‘నిర్విక్’ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
- భారత్ 1991 తర్వాత అవలంభించిన సరళీకరణ విధానాలు స్థూల దేశీయోత్పత్తి వృద్ధిలో పెరుగుదలకు కారణమయ్యాయి. భారత్ మార్కెట్ కాపిటలైజేషన్ 2018 డిసెంబర్‌లో నామినల్ జి.డి.పి.లో 76.4 శాతంగా నమోదైంది.
- అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయంలో నామినల్ జి.డి.పి. పరంగా ప్రపంచంలో భారత్ ఏడో స్థానం పొందింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత్ నామినల్ జి.డి.పి.ని 2.308 ట్రిలియన్ డాలర్లగా అంచనా వేసింది. నామినల్ జి.డి.పి. పెరుగుదలకు దేశీయంగాను, అంతర్జాతీయంగాను భారతీయ కంపెనీల వాణిజ్య వృద్ధిలో పెరుగుదల కారణమైంది. గత రెండు సంవత్సరాలుగా భారత జి.డి.పి. వృద్ధిలో తగ్గుదల నేపథ్యంలో భారత ప్రభుత్వం వృద్ధిని వేగవంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టింది. కొంత కాలంగా పెట్టుబడి రేటు తగ్గుదల, వినియోగం తగ్గుదల, సేవా రంగ వృద్ధి క్షీణత, విదేశీ రంగంలో వృద్ధి క్షీణత, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల పరపతి వృద్ధి క్షీణతతో పాటు కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ విధానాలు ఇటీవలి కాలంలో వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయి.
- తయారీ రంగం, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం, బ్రాడ్ కాస్టింగ్ లాంటి రంగాల వృద్ధిపై దృష్టి సారించాలని ఆర్.బి.ఐ. వార్షిక నివేదిక 2018-19 వెల్లడించింది. పెట్టుబడుల పెంపునకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2009-14 మధ్య కాలంలో బ్యాంకింగ్ పరపతి వృద్ధిలో పెరుగుదల కారణంగా 2014 తర్వాత కాలంలో బ్యాంకింగ్ రంగంలో రికవరీ కాని రుణాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ తన డివిడెండు, మిగులు నిల్వలో ఉన్న రూ.1,76,000 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తంలో రూ.1,23,414 కోట్లు 2018-19 మిగులు కాగా రూ.52,637 కోట్లు సవరించిన ఆర్థిక మూలధన ఊట్చఝ్ఛ ఠీౌటజు కింద గుర్తించిన అదనపు నియమం ప్రకారం బదిలీ చేస్తారు. ఆర్.బి.ఐ. నుంచి మిగులు నిధుల బదిలీ కారణంగా ప్రభుత్వ రాబడి పెరిగి ద్రవ్యలోటు తగ్గుతుందని అంచనా. ద్రవ్య విధాన చర్యలను నిర్వర్తించడానికి, కరెన్సీ విలువలో ఒడిదుడుకులను తగ్గించడానికి, బాండ్ల విలువలో తగ్గుదలను అరికట్టడానికి, బహిరంగ మార్కెట్ చర్యల సంబంధిత స్థిరీకరణ వ్యయాల నిమిత్తం, అంతిమ రుణ దాత విధిని నిర్వర్తించే క్రమంలో క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవడానికి రిజర్వు బ్యాంక్ సరిపోయినంత మూలధన నిల్వలను కలిగి ఉండాలి.
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వదేశీ కంపెనీలు, నూతన స్వదేశీ తయారీ కంపెనీలకు కార్పొరేషన్ పన్ను రేటును తగ్గిస్తున్నట్లు 2019 సెప్టెంబర్ 20న ప్రకటించారు. కార్పొరేషన్ పన్ను రేటును తగ్గిస్తూ ఆర్డినెన్‌సను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. పన్ను మినహాయింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
- స్వదేశీ కంపెనీలు, నూతన స్వదేశీ తయారీ కంపెనీలకు సంబంధించి అన్ని సెస్‌లు, సర్‌ఛార్జీలు కలుపుకొని కార్పొరేషన్ పన్ను 25.17 శాతంగా ఉంటుంది. కార్పొరేషన్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం జరిగింది.
- మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని వేగవంతం చేసే క్రమంలో తయారీ రంగంలో అధిక పెట్టుబడులను ఆకర్షించడానికి ఆదాయపు పన్ను చట్టంలో 2019-20 నుంచి నూతన సవరణ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టంలో భాగంగా 2019 అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో నూతన పెట్టుబడులకు సంబంధించి నూతన స్వదేశీ కంపెనీలపై ఆదాయపు పన్ను రేటును 15 శాతంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అన్ని విధాలైన సెస్‌లు, సర్‌ఛార్జీలు కలుపుకొని ఆదాయపు పన్నును తయరీ రంగ కంపెనీలు 17.01 శాతం చెల్లించాలి.
- ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి 2019-20 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో మరో నియమాన్ని ప్రతిపాదించారు. ఏ విధమైన ప్రోత్సాహకాలు, మినహాయింపులు పొందని స్వదేశీ కంపెనీలపై 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను రేటును 22 శాతంగా ప్రతిపాదించారు. అన్ని విధాలైన సెస్‌లు, సర్‌ఛార్జీలు కలుపుకొని ఆదాయపు పన్ను రేటు ఆయా కంపెనీలపై 25.17 శాతంగా ఉంటుంది. ఆయా కంపెనీలను ‘కనీస ప్రత్యామ్నాయ పన్ను’ నుంచి మినహాయించారు.
- ప్రోత్సాహకాలు, మినహాయింపులను పొందుతున్న కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్నును ప్రస్తుతమున్న 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు.
- 2019 జూలై 5 ముందు కాలంలో షేర్ల తిరిగి కొనుగోలును ప్రకటించిన లిస్టెడ్ కంపెనీల విషయంలో షేర్ల తిరిగి కొనుగోలుపై పన్ను మినహాయించారు.
- మూలధన మార్కెట్‌లో నిధుల ప్రవాహాన్ని స్థిరీకరించడానికి 2019 జూలై బడ్జెట్‌లో పెంచిన సర్‌ఛార్జి, కంపెనీ ఈక్విటీ షేర్లను విక్రయించినప్పుడు కలిగే మూలధన రాబడికి వర్తించదు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ఏదైనా సెక్యూరిటీని విక్రయించినప్పుడు కలిగే మూలధన రాబడికి కూడా పెంచిన సర్‌ఛార్‌జ వర్తించదని ఆర్థిక మంత్రి ప్రక టించారు.
- భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని వేగవంతం చేయడానికి ఆర్థిక మంత్రి ప్రకటించిన Stimulus విలువ రూ.1.45 లక్షల కోట్లు. ఈ మొత్తం జి.డి.పి.లో 1 శాతానికి సమానం. తద్వారా పెట్టుబడి, వృద్ధిలో పెరుగుదల సంభవిస్తుందని అంచనా.
1. రిజర్వు బ్యాంక్ 2018-19 వార్షిక నివేదికలో కింది ఏ రంగాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించింది?
ఎ) తయారీ రంగం
బి) రవాణా, సమాచారం
సి) వాణిజ్యం, హోటళ్లు
డి) బ్రాడ్ కాస్టింగ్
1) ఎ, సి
2) బి, డి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
2. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు ఎప్పటి నుంచి వర్తిస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు?
1) 2019 మార్చి 1
2) 2019 ఏప్రిల్ 1
3) 2019 జూలై 1
4) 2019 సెప్టెంబర్ 20
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో ప్రపంచ నవకల్పన సూచీ 2019ని రూపొందించింది ఏది?
1) కార్నెల్ యూనివర్సిటీ, INSEAD, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్
2) హార్వార్డ యూనివర్సిటీ, హెరిటేజ్ ఫౌండేషన్
3) ఆక్స్ఫర్డ యూనివర్సిటీ, INSEAD
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
4. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కింది వాటిలో దేనికి సంబంధించిన ప్రత్యేక ఏజెన్సీ?
1) ప్రపంచ బ్యాంక్
2) ఐ.ఎం.ఎఫ్
3) ఐక్యరాజ్యసమితి
4) ఆసియా అభివృద్ధి బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
5. రిజర్వ బ్యాంక్ మూలధన నిల్వను నిర్వహించడానికి కారణం ఏమిటి?
