన అంశం ఏది?
1) జిల్లా ప్రణాళికా కమిటీ
2) వార్డు కమిటీలు
3) మెట్రోపాలిటన్ కమిటీ
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం:1
10. నూతన పంచాయతీ వ్యవస్థపై ఉన్న విమర్శ ఏది?
1) ఒక అంచెకు మరొక అంచెకు మధ్య సంబంధం లోపించడం
2) రాష్ట్రాలకు ఎక్కువ విచక్షణ అధికారం ఇవ్వడం
3) స్థానిక శాసనసభ్యులకు ప్రాతినిధ్యం ఇవ్వడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
11. మండల పరిషత్తు అధ్యక్షుణ్ని ఎవరు ఎన్నుకుంటారు?
1) ఓటర్లు ప్రత్యక్షంగా
2) మండల పరిషత్తు సభ్యులు
3) మండల పరిషత్తులో ఎన్నికైన సభ్యులు
4) మండలంలోని సర్పంచులు
- View Answer
- సమాధానం: 2
12. భారత రాజ్యాంగంలోని ఎన్నో ప్రకరణ ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్రాలు చర్యలు చేపడతాయి?
1) 39
2) 41
3) 40
4) 42
- View Answer
- సమాధానం: 3
13. గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం ఏది?
1) చోళులు
2) బ్రిటిష్
3) మొగల్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
14.స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది?
1) మానవ వనరుల శాఖ
2) గణాంక శాఖ
3) పట్టణాభివృద్ధి శాఖ
4) గ్రామీణాభివృద్ధి శాఖ
- View Answer
- సమాధానం: 4
15.సామాజికాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పనితీరును మెరుగు పరచడానికి బల్వంత్రాయ్ మెహతా అధ్యయన బృందం ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది?
1) రెండంచెలు
2) మూడంచెలు
3) నాలుగంచెలు
4) అయిదంచెలు
- View Answer
- సమాధానం: 2
16. కమిటీలు, అవి సూచించిన అంశాలకు సంబంధించి సరైన జత ఏది?
ఎ) అశోక్ మెహతా కమిటీ - రెండంచెలు
బి) ఎల్.ఎం.సింఘ్వి కమిటీ - న్యాయ పంచాయతీలు
సి) హనుమంతరావు కమిటీ - జిల్లా ప్రణాళిక
డి) దంత్వాలా కమిటీ - బ్లాక్ లెవల్ ప్రణాళిక
1) ఎ, బి
2) సి, డి
3) పైవన్నీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
17. కమిటీలు, వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) హబ్ హౌస్ కమిటీ - 1909
బి) బల్వంత్రాయ్ మెహతా కమిటీ- 1957
సి) అశోక్ మెహతా కమిటీ - 1977
డి) జి.వి.కె. రావు కమిటీ - 1993
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) బి, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 4
18. కిందివాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉద్దేశం కానిది?
1) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
2) భాగస్వామ్య ప్రజాస్వామ్యం
3) స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం
4) సామాజిక న్యాయాన్ని అందించడం
- View Answer
- సమాధానం: 4
19. గ్రామసభకు సంబంధించి సరైంది?
1) గ్రామసభలో ఆ గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు
2) గ్రామసభ ఏడాదికి రెండు పర్యాయాలు సమావేశం కావాలి
3) గ్రామసభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
20. గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి సరికాని అంశం ఏది?
1) ఎంపీటీసీ సభ్యులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. కానీ ఓటు హక్కు ఉండదు
2) స్వయం సహాయ గ్రూపు నుంచి ఒక సభ్యుణ్ని కో-ఆప్ట్ చేస్తారు
3) స్థానిక శాసనసభ్యుడు హోదా రీత్యా సభ్యుడిగా ఉంటాడు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
21. సీనరేజ్ రుసుం అంటే ఏమిటి?
1) ఖనిజేతర పదార్థాలపై వేసే పన్ను
2) ఖనిజాలపై వేసే పన్ను
3) కంటోన్మెంట్ బోర్డు విధించే పన్ను
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
22. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలు పంచాయతీ వ్యవస్థకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు, షరతులు చేశాయి. వాటిలో సరైంది?
1) స్థానిక సంస్థల్లో తప్పనిసరి ఓటింగ్ - గుజరాత్
2) కనీస విద్యార్హత - హర్యానా
3) ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండరాదు - ఆంధ్రప్రదేశ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
23. Panchayats Extension to Scheduled Areas(PESA) చట్టం ద్వారా అధిక ప్రాధాన్యత దేనికి ఉంటుంది?
1) గ్రామసభ
2) గ్రామ పంచాయతీ
3) సర్పంచ్
4) మండల పరిషత్
- View Answer
- సమాధానం: 1
24. IMPERIA, IMPERIUM అంటే ఏమిటి?
1) రాజ్యంలో రాజ్యం
2) సర్వోన్నత అధికారం
3) సామ్రాజ్యవాదం
4) స్వయం ప్రతిపత్తి
- View Answer
- సమాధానం: 1
25.పంచాయతీ వ్యవస్థ నిర్మాణం..
1) భౌతికపరమైంది
2) పాలనాపరమైంది
3) ఆర్థికపరమైంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
26.మొదటిసారిగా పంచాయతీ నిర్వహణను ఇంటర్నెట్ వెబ్ ద్వారా నియంత్రించిన రాష్ట్రం ఏది?
1) కేరళ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 1
27.పంచాయతీలు ''F3'' Syndromeతో సతమతం అవుతున్నాయనే విమర్శ ఉంది. ఇందులోని అంశాలు?
i) Functions
ii) Functionaries
iii) Funds i
v) Failures
1) i, ii, iv
2) i, iii, iv
3) ii, iii, iv
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
28. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను నియంత్రించే పద్ధతి ఏది?
1) సిబ్బంది నియామకం
2) అకౌంట్ల తనిఖీ
3) నిధుల మంజూరు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. నూతన పంచాయతీ చట్టంలో రాష్ట్రాల విచక్షణకు వదిలివేసిన అధికారాలు ఏవి?
1) సర్పంచ్ ఎన్నిక పద్ధతి
2) అధికారాల బదలాయింపు
3) స్థానిక శాసనసభ్యులకు ప్రాతినిధ్యం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4