కేంద్ర సమాచార కమిషన్ పరిధిలోకి రాని అంశాలు?
1. కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌కు సంబంధించి సరికాని అంశం ఏది?
1) అతని జీతభత్యాలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానం
2) తన రాజీనామా పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి
3) అతని పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్లు(ఏది ముందైతే అది)
4) కేంద్ర సమాచార కమిషన్ 2005లో ఏర్పడింది
- View Answer
- సమాధానం: 2
2. కేంద్ర సమాచార కమిషన్ పరిధిలోకి రాని అంశాలు?
1) కేబినెట్ చర్చలు
2) విదేశాలతో స్నేహం దెబ్బతినే అంశాలు
3) దేశ సార్వ భౌమత్వం, సమగ్రత
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3. పూంచీ కమిషన్ సిఫారుల్లో లేనిది?
1) గవర్నర్ పదవీకాలం ఐదేళ్లు ఉండాలి
2) గవర్నర్లను అభిశంసన ప్రక్రియ ద్వారా తొలిగించాలి
3) రాష్ర్ట శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆర్నెళ్ల లోపు నిర్ణయం తీసుకోవాలి
4) రాష్ట్ర విశ్వవిద్యాలయ చాన్సలర్‌గా గవర్నర్ ఉండే సంప్రదాయాన్ని కొనసాగించాలి
- View Answer
- సమాధానం: 4
4. కింది వాటిలో ఏకకేంద్ర లక్షణం కానిది?
1) అధికారాల విభజన
2) భారత ఎన్నికల సంఘం
3) అఖిల భారత సర్వీసులు
4) సరళ రాజ్యాంగం
- View Answer
- సమాధానం: 1
5. కేంద్ర కేబినేట్ లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు కింది వాటిలో అమలయ్యేది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) రాష్ట్రాల పరిపాలన
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి
4) ఒక రాష్ర్టంలో పరిపాలన
- View Answer
- సమాధానం: 1
6. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ర్ట శాసనసభల అభిప్రాయాన్ని తీసుకోవాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది?
1) పూంచీ కమిషన్
2) రాజమన్నార్ కమిటీ
3) సర్కారియా
4) వీరప్ప మెయిలీ
- View Answer
- సమాధానం: 2
7. రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించే విధానం కింది ఏ దేశంలో ఉంది?
1) అమెరికా
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) బ్రిటన్
- View Answer
- సమాధానం: 2
8. ఏ ఆధికరణ ప్రకారం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాలను నియంత్రించవచ్చు?
1) 358
2) 353
3) 363
4) 351
- View Answer
- సమాధానం: 2
9. రాష్ర్ట శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ రా్రష్టపతి ఆమోదం కోసం పంపినప్పుడు ఆ బిల్లును రాష్ర్టపతి తిరస్కరిస్తే...
1) మళ్లీ రాష్ర్టపతికి గవర్నర్ ద్వారా నివేదించాలి
2) ఆ బిల్లు ఆర్నెళ్ల తర్వాత రద్దవుతుంది
3) ఆ బిల్లు ఎప్పటికీ చట్టంగా రూపొందదు
4) ఆ బిల్లును ఆర్నెళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాలి
- View Answer
- సమాధానం: 3
10. ‘మంత్రులు కాకుండా ఇతర పార్లమెంట్ సభ్యులతో ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ర్టపతి దగ్గరికి వచ్చినప్పుడు..
1) రాష్ర్టపతి బిల్లును తిరస్కరించవ చ్చు
2) రాష్ర్టపతి ఆమోదం పొందవచ్చు
3) బిల్లుపై సంతకం పెట్టాలా, వద్దా అనేది ఆయన సంపూర్ణాధికారం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
11. పార్లమెంట్ ఆమోదించిన ఒక బిల్లు రాష్ర్టపతి దగ్గరికి వస్తే ఎన్ని రోజుల్లోపు రాష్ర్టపతి సంతకం చేయాలి?
1) 10 రోజులు
2) ఆర్నెళ్లలోపు
3) ఎంతకాలం అనేది రాజ్యాంగం స్పష్టం చేయలేదు
4) నెల రోజుల్లోపు
- View Answer
- సమాధానం: 3
12. రాష్ర్టపతి ఆర్డినెన్స్‌లు ఎవరి సలహా మేరకు జారీ చేస్తారు?