ఎ) కరెన్సీ విలువలో ఒడిదుడుకులను తగ్గించడానికి
బి) బాండ్ల విలువలో తగ్గుదలను అరికట్టడానికి
సి) క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవడానికి
డి) బహిరంగ మార్కెట్ చర్యల సంబంధిత స్థిరీకరణ వ్యయాల నిమిత్తం
1) ఎ మాత్రమే
2) బి, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
6. స్వదేశీ కంపెనీలపై సర్‌ఛార్జి, సెస్‌లను కలుపుకొని కార్పొరేషన్ పన్నును ఎంతగా ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది?
1) 22.17 శాతం
2) 25.17 శాతం
3) 28.17 శాతం
4) 29.17 శాతం
- View Answer
- సమాధానం: 2
7. ఏ విధమైన ప్రోత్సాహకాలు, మినహాయింపులు పొందని స్వదేశీ కంపెనీలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను రేటును ఎంతగా ప్రతిపాదించింది?
1) 22%
2) 25%
3) 27%
4) 28%
- View Answer
- సమాధానం: 1
8. బహుమతి పన్నును కింది ఏ కమిటీ సిఫార్సుపై ప్రవేశపెట్టారు?
1) రాజా చెల్లయ్య
2) ఎస్. చక్రవర్తి
3) కాల్డర్
4) పార్థదాస్ గుప్తా
- View Answer
- సమాధానం: 3
9.నిలకడ గల అభివృద్ధి కింది వాటిలో దేనితో సాధ్యమవుతుంది?
ఎ. సుస్థిర వ్యవసాయాభివృద్ధి
బి. గ్రీన్ హౌస్ వాయువు విడుదలను తగ్గించుకోవడం
సి. పట్టణీకరణ, పారిశ్రామికాభివృద్ధిలో పర్యావరణ అంశాల ప్రాధాన్యత
డి. జీవ పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటు
1) ఎ మాత్రమే
2) బి, సి
3) ఎ, బి, సి, డి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
10. ప్రపంచ నవకల్పన సూచీ-2019లో భారత్ స్థానం?
1) 42
2) 52
3) 62
4) 81
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో కోశ విధాన లక్ష్యం ఏమిటి?
ఎ) వనరుల సమీకరణ
బి) ఆర్థికాభివృద్ధి
సి) ఆదాయపునఃపంపిణీ
డి) పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
12.పర్యావరణ అభివృద్ధిపై 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో నిలకడగా ఉన్న అభివృద్ధికి సంబంధించి ఎన్ని నియమాలను తెలియజేశారు?
1) 17
2) 27
3) 32
4) 34
- View Answer
- సమాధానం: 2
13. పన్నెండో పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) సత్వర, సమ్మిళిత, నిలకడ ఉన్న అభివృద్ధి పన్నెండోప్రణాళిక లక్ష్యం
2) ఈ ప్రణాళికలో సుస్థిరత్వ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చారు
3) వనరుల కేటాయింపులో పరిశ్రమలు, ఖనిజాలకు ప్రాధాన్యత ఇచ్చారు
4) అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణం వల్ల కలిగే పర్యవసనాలను విస్మరించడం సాధ్యం కాదని ప్రణాళిక పేర్కొంది.
- View Answer
- సమాధానం: 3
14. 1972లో ‘లిమిట్స్ టు గ్రోత్’ గ్రంథాన్ని రచించింది ఎవరు?
1) డి.హెచ్. మెడోస్
2) రేచల్ కార్సన్
3) రాబిన్సన్
4) పాల్క్రూగ్మన్
- View Answer
- సమాధానం: 1
15. భవిష్యత్ తరాలవారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల వారు తమ అవసరాలను తీర్చుకోగలగడమే నిలకడగా ఉన్న అభివృద్ధిగా వర్ణించిన సంస్థ?
1) ఐక్యరాజ్యసమితి
2) బ్రిట్లాండ్ క మిషన్
3) ప్రపంచ ఆరోగ్య సంస్థ
4) ప్రపంచ వాణిజ్య సంస్థ
- View Answer
- సమాధానం: 2
16. ‘సెలైంట్ స్ప్రింగ్’ గ్రంథ రచయిత ఎవరు?
