వాతావరణ పీడనం - పీడన మేఖలలు
1. వాతావరణంలో ప్రతి 300 మీటర్ల ఎత్తుకు ఎన్ని మిల్లీబార్ల వాతావరణ పీడనం తగ్గుతుంది?
1) 1 మిల్లీబారు
2) 12 మిల్లీబార్లు
3) 34 మిల్లీబార్లు
4) 30 మిల్లీబార్లు
- View Answer
- సమాధానం: 3
2. పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాల మధ్య ఏర్పడిన అల్పపీడన మేఖల?
1) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల
2) ఉపధ్రువ అల్పపీడన మేఖల
3) ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖల
4) అధిక పీడన ధ్రువ మేఖల
- View Answer
- సమాధానం: 2
3. అధిక గురుత్వాకర్షణ బలాల వల్ల ఏర్పడ్డ పీడన మేఖల?
1) అధిక పీడన ధ్రువ మేఖల
2) ఉప ధ్రువ అల్పపీడన మేఖల
3) ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖల
4) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల
- View Answer
- సమాధానం: 1
4. ఉరుములు, మెరుపులతో సంభవించే వర్షపాతం?
1) చక్రవాత
2) పర్వతీయ
3) నిమ్నోన్నత
4) సంవహన
- View Answer
- సమాధానం:4
5. కింది వాటిలో అభిసరణ మండలం ఏది?
1) భూమధ్యరేఖ అల్పపీడనం
2) ఉప ఆయనరేఖ అధిక పీడనం
3) ఉపధ్రువ అల్పపీడనం
4) ధ్రువ అధిక పీడనం
- View Answer
- సమాధానం: 1
6. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) హైగ్రోమీటర్
2) హైడ్రోమీటర్
3) బార్మీటర్
4) ప్రెజర్ గేజ్
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో ఏ గాలి ఎక్కువ పీడనాన్ని కలిగిస్తుంది?
1) తడి గాలి
2) పొడి గాలి
3) రెండూ సమాన పీడనాన్ని కలగజేస్తాయి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
8. భూమధ్యరేఖ అల్పపీడన మండలం ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
1) 0°-15°
2) 0°-5°
3) 20°-40°
4) 66½°-90°
- View Answer
- సమాధానం: 2
9. సంవహన ప్రక్రియ అధికంగా జరిగే మండలం?
1) భూమధ్యరేఖ అల్పపీడన మండలం
2) ఉప ఆయనరేఖ అధిక పీడన మండలం
3) ఉపధ్రువ అల్పపీడన మండలం
4) ధ్రువ అధిక పీడన మండలం
- View Answer
- సమాధానం: 1
10. పీడన ప్రవణత అంటే?
1) ఉత్తరం నుంచి దక్షిణ దిశగా ప్రతి యూనిట్ దూరానికి పీడనంలో చోటు చేసుకునే వ్యత్యాసం
2) ప్రతి యూనిట్ దూరానికి పీడనంలో చోటు చేసుకునే తరుగుదల
3) ప్రతి యూనిట్ దూరానికి పీడనం పెరుగుదల
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2