1) ప్రధానమంత్రి, మంత్రి మండలి
2) తన సొంత నిర్ణయంతో
3) పార్లమెంట్ సలహా మేరకు
4) సుప్రీంకోర్టు సలహా మేరకు
- View Answer
- సమాధానం: 1
13. ఏ కేసులో సుప్రీంకోర్టు ఆర్డినెన్స్‌లను కూడా న్యాయస్థానంలో న్యాయ సమీక్ష చేయవచ్చని తీర్పునిచ్చింది?
1) కూపర్ కేసు వర్సెస్ భారత ప్రభుత్వం(1970)
2) డి.సి.వాద్వా వర్సెస్ బిహార్(1987)
3) యూఎన్ రావు వర్సెస్ ఇందిరా గాంధీ(1971)
4) షంషేర్‌సింగ్ వర్సెస్ పంజాబ్(1974)
- View Answer
- సమాధానం: 1
14. దేశ పరిపాలన రాష్ర్టపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు?
1) బ్రిటన్
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
15. భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తున్న అధికరణ ఏది?
1) అధికరణ 53(1)
2) అధికరణ 75(3)
3) అధికరణ 73(3)
4) అధికరణ 75(2)
- View Answer
- సమాధానం: 2
16.కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి ఏ అధికరణలు తెలియజేస్తాయి?
1) 52 నుంచి 78
2) 52 నుంచి 79
3) 52 నుంచి 76
4) 52 నుంచి 72
- View Answer
- సమాధానం: 1
17.ఏ కారణంతో అయినా లోక్‌సభ రద్దయితే ఆపద్ధర్మ ప్రధానిని కొనసాగించి పరిపాలన చేయవచ్చు కానీ, విధాన నిర్ణయాలు చేయకూడదని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది?
1) యూ.ఎన్.ఆర్ రావు వర్సెస్ ఇందిరాగాంధీ(1971)
2) రాయ్ జనార్ కపూర్ వర్సెస్ పంజాబ్ (1955)
3) ఎం.నాగరాజ్ వర్సెస్ భారత ప్రభుత్వం (2007)
4) అశోక్ కుమార్ గుప్తా వర్సెస్ ఉత్తరప్రదేశ్ (1977)
- View Answer
- సమాధానం: 1
18. సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు పరచాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) రణధీర్ సింగ్ వర్సెస్ భారత ప్రభుత్వం(1982)
2) విశాఖ వర్సెస్ రాజస్థాన్(1997)
3) చిరంజిత్ లాల్ వర్సెస్ భారత ప్రభుత్వం(1961)
4) రాధాచరణ్ వర్సెస్ ఒడిషా(1969)
- View Answer
- సమాధానం: 3
19. పదవీ విరమణ చేసిన శాసన మండలి సభ్యులు తిరిగి వెంటనే పోటీచేయవచ్చా?
1) వెంటనే పోటీ చేయరాదు
2) పోటీ చేయవచ్చు
3) ఆరేళ్ల తర్వాత పోటీ చేయవచ్చు
4) ఐదేళ్ల తర్వాత పోటీ చేయవచ్చు
- View Answer
- సమాధానం: 2
20. విధాన పరిషత్ సభ్యుల్లో ఎన్నోవంతు మంది పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు?
1) 6/5 వంతు
2) 5/6 వంతు
3) 1/3 వంతు
4) 1/6 వంతు
- View Answer
- సమాధానం: 2
21. రాష్ర్ట గవర్నర్‌ను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది?
1) రాష్ర్ట ప్రభుత్వం
2) కేంద్ర ప్రభుత్వం
3) రాష్ర్టపతి
4) కేబినెట్
- View Answer
- సమాధానం: 3
22. రాష్ర్ట శాసనసభ సభ్యులు తమ మాతృభాషలో అభిప్రాయాలు వెల్లడించవచ్చని తెలియజేసే అధికరణ ఏది?
1) అధికరణ- 210
2) అధికరణ- 206
3) అధికరణ- 205
4) అధికరణ- 204
- View Answer
- సమాధానం: 1