1) రేచెల్ కార్సన్
2) శామ్యుల్సన్
3) శ్యాంపిట్రోడా
4) కీన్స్
- View Answer
- సమాధానం: 1
17. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపును 1972లో సిఫార్సు చేసిన కమిటీ ఏది?
1) వాంఛూ కమిటీ
2) కాల్డర్ కమిటీ
3) కె.ఎన్. రాజ్ కమిటీ
4) రాజా చెల్లయ్య కమిటీ
- View Answer
- సమాధానం: 3
18. సెక్యూరిటీల లావాదేవీలపై పన్నును కింది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1997
2) 2004
3) 2006
4) 2008
- View Answer
- సమాధానం: 2
19. ధరిత్రి సదస్సు ఎజెండా-21లో ప్రస్తావించని అంశం ఏది?
1) పేదరికాన్ని తొలగించడం
2) సహజ వనరుల పరిరక్షణ
3) దేశాల మధ్య సరిహద్దు వివాదాల తొలగింపు
4) అత్యవసర సేవలు అందరికీ అందుబాటు
- View Answer
- సమాధానం: 3
20. కింది ఏ బ్యాంక్ మనీ విత్ డ్రాయల్ (withdraw)కు సంబంధించి రూ.1000 పరిమితిని రిజర్వు బ్యాంక్ ఇటీవల విధించింది?
1) పంజాబ్, మహారాష్ర్ట కోఆపరేటివ్ బ్యాంక్
2) అలహాబాద్ బ్యాంక్
3) ఇండియన్ బ్యాంక్
4) మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
21. నిర్విక్ (NIRVIK) పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
1) మానవాభివృద్ధి
2) ఎగుమతిదారులకు రుణ లభ్యత పెంపు
3) ఆర్థిక అసమానతల తొలగింపు
4) వ్యవసాయదారులకు పరపతి
- View Answer
- సమాధానం: 2
22. 2019 సెప్టెంబర్ 12న రాంచీలో ప్రధానమంత్రి ప్రారంభించిన జాతీయ పెన్షన్ పథకం కింద అర్హులు ఎవరు?
ఎ) దుకాణదారులు
బి) రిటైల్ వర్తకులు
సి) స్వయం ఉపాధి పొందేవారు
డి) వ్యవసాయ కార్మికులు
1) ఎ, బి
2) బి మాత్రమే
3) ఎ, బి, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
23. ఇండియన్ బ్యాంక్‌లో ఏ బ్యాంక్ విలీనాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది?
1) అలహాబాద్ బ్యాంక్
2) ఆంధ్రా బ్యాంక్
3) కార్పొరేషన్ బ్యాంక్
4) సిండికేట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
24. భారత్‌లో కొరతగా ఉన్న ఖనిజ వనరులు ఏవి?
1) మైకా, బాక్సైట్
2) ఇనుము, మాంగనీస్
3) కాపర్, జింక్, గ్రాఫైట్
4) లైమ్‌స్టోన్, డోలమైట్
- View Answer
- సమాధానం: 3
25. ప్రోత్సాహకాలు, మినహాయింపులు పొందుతున్న కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5 శాతం నుంచి ఎంతకు త గ్గించారు?
1) 12 శాతం
2) 15 శాతం
3) 16 శాతం
4) 17 శాతం
- View Answer
- సమాధానం: 2
26. ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించిన పన్ను ప్రోత్సాహకాలు/మినహాయింపుల విలువ ఎంతగా ఉంటుందని అంచనా?
1) రూ.1,45,000 కోట్లు
2) రూ.1,57,000 కోట్లు
3) రూ.1,76,000 కోట్లు
4) రూ.1,96,000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
27. నిర్విక్ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది?
1) ఎక్స్పోర్ట్ క్రె డిట్ గ్యారంటీ కార్పొరేషన్
2) రిజర్వు బ్యాంక్
3) ఆసియా అభివృద్ధి బ్యాంక్
4) ఐసీఐసీఐ
- View Answer
- సమాధానం: 1